ఫెడ్ ఎఫెక్ట్: నష్టాల్లో మార్కెట్లు
Published Wed, Dec 14 2016 5:01 PM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
ఫెడరల్ రిజర్వు నుంచి వెలువడే ప్రకటనల భయాందోళనతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 94.98 పాయింట్ల నష్టంతో 26,602.84వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్ల నష్టంతో 8182.45వద్ద ముగిసింది. రెండు రోజుల ఫెడరల్ రిజర్వు భేటీ నేడు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎలాంటి ప్రకటన వెలువరుస్తుందో అని అంతర్జాతీయంగా, దేశీయంగా ఆందోళనలు నెలకొన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. 25 బేసిస్ పాయింట్లను పెంచుతారని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి.
అయితే అమెరికా ఎకనామిక్ అవుట్లుక్, ద్రవ్యోల్బణం, మరోసారి రేట్లపెంపుపై ఫెడరల్ రిజర్వు ఎలాంటి కామెంట్లు చేస్తుందోననే దానిపై పెట్టుబడిదారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఒకవేళ వర్ధమాన దేశాలకు ప్రతికూలంగా కామెంట్లు వెలువడితే, మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యూరోపియన్ స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. దేశీయ మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు 0.8 శాతం చొప్పున పడిపోయాయి.
Advertisement