రాహుల్, సోనియా, మన్మోహన్(ఫైల్)
న్యూఢిల్లీ: జపాన్ జాతీయ ఉన్నత పురస్కారానికి ఎంపికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. మన్మోహన్ కు పురస్కారం దక్కినందుకు జాతి యావత్తు గర్విస్తోందని సోనియా పేర్కొన్నారు. ఆయన సేవలకు తగిన విధంగా గుర్తింపు దక్కిందని ఆమె అభిప్రాయపడ్డారు.
భారత్- జపాన్ దేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతకు అందించిన సేవలకు గుర్తింపుగా మన్మోహన్ కు 'ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్' పురస్కారాన్ని జపాన్ ప్రకటించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మన్మోహన్ కు అభినందలు తెలిపారు.