ముంబై : ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనున్న తరుణంలో మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 75 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 65.02 పాయింట్ల లాభంతో 28,124గా ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ 25.45 పాయింట్లు లాభంతో 8675.75గా నమోదవుతోంది. కన్సూమర్ డ్యూరబుల్స్ నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మినహా మిగతా అన్నీ రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
క్యూ 1 ఫలితాలతో అరబిందో ఫార్మా కంపెనీకి వెల్లువెత్తుతున్న కొనుగోలు మద్దతు గురువారం ట్రేడింగ్లో కూడా కొనసాగుతోంది. రెండో రోజు కూడా వరుసగా అరబిందో ఫార్మా నిఫ్టీలో టాప్ గెయినర్గా నిలుస్తోంది. హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో స్టాక్స్ 1 శాతం మేర లాభాలను నమోదుచేస్తున్నాయి. టెక్ దిగ్గజం విప్రో నిఫ్టీలో టాప్ లూజర్గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా వెల్స్పన్ షేర్లు పతనమవుతున్నాయి. కాగా నేటితో డెరివేటివ్స్ గడువు ముగుస్తుండడంతో బుధవారం ట్రేడింగ్లో షార్ట్కవరింగ్ సూచీలకు లాభాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.04 పైసలు బలహీనపడి 67.10గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 334 రూపాయలు క్షీణించి 31,036గా నమోదవుతోంది.