F&O expiry day
-
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్చి నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ ట్రేడింగ్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉదయం సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 57,752 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 455 పాయింట్ల పరిధిలో 57,495 వద్ద కనిష్టాన్ని, 57,949 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 40 పాయింట్ల నష్టంతో 57,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,032 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 16,914 –17,062 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 34 పాయింట్లు పతనమై 16,952 వద్ద ముగిసింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.79%, 0.42 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1531 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను విక్రయించారు. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 82.16 స్థాయి వద్ద స్థిరపడింది. వేదాంతా డివిడెండ్ రూ. 20.5 వేదాంతా లిమిటెడ్ వాటాదారులకు ఐదో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 20.5 చొప్పున చెల్లించనుంది. ఇందుకు ఏప్రిల్ 7 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం రూ. 7,621 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
రికవరీకి అవకాశాలు
ముంబై: గతవారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, ట్రేడింగ్‌కు సంబంధించి ఈ ఏడాదికి ఇదే ఆఖరి వారం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. కావున భారీ లాభాలైతే కనిపించకపోవచ్చు. ప్రపంచ పరిణామాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో గతవారంలో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ‘సాధారణంగా ప్రతి ఏడాది చివరి రోజుల్లో ఫండ్ మేనేజర్లు ఖాతాల్లో సర్దుబాట్లు చేస్తుంటారు. అందులో భాగంగానే గతవారంలో లాభాల స్వీకరణ జరిగింది. సూచీలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చు. రికవరీ జరిగితే నిఫ్టీకి 18,000 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,700 స్థాయిలో తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోతే 17400 వద్ద మరో మద్దతు స్థాయి లభించొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7 ఆందోళనలు చైనాతో పాటు పలు కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసుల నమోదు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌పై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.., కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లపై ఈ రకం వేరియంట్ కేసలు నమోదు ప్రభావం స్వల్పకాలం పాటు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ► ఆర్థిక గణాంకాలు చైనా, జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వరుస మంగళ, బుధవారాల్లో విడుదల కానున్నాయి. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం, భారత నవంబర్ ద్రవ్యలోటు శుక్రవారం వెల్లడి కానున్నాయి. అదేరోజున ఆర్బీఐ డిసెంబర్ 23 తేదీన ముగిసి వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 16వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ► ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(డిసెంబర్ 30న) నిఫ్టీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,500–17,800 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ► రెండు లిస్టింగులు, రెండు పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది ఆఖరి వారంలో రెండు ఐపీఓలు రాను న్నాయి. అలాగే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న రెండు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నా యి. గతవారంలో (23న) ప్రారంభమైన రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ మంగళవా రం ముగిస్తుంది. షాలీ పాలీమర్స్ ఇష్యూ డిసెంబర్ 30–జనవరి 22 తేదీల మధ్య జరగనుంది. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ గురువారం ఉండగా, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ షేర్ల లిస్టింగ్ శుక్రవారం ఉంది. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
మార్కెట్లో ఒడిదుడుకులే..?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయన్నారు. ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.., ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు(గురువారం) తేదీ ఉంది. అదే రోజున జూన్ ద్రవ్యలోటు, మే మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా, మరుసటి రోజున(జూలై 1న) ఆటో కంపెనీల జూన్ విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, కోవిడ్ కేసులు అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. కమోడిటీ ధరలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూలతలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు కనిష్ట స్థాయి నుంచి రెండున్నర శాతం రికవరీ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 1,368 పాయింట్లు, నిఫ్టీ 406 చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 15,700 స్థాయి వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 15,900–16,250 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రెండ్ బేర్స్‌కు అనుకూలంగా మారితే దిగువస్థాయిలో 15,350 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ► క్రూడాయిల్ కదలికలు ఇటీవల గరిష్టాలకు(127.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్ ధర శుక్రవారం నాటికి 113.12 డాలర్లగా ఉంది. ‘‘ప్రస్తుతానికి క్రూడ్ ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రతికూలతలు సద్దుమణిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు తిరిగి పెరొగొచ్చు’’ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ జూన్‌లో రూ.46,000 కోట్లు, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి(జూన్ 24వ తేదీ నాటికి) వరకు రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌లు కఠినతర ద్రవ్య విధాన అమలు తదితర అంశాలు ఎఫ్ఐఐల విక్రయాలకు కారమణని యస్ సెక్యూరిటీస్ ఇస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ జైన్ తెలిపారు. గురువారం ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈ గురువారం(జూన్ 30న) నిఫ్టీ సూచీకి చెందిన జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. ► శుక్రవారం ఆటో విక్రయ గణాంకాలు దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం జూన్ నెల వాహన విక్రయాలు గణాంకాలను వెల్లడించనున్నాయి. ఆటో డేటా విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, ఎస్కార్ట్స్ షేర్లు అధిక పరిమాణంలో ట్రేడయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడంతో గత వారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా ఏడు శాతం ర్యాలీ చేసింది. వార్షిక ప్రాతిపదికన ‘‘లో బేస్ ఎఫెక్ట్’’తో మెరుగైన గణాంకాలు నమోదు కావచ్చు. ► అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా మే నెల గృహ అమ్మక గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఎల్లుండి యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ యూరోపియన్ యూనియన్ జూన్ పారిశ్రామిక, సేవా రంగ గణాంకాలు(జూన్ 29న) విడుదల అవుతాయి. అదే రోజున జపాన్ రిటైల్ విక్రయాలు వెల్లడి అవుతాయి. ఆ మరుసటి రోజున(జూన్ 30)న అమెరికా నిరుద్యోగ గణాంకాల డేటా వెల్లడి అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. -
ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీపై ఇన్వెస్టర్ల దృష్టి!
వచ్చే వారం అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం(29న) ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుంది. శుక్రవారం(30) నుంచీ నవంబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోగా.. ఈ వారం మరికొన్ని బ్లూచిప్ కంపెనీలు పనితీరు వెల్లడించనున్నాయి. వెరసి.. అటు ఎఫ్‌అండ్‌వో, ఇటు కంపెనీల ఫలితాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. జాబితా ఇలా ఈ వారంక్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలను విడుదల చేయనున్న ప్రధాన కంపెనీల జాబితా చూద్దాం.. కొటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 26న, ఎయిర్టెల్, టాటా మోటార్స్ 27న, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో, ఎల్అండ్టీ, టైటన్ 28న పనితీరు వెల్లడించనున్నాయి. ఇదే విధంగా బీపీసీఎల్, మారుతీ సుజుకీ 29న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇతర అంశాలూ ఈ నెల 28 నుంచీ బీహార్‌లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ సరళితోపాటు.. పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీ, అధ్యక్ష ఎన్నికలపై అంచనాలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాంకేతికంగా క్యూ2లో సిమెంట్ విక్రయాలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలు ఆర్థిక రికవరీని సూచిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. మార్కెట్లకు ఎఫ్‌పీఐలు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మార్కెట్లు ప్రస్తుతం సైడ్‌వేస్ ట్రేడింగ్ జోన్లోకి ప్రవేశించినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఇకపై నిఫ్టీకి 12,050 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకానున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 11,600 స్థాయిలో బలమైన సపోర్ట్ లభించే వీలున్నదని తెలియజేశారు. గత వారం స్వల్ప పరిధిలో కదిలిన నిఫ్టీ ఇటీవలి రెసిస్టెన్స్‌కు సమీపంలో నిలిచినట్లు వివరించారు. ప్రస్తుతం ట్రెండ్ సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్ల బలహీనతలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అభిప్రాయపడ్డారు. ఇటీవల సిమెంట్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ కౌంటర్లు జోరు చూపడంతో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని భావిస్తున్నారు. అంతేకాకుండా సమీప భవిష్యత్‌లో రంగాలవారీగా ప్రాధాన్యతలు మారే వీలున్నట్లు ఊహిస్తున్నారు. -
ఎఫ్‌అండ్‌వో ముగింపు- నేడు మార్కెట్లెటు?
నేడు (30న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 11,232 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,212 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. దీంతో 0-0.25 శాతం స్థాయిలో ఫెడ్ ఫండ్స్ రేట్లు కొనసాగనున్నాయి. కోవిడ్-19 కారణంగా మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు అన్నివిధాలా మద్దతిచ్చే చర్యలు చేపడతామని ఫెడ్ చైర్మన్ పావెల్ తెలియజేశారు. దీంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 0.6-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ అంశాలకుతోడు.. నేడు జులై డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. చివర్లో అమ్మకాల దెబ్బ మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. సెన్సెక్స్ 422 పాయింట్లు పతనమై 38,071 వద్ద నిలవగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 11,203 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,884 వద్ద కనిష్టాన్నీ చేరింది. ఇక నిఫ్టీ 11,351-11,150 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,121 పాయింట్ల వద్ద, తదుపరి 11,040 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,313 పాయింట్ల వద్ద, ఆపై 11,423 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,873 పాయింట్ల వద్ద, తదుపరి 21,670 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,313 పాయింట్ల వద్ద, తదుపరి 22,550 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 353 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఫ్యూచర్స్ ఎక్స్పైరీ.. ర్యాలీకి కారణం!
మేనెల డెరివేటివ్స్ సీరిస్ ముగింపు కారణంగానే బుధవారం, గురువారం సూచీల్లో మంచి ర్యాలీ వచ్చిందని అనలిస్టు రజత్ శర్మ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఇప్పట్లో భారీగా పడవని భావించిన ఇన్వెస్టర్లు షార్ట్‌కవరింగ్‌కు దిగారని, అందుకే ర్యాలీ వచ్చిందని చెప్పారు. కేవలం షార్ట్‌కవరింగ్ మినహాయించి ఇంత ర్యాలీ జరిపేందుకు ఫండమెంటల్స్ ఏమీ సానుకూల మార్పులు రాలేదని గుర్తు చేశారు. నిజానికి బ్యాంకుల ఫలితాలు చూస్తే పెద్దగా బాగాలేవని అర్ధం అవుతుందని, ప్రొవిజన్లు పెరిగాయని చెప్పారు. అందువల్ల వీటిపై పెద్దగా ఆసక్తి లేదని, తాజా ర్యాలీ చూసి వెంటనే బ్యాంకు షేర్ల వెంట పడాల్సిన అవసరం లేదని తెలిపారు. మార్కెట్లు వాస్తవిక ధృక్పధాన్ని ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఇప్పటికీ నిఫ్టీ పీఈ అధికంగానే ఉందని, అందువల్ల జూన్ సీరిస్‌లో కూడా ఇన్వెస్టర్లు షార్ట్స్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారని అంచనా వేశారు. దీంతో వచ్చే ఎక్స్పైరీ సమయంలో కూడా ఇదే తరహా ర్యాలీ ఉండొచ్చన్నారు. లాక్డౌన్ ముగిసే సమయాన్ని బట్టి ఎకానమీపై ప్రభావాన్ని అంచనా వేయవచ్చని శర్మ చెప్పారు. అయితే ఏడాది చివరకల్లా కార్పొరేట్ ఎర్నింగ్స్ రికవరీ చూపుతాయని తాను భావించడంలేదన్నారు. ఇలాంటి అంచనాలతోనే మార్కెట్లో వాస్తవికతకు అవకాశం లేకుండా పోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్టుఫోలియోలో స్వల్పమొత్తాలనే ఈక్విటీకి కేటాయించడం మేలని సూచించారు. మిగిలిన మొత్తాన్ని రాబడి తక్కువవచ్చినా సరే అసెట్స్ లేదా బాండ్స్‌లో ఉంచడం మంచిదన్నారు. దీనివల్ల మార్కెట్లో అనూహ్య పతనాలు వచ్చినా పెద్దగా నష్టం ఉండదని చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసాక ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేమని అన్నారు. అందువల్ల అప్రమత్తతే కీలకమని సూచించారు. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
డిసెంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఒడిదుడుకుల మయంగా సాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 12.72 పాయింట్ల నష్టంలో 26,197గా కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 11 పాయింట్ల నష్టాల నుంచి 2.15 పాయింట్ల లాభాల్లో 8,037గా నడుస్తోంది. హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాలు పాలవుతుండగా.. యాక్సిస్ బ్యాంకు, లుపిన్, సిప్లా, మహింద్రా అండ్ మహింద్రా, ఎస్బీఐ లాభాల్లో నడుస్తున్నాయి. డెరివేటివ్‌ల కాంట్రాక్టు గడువు నేటితో ముగియనుండటంతో మార్కెట్లు సతమతమవుతున్నట్టు విశ్లేషకులు చెప్పారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా 68.24 వద్ద ప్రారంభమైంది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర రెండో రోజు లాభాలో ప్రారంభమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ.136 లాభంతో 27,306గా నమోదవుతోంది. గత కొద్ది వారాల లాభాల అనంతరం వాల్ స్ట్రీట్ మార్కెట్లు పడిపోవడంతో ఆసియన్ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనున్న తరుణంలో మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 75 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 65.02 పాయింట్ల లాభంతో 28,124గా ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ 25.45 పాయింట్లు లాభంతో 8675.75గా నమోదవుతోంది. కన్సూమర్ డ్యూరబుల్స్ నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మినహా మిగతా అన్నీ రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. క్యూ 1 ఫలితాలతో అరబిందో ఫార్మా కంపెనీకి వెల్లువెత్తుతున్న కొనుగోలు మద్దతు గురువారం ట్రేడింగ్‌లో కూడా కొనసాగుతోంది. రెండో రోజు కూడా వరుసగా అరబిందో ఫార్మా నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో స్టాక్స్ 1 శాతం మేర లాభాలను నమోదుచేస్తున్నాయి. టెక్ దిగ్గజం విప్రో నిఫ్టీలో టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా వెల్స్పన్ షేర్లు పతనమవుతున్నాయి. కాగా నేటితో డెరివేటివ్స్ గడువు ముగుస్తుండడంతో బుధవారం ట్రేడింగ్‌లో షార్ట్‌కవరింగ్ సూచీలకు లాభాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.04 పైసలు బలహీనపడి 67.10గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 334 రూపాయలు క్షీణించి 31,036గా నమోదవుతోంది.