భోపాల్: గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊపునిచ్చే అంశమిది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలంశు చతుర్వేది తన సమీప బీజేపీ అభ్యర్థి శంకర్‌దయాల్ త్రిపాఠిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 65 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. చతుర్వేది 66,810, త్రిపాఠి 52,677 ఓట్లు సాధించారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ (65) మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.
ఫలితాల అనంతరం మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ ట్వీటర్‌లో స్పందిస్తూ ‘ఓటమిని అంగీకరిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం’ అని పేర్కొన్నారు. అలాగే ‘మాకు మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితం చిత్రకూట్ నియోజకవర్గం అభివృద్ధిపై ఏ మాత్రం పడదు. నా లక్ష్యం మధ్యప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేయడమే’ అని చౌహన్ వెల్లడించారు. విజయానంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భోపాల్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ ముందు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment