'చోకాస్', 'పావు', 'పోనీ', 'గాలరీ'... ఇలాంటి పదాలు ఎప్పుడైనా విన్నారా? వాటి అర్థం ఏంటో తెలుసా? సామాన్యులకైతే వీటి గురించి పెద్దగా అవసరం లేదు గానీ, ఢిల్లీలోని ఓ వ్యాపారికి మాత్రం ఇవి భలే లాభాలు తీసుకొచ్చే పదాలు. ఎందుకంటే, ఈ సంకేత నామాలతో అతగాడు సెక్స్ బొమ్మల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం తెలిపారు. 21 రకాల ఎలక్ట్రానిక్ సెక్స్ బొమ్మలు అమ్ముతున్న ఆశిష్ గుప్తా (26) అనే యువకుడిని పాలికా మార్కెట్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు.
ఇతడి వద్ద సెక్స్ బొమ్మలతో పాటు కొన్ని రకాల ఉద్దీపన మందులు, పోర్నోగ్రఫీ సినిమాలు, అసభ్యకరమైన సామగ్రి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వినియోగదారులను ఆకట్టుకోడానికి, తన కార్యకలాపాలను పోలీసుల నుంచి దాచడానికి అతడు సంకేత భాషను ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు. 'చోకాస్' అంటే మంచి అని అతగాడి అర్థం. పురుష వినియోగదారులను 'పావు' అని, మహిళా కస్టమర్లను 'పోనీ' అని పిలుస్తాడని పోలీసులు చెప్పారు. ఏదైనా సమస్య వచ్చిందని అనుమానం వస్తే వెంటనే 'గాలరీ' అంటూ చుట్టుపక్కల వారిని హెచ్చరిస్తాడు. 'టీఆర్' అంటే పోర్నోగ్రఫీ సినిమా అని పోలీసులు అన్నారు.
ఢిల్లీలో సెక్స్ బొమ్మలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
Published Tue, Nov 26 2013 9:23 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement