ఫేస్‌బుక్‌ పోస్టులతో విద్యార్థిని ఆత్మహత్య | Schoolgirl Jumps to Death After Classmate Posts Obscene Messages on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పోస్టులతో విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Oct 29 2015 1:42 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఫేస్‌బుక్‌ పోస్టులతో విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఫేస్‌బుక్‌ పోస్టులతో విద్యార్థిని ఆత్మహత్య

ముంబై: ఫేస్‌బుక్‌లో తన పేరిట తోటి విద్యార్థి అశ్లీల పోస్టులు పెట్టడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముంబైలో 14 ఏళ్ల బాలిక ఏడు అంతస్తుల అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి తనువు చాలించింది. ఈ ఘటనకు కారణమైన ఆమె క్లాస్‌మేట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత బాలిక పదో తరగతి విద్యార్థిని. ఆమె పాఠశాలకు వెళుతున్న సమయంలో ఆ విద్యార్థి వేధించాడని గతంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని పోలీసు స్టేషన్‌కు పిలిచి మందలించి పంపించారు.

దీంతో పగ పెంచుకున్న ఆ అబ్బాయి..  ఫేస్‌బుక్‌లో బాలిక పేరిట ఓ నకిలీ అకౌంట్‌ను సృష్టించాడు. ఆ అకౌంట్‌ లో అశ్లీలమైన పోస్టులు పెట్టాడు. ఈ విషయం తెలియడంతో మనస్తాపం చెందిన బాలిక ఈ నెల 20న తన అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ కేసులో బాలుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. అతడు మైనర్ కావడంతో జువెనైల్ హోంకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement