నిన్న మెరుపులు...నేడు ఫ్లాట్
Published Thu, Feb 2 2017 9:55 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
బడ్జెట్ మెరుపులు మెరిపించిన బుధవారం మార్కెట్లు, గురువారానికి వచ్చేసరికి ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. నిన్న 486 పాయింట్ల ర్యాలీ జరిపిన సెన్సెక్స్ నేటి మార్నింగ్ సెషన్లో స్వల్పంగా 9 పాయింట్ల లాభంలో 28,150 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 3.20 పాయింట్ల లాభంలో 8719 వద్ద ట్రేడవుతోంది. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్ మార్నింగ్ ట్రేడ్లో లాభాల్లో నడిచాయి. 0.5-2 శాతం లాభాల్లో ఎగిశాయి. జనవరిలో ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోవడంతో మహింద్రా అండ్ మహింద్రా 2 శాతం నష్టపోయింది. లాభాల స్వీకరణతో ఐడియా సెల్యులార్ 1.7 శాతం డౌన్ అయింది.
టాటా మోటార్స్, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్పొ, విప్రోలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్నింగ్ ట్రేడ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 67.44 వద్ద ప్రారంభమైంది. కేంద్రబడ్జెట్, దేశీయ ఈక్విటీలకు, రూపాయికి పాజిటివ్గా ఉందని కొటక్ మహింద్రా బ్యాంకు మోహన్ షెనోయి చెప్పారు. ఫెడ్ ఈ సారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు వెలువడుతుండటంతో డాలర్ ఇండెక్స్ పడిపోతుంది. బడ్జెట్లో వెలువరిచిన గ్రామీణ ప్రాంతాలపై, డిజిటల్, అఫోర్డబుల్ హౌసింగ్పై ఫోకస్ సిమెంట్ రంగాలకు, బ్యాంకులకు, రియాల్టీకి లబ్ది చేకూరుస్తుందని విశ్లేషకులన్నారు.
Advertisement