ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
Published Thu, Dec 29 2016 9:58 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
డిసెంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఒడిదుడుకుల మయంగా సాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 12.72 పాయింట్ల నష్టంలో 26,197గా కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 11 పాయింట్ల నష్టాల నుంచి 2.15 పాయింట్ల లాభాల్లో 8,037గా నడుస్తోంది. హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాలు పాలవుతుండగా.. యాక్సిస్ బ్యాంకు, లుపిన్, సిప్లా, మహింద్రా అండ్ మహింద్రా, ఎస్బీఐ లాభాల్లో నడుస్తున్నాయి.
డెరివేటివ్ల కాంట్రాక్టు గడువు నేటితో ముగియనుండటంతో మార్కెట్లు సతమతమవుతున్నట్టు విశ్లేషకులు చెప్పారు. అటు డాలర్తో రూపాయి మారకం విలువ ఫ్లాట్గా 68.24 వద్ద ప్రారంభమైంది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర రెండో రోజు లాభాలో ప్రారంభమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ.136 లాభంతో 27,306గా నమోదవుతోంది. గత కొద్ది వారాల లాభాల అనంతరం వాల్ స్ట్రీట్ మార్కెట్లు పడిపోవడంతో ఆసియన్ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
Advertisement
Advertisement