భారీగా ధర తగ్గిన సోనీ ఎక్స్పీరియా ఎక్స్ జెడ్
భారీగా ధర తగ్గిన సోనీ ఎక్స్పీరియా ఎక్స్ జెడ్
Published Thu, Mar 16 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
సోనీ తన స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియా ఎక్స్ జెడ్ ధరను భారీగా తగ్గించింది. రూ.8000 మేర ధరను తగ్గించిన సోని, ఈ ఫోన్ ను కంపెనీ వెబ్ సైట్ లో రూ.41,990కి అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్ లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.51,990గా కంపెనీ ప్రకటించింది. అనంతరం రూ.49,990కే ఈ ఫోన్ విక్రయానికి వచ్చింది. ప్రస్తుతం ఆ ధరను మరింత తగ్గించి, రూ.41,990కు అందుబాటులో ఉంచింది. అయితే ఈ ధరను శాశ్వతంగా తగ్గించిందా లేదా పరిమితి కాల వ్యవధిలోనా అనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. సోని ఎక్స్క్లూజివ్ పార్టనర్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలోనూ ఎక్స్పీరియా ఎక్స్ జెడ్ ఫోన్ ధర తగ్గి రూ.39,990గా ఉంది.
సోని ఎక్స్పీరియా ఎక్స్ జెడ్ ఫీచర్లు...
5.2 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే
స్నాప్ డ్రాగన్ 820 చిప్
3జీబీ ర్యామ్
స్టీరియో స్పీకర్స్
64జీబీ స్టోరేజ్
యూఎస్బీ టైప్-పీ
ఫింగర్ ప్రింట్ స్కానర్
వాటర్ ప్రూఫ్
2900ఎంఏహెచ్ బ్యాటరీ
23 ఎంపీ ప్రైమరీ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
డ్యూయల్ సిమ్ సపోర్టు
4జీ ఎల్టీఈ
ఫారెస్ట్ బ్లూ, మినరల్ బ్లాక్, ప్లాటినం రంగుల్లో అందుబాటు
Advertisement
Advertisement