
వైరల్ వీడియో: శృతి హాసన్ 'బిచ్'
'బిచ్.. చాల మంది జీనియస్ మైండ్స్ మమల్నిలా సంబోధిస్తాయి. మీకంటూ స్థానంలేక.. ఆ ఒక్క పదంతో మా స్థానాన్ని ఖరారు చేస్తారు. బిచ్ అంటే ఎవరు? బిచ్ ఓ మల్టీ టాస్కర్.. మిమ్మల్ని పట్టించుకునే తీరిక ఉండదు. బిచ్ ఓ ఉపాధ్యాయురాలు.. వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది. బిచ్ హార్మోన్లతో నిండిన అమ్మాయి. ఇన్ దట్ వే.. ఎస్.. ఐయామ్ ఎ బిచ్' అంటూ శ్రుతి హాసన్ రూపొందించిన 'బి ద బిచ్' వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సమాజంలో మహిళలపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ శృతి రూపొందించిన ఈ వీడియోను 'Unblushed' సిరీస్ లో భాగంగా నెటిజన్ల ముందుకు తీసుకొచ్చారు. యూట్యూబ్ చానెల్ 'బ్లష్'లో 'బి ద బిచ్' విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలకొద్దీ హిట్స్ సాధించింది. ప్రముఖ దక్షిణాది నటీనటులంతా శృతికి తమ సంఘీభావం తెలుపుతూ వీడియోను పొగుడుతున్నారు. 'Unblushed' సిరీస్ లో భాగంగా ఇంతకు ముందు రాధిక ఆప్టే, కల్కి కొచ్లిన్, నిమ్రత్ కౌర్ లాంటి హీరోయిన్లూ, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటులూ గళం విప్పారు. సంచలనాల శృతి 'బిచ్' వీడియో మీకోసం...