అసోంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇద్దరు 'వారసులు' విజయం సాధించారు.
గుహవాటి: అసోంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇద్దరు 'వారసులు' విజయం సాధించారు. రెండు రాజకీయ పార్టీలకు చెందిన వారసులు గెలుపొందారు. జనముఖ్ స్థానం నుంచి పోటీ చేసిన అబ్దుర్ రహీం అజ్మాల్ గెలుపొందారు.
ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) బద్రుద్దీన్ తనయుడైన అబ్దుర్ రహీం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి నెగ్గారు. లఖీపూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాజ్దీప్ గోయల కూడా బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. తన తండ్రి దినేష్ ప్రసాద్ మరణంతో రాజ్దీప్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు.