నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురు | SC dismisses controversial godman Nithyananda's plea | Sakshi
Sakshi News home page

నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Published Wed, Sep 3 2014 11:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురు - Sakshi

నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకుండా చూడాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పురుషత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి  కర్ణాటక హై కోర్టు గత నెలలో అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై అంతకుముందు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు స్టే తొలగించింది. దీంతో నిత్యానంద పురుషత్వ, రక్త తదితర పరీక్షలు చేయించేకోవాల్సివుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement