assembly bypolls
-
అసెంబ్లీ ఉప ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీ నుంచి సుభాష్ తంబోలియాకు టికెట్ ఇవ్వగా, గాండే అసెంబ్లీ నుంచి దిలీప్ కుమార్ వర్మను పోటీకి దింపింది. ఏప్రిల్ 26న రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుండగా, గాండే అసెంబ్లీకి మే 20న ఉప ఎన్నిక జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాదాపు 96.8 కోట్ల మంది ప్రజలు 12 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1లో ఏప్రిల్ 19న 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 24 సీట్లు గెలుచుకోగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే పొందగలిగింది. -
పలు అసెంబ్లీ నియోజకవార్గల్లో ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక కొనసాగుతుంది. చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, కేరళలోని పాల, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్, త్రిపురలోని బధర్‌ఘాట్ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను, వీవీపాట్లను ఎన్నికల కేంద్రాలకు చేర్చింది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతోంది. పండగలు, ఓట్ల నమోదు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసీ నేడు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నటు తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సెప్టెంబర్ 27న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించింది. బీజేపీ నాయకుడు బీమా మందావి నక్సల్స్ దాడిలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు చేరుకుని.. క్యూలైన్లో నిల్చున్నారు. పాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేరళ కాంగ్రెస్ మని వ్యవస్థాపకుడు కేఎం మని ఏప్రిల్‌లో మరణించారు. దాంతో ఈసీ సోమవారం ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. యూపీ బధర్‌ఘాట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దిలిప్ సర్కార్ మరణించడంతో ఇక్కడ నేడు ఉప ఎన్నిక జరుగుతుంది. హమీర్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ చందేల్ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో ప్రభుత్వం అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దాంతో ప్రస్తుతం హమీర్‌పూర్‌లో ఉప ఎన్నక జరగుతుంది. -
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
భోపాల్: గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊపునిచ్చే అంశమిది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలంశు చతుర్వేది తన సమీప బీజేపీ అభ్యర్థి శంకర్‌దయాల్ త్రిపాఠిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 65 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. చతుర్వేది 66,810, త్రిపాఠి 52,677 ఓట్లు సాధించారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ (65) మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఫలితాల అనంతరం మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ ట్వీటర్లో స్పందిస్తూ ‘ఓటమిని అంగీకరిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం’ అని పేర్కొన్నారు. అలాగే ‘మాకు మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితం చిత్రకూట్ నియోజకవర్గం అభివృద్ధిపై ఏ మాత్రం పడదు. నా లక్ష్యం మధ్యప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేయడమే’ అని చౌహన్ వెల్లడించారు. విజయానంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భోపాల్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ ముందు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
అసోంలో ఇద్దరు వారసులు గెలుపు
గుహవాటి: అసోంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇద్దరు 'వారసులు' విజయం సాధించారు. రెండు రాజకీయ పార్టీలకు చెందిన వారసులు గెలుపొందారు. జనముఖ్ స్థానం నుంచి పోటీ చేసిన అబ్దుర్ రహీం అజ్మాల్ గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) బద్రుద్దీన్ తనయుడైన అబ్దుర్ రహీం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి నెగ్గారు. లఖీపూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాజ్‌దీప్ గోయల కూడా బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. తన తండ్రి దినేష్ ప్రసాద్ మరణంతో రాజ్‌దీప్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. -
రాజస్థాన్ లో బీజేపీకి షాక్
జైపూర్: రాజస్థాన్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీచింది. నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెల్చుకుంది. మిగిలిన మూడు స్థానాలను విపక్ష కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వియర్, సురజ్గఢ్, నసీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కోట దక్షిణ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి సందీప్ శర్మ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి శివకాంత్ నంద్వానాపై 25 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గత సాధారణ ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవులు వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమైయ్యాయి