సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు
ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో కొనుగోళ్ల ప్రభావంతో భారత ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 86.55 పాయింట్ల లాభంతో 21337 వద్ద క్లోజైంది. వరుసగా మూడో రోజు లాభపడి గతంలో డిసెంబర్ 9 తేదిన నమోదైన ఆల్ టైమ్ రికార్డు 21326 పాయింట్లను అధిగమించింది.
గత రెండు సెషన్లలో 187 పాయింట్లు లాభపడింది. రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే వార్తలతో బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాలతో ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 63338 పాయింట్ల వద్ద ముగిసింది.
సన్ ఫార్మా, టాటా స్టీల్, లుపిన్, బీపీసీఎల్, హిండాల్కో కంపెనీలు లాభాలతో ముగిసాయి. ఏషియన్ పెయింట్స్, ఎస్ బీఐ, కెయిర్న్ ఇండియా, ఏసీసీ, గ్రాసీం కంపెనీల షేర్లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.