సైనిక విమానాన్ని కూల్చేసిన వేర్పాటువాదులు | Separatists down Ukraine military plane, several dead | Sakshi
Sakshi News home page

సైనిక విమానాన్ని కూల్చేసిన వేర్పాటువాదులు

Published Sat, Jun 14 2014 10:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

Separatists down Ukraine military plane, several dead

ఉక్రెయిన్లో ఓ సైనిక రవాణా విమానాన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు కూల్చేశారు. దాంతో ఆ విమానంలో ఉన్న పలువురు మరణించారు. లుగాంస్క్ నగరం మీదుగా విమానం వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పెద్ద కాలిబర్ ఉన్న మిషన్గన్తో ఉగ్రవాదులు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారని, దాంతో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్-76 విమానం కూలిపోయిందని సైన్యం తెలిపింది.

నాలుగు ఇంజన్లున్న ఈ జెట్ విమానంలో సైనిక బలగాలతో పాటు యుద్ధ పరికరాలు కూడా ఉన్నాయి. మరణించిన సైనికుల కుటుంబాలకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ నివాళులు అర్పించింది. అయితే, ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement