లక్ష్మీపూజ నిర్వహించిన హాలీవుడ్‌ సింగర్‌! | Singer has performed a Lakshmi puja | Sakshi
Sakshi News home page

లక్ష్మీపూజ నిర్వహించిన హాలీవుడ్‌ సింగర్‌!

Published Mon, Feb 6 2017 6:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

లక్ష్మీపూజ నిర్వహించిన హాలీవుడ్‌ సింగర్‌!

లక్ష్మీపూజ నిర్వహించిన హాలీవుడ్‌ సింగర్‌!

ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌ మిలీ సైరస్‌ హిందువుల సంప్రదాయమైన లక్ష్మీపూజను నిర్వహించింది. హిందువుల పద్ధతిలో సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి ఫొటో ముందు పూలు, పండ్లు అలకరించి.. అగరొత్తులు, జ్యోతులు వెలిగించి.. హల్వా ప్రసాదం సమర్పించి, భక్తిశ్రద్ధలతో ఆమె ఈ పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు రెండు ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. ఈ ఫొటోలను బట్టి లక్ష్మీపూజను నిర్వహించి ఉంటుంది లేదా లక్ష్మీపూజలో పాల్గొని ఉంటుందని భావిస్తున్నారు. ఫొటొను బట్టి పండితుడు పూజను నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సూపర్‌ బౌల్‌ 2017 క్రీడలకు మద్దతుగా లక్ష్మీదేవికి పూజలు చేసినట్టు ఆమె ఈ పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఈ ఫొటోలో ఆమెకు తెలిసిన లేదా ఆమె ఆరాధించే పలువురు గురువుల ఫొటోలు కూడా ఉన్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement