వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్‌తబ అహ్మద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి జరగనున్న షర్మిల పరామర్శ యాత్రలో మైనార్టీ సోదరులందరూ పాల్గొని జయపద్రం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్‌తబ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముజ్‌తబ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పరామర్శ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
వైఎస్‌ఆర్ మరణం తట్టుకోలేక గుండె పగిలి మృతిచెందిన వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర చేపడుతున్నారని చెప్పారు. ఈ యాత్ర 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొనసాగుతుందని.. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 9, 10 తేదీల్లో సాగుతుందని వివరించారు. ఆలేరు నియోజకవర్గంలోని యాద గిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామంలో సుంచు చంద్రమ్మ కుటుం బాన్ని షర్మిల పరామర్శిస్తారని చెప్పారు.
పరామర్శ యాత్రకు వస్తున్న వైఎస్‌ఆర్ బిడ్డను మైనార్టీ సోదరులంతా అక్కున చే ర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు షేక్ ఆర్కే త్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షు లు ఇమాం హుస్సేన్, పార్టీ నాయకులు ఎం. ఇస్మాయిల్, ఎం.లియాఖత్ అలీ ఖాన్, ఎం వాజిద్ సిద్దిఖీ, ఎం. నవాబ్ పాల్గొన్నారు.
షర్మిల యాత్రను జయపద్రం చేయండి
Published Sun, Jun 7 2015 3:47 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement
Advertisement