గాల్లోనే రష్యా హెలికాప్టర్ను పేల్చేశారు | Two Russian helicopter pilots shot down, killed in Syria by Isil militants | Sakshi
Sakshi News home page

గాల్లోనే రష్యా హెలికాప్టర్ను పేల్చేశారు

Published Sun, Jul 10 2016 2:15 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

గాల్లోనే రష్యా హెలికాప్టర్ను పేల్చేశారు

గాల్లోనే రష్యా హెలికాప్టర్ను పేల్చేశారు

పామిరా: రష్యాకు చెందిన ఓ హెలికాప్టర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గాల్లోనే పేల్చేశారు. దీంతో ఆ హెలికాప్టర్ కుప్పకూలి భారీ శబ్దంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు రష్యా పైలెట్లు ప్రాణాలుకోల్పోయారు. సిరియాలోని పామిరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హామ్స్ అనే ప్రాంతంలో తిష్టవేసిన ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించే క్రమంలో మిగ్-25 హెలికాప్టర్ ఎగురుతుండగా కింద నుంచే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో హెలికాప్టర్ తోకకు నిప్పంటుకొని అనంతరం కుప్పకూలిపోయి భారీ శబ్దంతో పేలిపోయింది. దీనికి సంబందించిన లైవ్ వీడియో కూడా బయటకు వచ్చింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement