స్మోకింగ్ రూం కావాలి
పార్లమెంటు ఆవరణలో ప్రత్యేకించి స్మోకింగ్ రూం కావాలంటూ సిగరెట్ తాగే అలవాటున్న ఎంపీలు మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌ను కలసి మొరపెట్టుకున్నారు.
సెంట్రల్ హాలు పక్కనున్న గదిని ఇదివరకు ఎంపీలు దమ్ము కొట్టేందుకు వాడుకునే వారు. ఆ గదిని స్టెనోగ్రాఫర్లకు కేటాయించడంతో వీరికి చిక్కొచ్చిపడింది.