'ఇరాక్ ఫైటర్ జెట్ను కూల్చేశాం'
బాగ్దాద్: తాము ఇరాక్ ఫైటర్ జెట్ విమానాన్ని కూల్చివేశామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వెల్లడించింది. అంబార్ ప్రావిన్స్ లోని రామాదికి ఉత్తరాన దానిని పడగొట్టామని స్పష్టం చేసింది. అయితే, దీని వివరాలు మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన సున్నీ దళానికి చెందిన సవా అనే ఉగ్రవాది ట్విట్టర్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అతడి ప్రకటన ప్రకారం రష్యా తయారు చేసిన ఎస్యూ-25 ఇరాక్ విమానం తాము కాల్పులు జరిపాక మంటల్లో ఇరుక్కుపోయిందని, అనంతరం రామాది వద్ద కూలిపోయిందని అతడు వెల్లడించారు.