మార్కెట్ పంచాంగం
అమెరికా షట్‌డౌన్ వార్తతో ఆ దేశపు స్టాక్ సూచీలతో సహా ప్రపంచ మార్కెట్లేవీ చలించకపోగా, స్వల్పంగా ర్యాలీ జరిపారుు. ఈ షట్‌డౌన్ తాత్కాలికమేనన్న అంచనాలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు అవ్ముకాలకు పాల్పడలేదని, పైగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీ ఉపసంహరణ ప్రక్రియు వురింత జాప్యం కావచ్చన్న అంచనాలతో భారత్ వంటి మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అదనపు నిధులు తరలివచ్చాయున్న విశ్లేషణలు విన్పిస్తున్నారుు. కానీ ఏదైనా ఒక అనుకూల, లేదా ప్రతికూల వార్త వెలువడినపుడు, దాని ప్రభావాన్ని వెంటనే మార్కెట్ డిస్కౌంట్ చేసుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇందువల్ల వచ్చే కొద్దిరోజుల్లో స్టాక్ సూచీలు పెద్ద కుదుపునకు లోనయ్యే ప్రవూదం లేకపోలేదు.
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
గత వూర్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రీతిలోనే అక్టోబర్ 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో 19,390 పారుుంట్ల సమీపంలో వుద్దతు పొందిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,052 పారుుంట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 189 పాయింట్ల లాభంతో 19,916 పాయింట్ల వద్ద ముగిసింది. 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖ వుద్దతుతో సెన్సెక్స్ పెరిగినా, కీలకమైన 20,200 నిరోధస్థారుుని అధిగమించలేకపోరుుంది. సమీప భవిష్యత్తులో అధిక ట్రేడింగ్ టర్నోవర్‌తో ఈ స్థారుుని దాటగలిగితేనే, తిరిగి అప్‌ట్రెండ్‌లోకి వూర్కెట్ ప్రవేశించే వీలుంటుంది. ఈ సోవువారం గ్యాప్‌అప్‌తో సెన్సెక్స్ మొదలైతే తొలి అవరోధం 20,080 స్థారుు వద్ద ఏర్పడవచ్చు. ఈ స్థారుుని దాటితే 20,200 నిరోధస్థారుుకి చేరవచ్చు.
20,200పైన వుుగింపు సెన్సెక్స్‌ను క్రమేపీ 20,740 పారుుంట్ల వద్దకు చేర్చవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 19,650 పారుుంట్ల సమీపంలో తక్షణ వుద్దతు లభిస్తున్నది. ఈ స్థారుుని కోల్పోతే వురోదఫా 19,400 పారుుంట్ల స్థారుుని పరీక్షించవచ్చు. ఈ స్థారుుని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత కరెక్షన్, డౌన్‌ట్రెండ్‌గా రూపాంతరం చెందే ప్రమాదం వుంటుంది. గత రెండు వారాల్లో జరిగిన హెచ్చుతగ్గుల సందర్భంగా ట్రేడింగ్ పరిమాణం తక్కువగా వున్నందున, వూర్కెట్‌ను భారీగా కదల్చగల ఒక వార్త వెలువడేవరకూ సెన్సెక్స్ 19,400-20,200 శ్రేణికే పరిమితవుయ్యే అవకాశాలున్నారుు. ఈ వారం నాటకీయుంగా 19,400 వుద్దతు స్థారుుని సెన్సెక్స్ కోల్పోతే 18,900 పారుుంట్ల వరకూ పతనవుయ్యే ప్రవూదం వుంటుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నారుు.
నిఫ్టీ అవరోధం 5,990
అక్టోబర్ 4తో ముగిసిన వారం ప్రథవూర్థంలో 5,700 పాయింట్ల కనిష్టస్థారుుకి తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఆ స్థారుు వద్ద లభించిన వుద్దతుతో 5,950 పారుుంట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 74 పాయింట్లు లాభపడి 5,907 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ 200 డీఎంఏ రేఖకు (5,840) అటూఇటూగా తక్కువ ట్రేడింగ్ పరివూణంతో హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున, సమీప భవిష్యత్తులో ఈ రేఖకు ప్రాధాన్యత తగ్గిందని భావించవచ్చు. ఈ వారం గ్యాప్‌అప్‌తో నిఫ్టీ మొదలైతే 5,950 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావొచ్చు. ఆపైన వుుగిస్తే వురో కీలకమైన అవరోధస్థారుు 5,990 పారుుంట్ల వద్దకు పెరగవచ్చు. ఈ స్థారుుని అధిక ట్రేడింగ్ టర్నోవర్‌తో అధిగమిస్తే తిరిగి 6,142 పారుుంట్ల స్థారుుకి పెరిగే ఛాన్స్ వుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 5,860 పారుుంట్ల వద్ద తక్షణ వుద్దతు లభిస్తున్నది. ఈ లోపున వుుగిస్తే వుళ్లీ 5,688-5,738 వుద్దతు శ్రేణికి (ఇది సెప్టెంబర్ 10 నాటి అప్‌వర్డ్ ట్రేడింగ్ గ్యాప్) తగ్గవచ్చు. ఈ వుద్దతుశ్రేణిని భారీ ట్రేడింగ్ పరివూణంతో నష్టపోతే నిఫ్టీ వేగంగా 5,630 పారుుంట్ల వద్దకు (ఆగస్టు 28 నాటి 5,119 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి సెప్టెంబర్ 19 నాటి 6,242 పాయింట్ల గరిష్టస్థాయివరకూ జరిగిన 1.023 పాయింట్ల ర్యాలీలో ఇది 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) పతనవుయ్యే ప్రవూదం వుంటుంది.
- పి. సత్యప్రసాద్
సెన్సెక్స్ నిరోధం 20,200
Published Mon, Oct 7 2013 1:52 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM
Advertisement