shot down
-
మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా.. వారంలో నాలుగోది!
వాషింగ్టన్: గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. గత వారం రోజులుగా అగ్రరాజ్యంలో వరుస గగనతల ఉల్లంఘన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆకాశంలో 20 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ వస్తువును అమెరికా కూల్చేసింది. మిచిగాన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సుపై ఎగురుతున్న అనుమానస్పద వస్తువును యూఎస్ యుద్ద విమానం పేల్చేసింది. గతం వారం రోజుల్లో వింత వస్తువులను కూల్చేయడం ఇదే నాలుగోసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వస్తువును పేల్చేశారు. ఎఫ్-16 యుద్ద విమానంతో కూల్చివేయాలని బైడెన్ ఆదేశించినట్లు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా గుర్తించిన వస్తువు అష్టభుజి ఆకారంలో తీగలు వేలాడుతూ కనిపించిందని అమెరికా తెలిపింది. ఇది ప్రమాదకరం కాదని, దాని వల్ల ఎలాంటి నష్టంలేదని అమెరికా తెలిపింది. నిఘా సామర్థ్యం, సైనిక ముప్పు కలిగించే శక్తి లేదని నిర్ధారించింది. అయితే ఇది సుమారు 20 వేల అడుగుల ఎత్తులో మిచిగాన్ మీదుగా ఎగురుతుండటం వల్ల పౌర విమానాల రాకపోకలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ఈ వస్తువును కూల్చేసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 4న చైనాకు భారీ బెలూన్ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. దీని వెనక చైనా గూఢచర్యం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను డ్రాగన్ దేశం కొట్టివేసింది. This footage was uploaded on Reddit by the user u/Grizz_fan12. The Video shows the Grant Park and the Lake Michigan at 12:10pm with a flying object which is the alleged #UFO that has been shot down a few moments ago. No confirmation yet but it‘s all we got. #ufo #usa #Michigan pic.twitter.com/HR9YpKTr2E — DustinsHotSauce (@HotSauceDustin) February 12, 2023 అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేననీ.. దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని చెప్పింది. ఈ వాదనను అమెరికా ఖండించింది. అనంతరం అలాస్కా తీరంలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని శుక్రవారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. తరువాత శనివారం కెనడాలోని యూకాన్ ప్రాంతంలో.. ఇప్పుడు మిచిగాన్‌లో మరో వస్తువును పేల్చేశారు. అయితే, ఈ మూడు వస్తువులు ఏంటీ? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన అమెరికన్లు.. ఇంకా ఎన్ని ఎగురుతాయోనని నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. 🇺🇲 #Unknown #flyingobject in the #sky again #USA #spyballoon #MYSTERY #unexplained #video Connecting with the skies again 😊 pic.twitter.com/CHh6x0zO1S — Tasos Perte Tzortzis (@TasosPerte) February 12, 2023 -
జమ్ము కశ్మీర్లో తీవ్రవాదుల కుట్ర భగ్నం
-
పంజాబ్‌లో పాక్ డ్రోన్ కూల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఖేమ్ కరన్ సెక్టార్లో కనిపించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ కదలికలతో సరిహద్దు గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ సరిహద్దులోని రటోక్ గ్రామంలో పాక్ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో కూల్చివేశారు. కాగా ఈ డ్రోన్ పాక్ సరిహద్దుల్లో కూలిందా లేక భారత భూభాగంలో పడిపోయిందా అనే వివరాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, భారత జవాన్లు డ్రోన్‌పై కాల్పులకు దిగిన ఘటనను తాను చూశానని రటోక్ సర్పంచ్ లక్బీర్ సింగ్ చెప్పారు. మరోవైపు పంజాబ్ బోర్డర్లోకి సోమవారం తెల్లవారుజామున చొచ్చుకువచ్చిన నాలుగు పాకిస్తాన్ ఎఫ్-16లను వాయుసేన సుఖోయ్-30, మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో తరిమికొట్టాయి. పాక్ యుద్ధ విమానాలు నిఘా డ్రోన్లతో భారత్‌లోకి చొచ్చుకురావడంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత బలగాల మోహరింపును గుర్తించేందుకే వచ్చాయని భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. -
గాల్లోనే రష్యా హెలికాప్టర్‌ను పేల్చేశారు
-
గాల్లోనే రష్యా హెలికాప్టర్‌ను పేల్చేశారు
పామిరా: రష్యాకు చెందిన ఓ హెలికాప్టర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గాల్లోనే పేల్చేశారు. దీంతో ఆ హెలికాప్టర్ కుప్పకూలి భారీ శబ్దంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు రష్యా పైలెట్లు ప్రాణాలుకోల్పోయారు. సిరియాలోని పామిరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హామ్స్ అనే ప్రాంతంలో తిష్టవేసిన ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించే క్రమంలో మిగ్-25 హెలికాప్టర్ ఎగురుతుండగా కింద నుంచే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో హెలికాప్టర్ తోకకు నిప్పంటుకొని అనంతరం కుప్పకూలిపోయి భారీ శబ్దంతో పేలిపోయింది. దీనికి సంబందించిన లైవ్ వీడియో కూడా బయటకు వచ్చింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. -
'వారి కోసమే మా విమానం కూల్చారు'
లీ బోర్గెట్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మరోసారి టర్కీపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ నుంచి తన సంబంధాలు దెబ్బతింటాయనే తమ విమానాన్ని కూల్చివేసే ఘాతుకానికి టర్కీ దిగిందని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ ను దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ధ విమానాన్ని కూల్చి వేసిందని చెప్పారు. 'టర్కీ భూభాగంలోకి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఇదంతా ఐఎస్ మాత్రమే నిర్వహిస్తుంది. దానిని తాము ఎక్కడ ధ్వంసం చేస్తామో అనే దురుద్దేశంతోనే మా విమానాన్ని కూల్చి వేశారు. మేం ఏ ఆరోపణలు ఊరికే చేయం. ప్రత్యేకమైన కారణం ఉంటేనే మాట్లాడతాం. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి' అని పుతిన్ అన్నారు. పారిస్ లో ప్రపంచ వాతావరణ సదస్సుకు వచ్చిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టర్కీపై నిప్పులు చెరిగారు. అసలు తమ విమానాన్ని కూల్చాల్సిన అవసరమే లేదని అన్నారు. -
ఇండియన్ ఆర్మీ డ్రోన్‌ను కూల్చేసిన పాక్ సైన్యం!
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాల్సిందేనన్న డిమాండ్‌తో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల ప్రక్రియపై నీలి మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత సైన్యానికి చెందిన డ్రోన్‌ను పాక్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తలు కలకలం రేపాయి. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్.. తాజా చర్యతో భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. నియంత్రణ రేఖ ఆవల ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పాక్ గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించినందునే భారత గూఢచారి డ్రోన్ (స్పై డ్రోన్) ను కూల్చివేశామని పాకిస్థాన్ అంతర్గత సేవలు- ప్రజా సంబంధాల శాఖ ప్రకటించినట్లు 'డాన్' పత్రిక బుధవారం ఒక వార్తను ప్రచురించింది. ఇందుకు ఆధారంగా కూల్చివేతకు గురైన డ్రోన్ చిత్రాలను కూడా పొందుపర్చింది. అయితే ఈ ఘటనపై భారత సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కశ్మీర్ అంశం చర్చించాల్సిందేనన్న డిమాండ్‌తో త్వరలో ప్రారంభం అవుతాయనుకున్న భారత్- పాక్ దైపాక్షిక చర్చల ప్రక్రియలో ప్రతిష్ఠంభన ఏర్పడిని సంగతి తెలిసిందే. గతవారంలో రష్యాలో సమావేశమైన ఇరు దేశాల ప్రధానులు చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన సంగతి విదితమే. -
'ఇరాక్ ఫైటర్ జెట్‌ను కూల్చేశాం'
బాగ్దాద్: తాము ఇరాక్ ఫైటర్ జెట్ విమానాన్ని కూల్చివేశామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వెల్లడించింది. అంబార్ ప్రావిన్స్ లోని రామాదికి ఉత్తరాన దానిని పడగొట్టామని స్పష్టం చేసింది. అయితే, దీని వివరాలు మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన సున్నీ దళానికి చెందిన సవా అనే ఉగ్రవాది ట్విట్టర్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అతడి ప్రకటన ప్రకారం రష్యా తయారు చేసిన ఎస్‌యూ-25 ఇరాక్ విమానం తాము కాల్పులు జరిపాక మంటల్లో ఇరుక్కుపోయిందని, అనంతరం రామాది వద్ద కూలిపోయిందని అతడు వెల్లడించారు. -
మలేషియా విమానాన్ని కూల్చేశారు!
-
సైనిక విమానాన్ని కూల్చేసిన వేర్పాటువాదులు
ఉక్రెయిన్‌లో ఓ సైనిక రవాణా విమానాన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు కూల్చేశారు. దాంతో ఆ విమానంలో ఉన్న పలువురు మరణించారు. లుగాంస్క్ నగరం మీదుగా విమానం వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పెద్ద కాలిబర్ ఉన్న మిషన్గన్తో ఉగ్రవాదులు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారని, దాంతో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్-76 విమానం కూలిపోయిందని సైన్యం తెలిపింది. నాలుగు ఇంజన్లున్న ఈ జెట్ విమానంలో సైనిక బలగాలతో పాటు యుద్ధ పరికరాలు కూడా ఉన్నాయి. మరణించిన సైనికుల కుటుంబాలకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ నివాళులు అర్పించింది. అయితే, ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం చెప్పలేదు.