ఆమె అరుపులతో హడలిపోయారు!
'మీ టీవీని మ్యూట్ లో పెట్టండి. అయినా మారిన్ కేకలు మీకు కిటికి నుంచి వినిపిస్తాయి'... ఇది ఒలింపిక్స్ బాడ్మింటన్ చాంపియన్ మారిన్ కరోలిన్ పై ఓ నెటిజన్ సంధించిన వ్యంగ్యాస్త్రం.
Put your television on mute, you will hear Marin from your window #badminton
— Gaurav Kapur (@gauravkapur) 19 August 2016
వరల్డ్ నంబర్ 1 షట్లర్ అయిన మారిన్ ఫైనల్ లోనూ తనదైన ఆటశైలిని చూపించింది. మన పీవీ సింధు హోరాహోరిగా పోరాడినా.. అనుభవంతోపాటు ఆధిపత్యాన్ని చాటింది. ఫైనల్ పోరులో పీవీ సింధును ఓడించి.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఆసియాయేతర మహిళగా రికార్డు సృష్టించింది.
1992 నుంచి ఒలింపిక్స్ బ్మాడ్మింటన్ లో ఆసియా క్రీడాకారులదే తిరుగులేని ఆధిపత్యం. ఆ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఈ స్పెయిన్ ముద్దుగుమ్మ. స్వర్ణం గెలిచిన ఆనందంలో మైదానంలో బోర్లపడి కంటతడి పెట్టిన మారిన్ దగ్గరెళ్లి సింధూ స్వయంగా ఓదార్చింది.
ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఫైనల్ పోరులో మారిన్ ఆటతీరు కన్నా.. గుర్రుగుర్రుమంటూ ఆమె చేసిన కేకలు భారతీయులకు బాగా చెవినపడ్డట్టున్నాయి. ఆ కేకలు, అరుపులు ఏంటి తల్లి అంటూ పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. మారిన్ కేకలపై నెటిజన్లు పెట్టిన కొన్ని ఫన్నీ ట్వీట్లు ఇవి..
దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా.. ప్రెషర్ కుక్కర్ కన్నా మారినే ఎక్కువ లొల్లి చేస్తుంది.
I swear to god I've met pressure cookers quieter than Marin
— Rohan (@mojorojo) 19 August 2016
ఈ అమ్మాయిలు కరాట క్లాసుల నుంచి ఇప్పుడే బయటికి వచ్చినట్టు ఉంది.
These women are straight out of Karate classes! #SindhuForGold #Rio2016
— Piyush Rai (@PiyushRaiTOI) 19 August 2016
మారిన్ స్నేహితులెవరూ ఆమెతో హర్రర్ సినిమాలకు వెళ్లే సాహసం చేయరనుకుంటా..
I bet Marin's friends don't go watch scary films with her