Market Calendar
-
సెన్సెక్స్ లక్ష్యం 27,142
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జూన్-జూలై నెలల్లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు క్రమేపీ బలపడుతున్నాయి. తన పాలసీకి మార్కెట్లను సిద్ధంచేయడంలో భాగంగా పదేపదే వడ్డీ రేట్ల పెంపు ప్రస్తావనను ఫెడ్ అధికారులు తీసుకొస్తున్నారు. రేట్ల పెంపు అంచనాలతో తొలుత ప్రపంచ సూచీలు సర్దుబాటుకు లోనైనా, గతవారం ఆ భయాలను వదిలి ప్రపంచ సూచీలు పెరిగాయి. ఫెడ్ ఛైర్పర్సన్ కూడా ఇదే ప్రకటనను గత శుక్రవారం చేసినప్పటికీ, ఆ రోజున అమెరికా మార్కెట్ పెరుగుదలతో ముగిసింది. రేట్ల పెంపునకు ఈక్విటీ మార్కెట్ సంసిద్ధమైనట్లు ఈ ట్రెండ్ సూచిస్తున్నది. ఇందుకు అనుగుణంగా భారత్ సూచీలు కూడా గతవారం పెద్ద బ్రేక్అవుట్ సాధించాయి. అంటే...వచ్చే ఒకటి, రెండు నెలల్లో ఫెడ్ రేట్లను పెంచేవరకూ ప్రస్తుత అప్‌ట్రెండ్ చిన్న సర్దుబాట్లతో కొనసాగే అవకాశాలున్నట్లు భావించవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... మే నెల 27తో ముగిసిన వారంలో వరుసగా నాలుగురోజులపాటు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,357 పాయింట్ల లాభంతో 26,653 వద్ద ముగిసింది. ఈ వారం చిన్న కరెక్షన్లు జరిగినా సెన్సెక్స్ 27,142 పాయింట్ల లక్ష్యాన్ని చేరే ఛాన్సుంది. గత ఏడాదిన్నరగా 30,025 నుంచి 22,495 వరకూ జరిగిన కరెక్షన్లో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 27,142 పాయింట్లు. ఈ లక్ష్యాన్ని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే క్రమేపీ 28,135 స్థాయిని అందుకునే వీలుంటుంది. మధ్యలో 27,620 పాయింట్ల స్థాయి చిన్నపాటి అవరోధాన్ని కల్గించవచ్చు. గతవారం మార్కెట్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్ స్థాయిలు ఈ వారం మార్కెట్ తగ్గితే మద్దతును అందించవచ్చు. తొలి మద్దతు 26,400 పాయింట్ల సమీపంలో లభిస్తుండగా, తదుపరి మద్దతు 25,940-25,897 పాయింట్ల శ్రేణి మధ్య వుంది. 30 రోజుల చలన సగటు (30 డీఎంఏ) రేఖతో పాటు 200 డీఎంఏ రేఖ కదులుతున్న 25,640 పాయింట్ల స్థాయి ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు చివరి మద్దతు. 8,243 పాయింట్ల దిశగా నిఫ్టీ కొద్ది నెలల నుంచి అవరోధం కల్పిస్తున్న 8,000 పాయింట్ల స్థాయిని ఎన్ఎస్ఈ నిఫ్టీ ఎట్టకేలకు ఛేదించి చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 407 పాయింట్ల భారీలాభంతో 8,157 వద్ద ముగిసింది. గట్టి అవరోధాన్ని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించిన ఫలితంగా ఈ వారం నిఫ్టీ మరింత పెరిగే అవకాశం వుంది. తొలుత 8,243 లక్ష్యాన్ని అందుకోవొచ్చు. 9,120 నుంచి 6,825 వరకూ గతంలో జరిగిన సర్దుబాటుకు 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 8,243 పాయింట్లు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే రానున్న వారాల్లో నిఫ్టీ 8,546 వరకూ ర్యాలీ జరిపే ఛాన్స్ వుంది. మధ్యలో 8,340 పాయింట్ల వద్ద ఒక అవరోధం కలగవచ్చు. ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి 8,080 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే తదుపరి మద్దతు 7,940 పాయింట్ల వద్ద లభ్యం కావొచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 7,809-7,761 పాయింట్ల శ్రేణి మధ్య బలమైన మద్దతును పొందవచ్చు. ఇది గతవారం నిఫ్టీకి పెద్ద గ్యాప్కావడంతో పాటు 200 డీఎంఏ, 30 డీఎంఏ రేఖలు ఇదే శ్రేణి మధ్య కదులుతున్నాయి. -
25,000 స్థాయిని దాటితేనే..
మార్కెట్ పంచాంగం ఎన్నో నెలల తర్వాత ఈక్విటీలు, క్రూడ్, బంగారం, మెటల్స్...ఇలా ట్రేడయ్యే అన్ని ఆస్తుల ధరలూ పెరుగుతున్నాయి. అలాగే చైనాతో సహా ఇతర వర్థమాన దేశాల కరెన్సీలన్నీ బలపడుతున్నాయి. ఈక్విటీలు పెరిగితే బంగారం తగ్గడం, క్రూడ్ తగ్గితే షేర్లు క్షీణించడం, చైనా మార్కెట్ పతనమైతే ఇతర ప్రపంచ మార్కెట్లు పడిపోవడం, డాలరు పెరిగితే ఇతర వర్థమాన కరెన్సీలు తగ్గడం వంటి ట్రెండ్స్ అన్నీ హఠాత్తుగా మటుమాయమయ్యాయి. ఒకవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగా, మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయినా అన్నింటి ధరలూ అప్‌ట్రెండ్‌లోనే వున్నాయి. ఈ ధోరణి ఇక ఎన్నోరోజులు కొనసాగకపోవొచ్చు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు మార్చి 11తో ముగిసిన 4 రోజుల ట్రేడింగ్‌వారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 72 పాయింట్ల స్వల్పలాభంతో 24,718 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం వరుసగా మూడురోజులపాటు 24,820 పాయింట్ల వద్ద చిన్న అవరోధం ఏర్పడినందున, ఈ వారం ఇదేస్థాయి తొలి నిరోధం కాగలదు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా ర్యాలీ జరిపిన నేపథ్యంతో ఈ సోమవారం ఈ స్థాయిపైన సెన్సెక్స్ ప్రారంభమైతే వెనువెంటనే 25,000 పాయింట్ల శిఖరాన్ని తాకే చాన్స్ వుంది. దాదాపు ఇదే స్థాయి వద్ద జనవరి 14, ఫిబ్రవరి 1 తేదీల్లో డబుల్‌టాప్ ఏర్పడినందున, ఈ స్థాయిని బలంగా దాటి స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. అటుపైన సెన్సెక్స్ 25,230 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే కొద్దిరోజుల్లో 26,256 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. ఈ వారం క్షీణిస్తే 24,440 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తుండగా, 24,380-24,280 శ్రేణి వద్ద మద్దతు సెన్సెక్స్ కీలకమైనది. మార్చి 2 నాటి గ్యాప్‌అప్ అయిన ఈ శ్రేణిని సూచీ కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్ ప్రమాదంలో పడే వీలుంది. ఈ శ్రేణి దిగువన 24,044 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున 23,820 పాయింట్ల స్థాయి వద్ద మరో మద్దతు లభిస్తున్నది. నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 7,406-7,380 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో 7,510 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 7,550 స్థాయి వద్ద తక్షణ నిరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిపైనే నిఫ్టీ ప్రారంభమైతే వేగంగా 7,600 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితేనే నిఫ్టీ మరింత పెరిగి 7,675 స్థాయివరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదించి, స్థిరపడితే రానున్న వారాల్లో 7,980 పాయింట్ల దిశగా కదిలే అవకాశం వుంటుంది. ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి తక్షణం 7,425 వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 7,406-7,380 పాయింట్ల మద్దతు శ్రేణి సమీపకాలంలో అప్‌ట్రెండ్‌కు కీలకం. ఈ శ్రేణిని కోల్పోతే 7,308 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 7,235 పాయింట్ల వద్దకు తగ్గే ప్రమాదం వుంటుంది. - పి.సత్యప్రసాద్ -
సెన్సెక్స్ తొలి నిరోధం 23,940 పాయింట్లు
మార్కెట్ పంచాంగం మార్కెట్ ఓవర్‌సోల్డ్ కండీషన్లో పడినట్లు టెక్నికల్స్ వెల్లడిస్తున్నందున, రిలీఫ్ ర్యాలీ జరగవచ్చంటూ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా మార్కెట్ పెరిగింది. చైనా మార్కెట్ పునఃప్రారంభమైన తర్వాత స్థిరంగా ట్రేడ్‌కావడం, అమెరికా మార్కెట్లు కూడా ర్యాలీ జరపడం ఇక్కడ షార్ట్ కవరింగ్‌కు దోహదపడింది. ఇక కేంద్ర బడ్జెట్ సమర్పణకు వారం రోజులే గడువు వుంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ సంకేతాలతో అల్లాడిపోయిన మన మార్కెట్ బడ్జెట్ పట్ల అంచనాల్ని ఏర్పర్చుకుని, అందుకు తగ్గ కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి కేవలం ఐదు ట్రేడింగ్ రోజులే మిగిలివుంది. సరిగ్గా ఇదేవారంలో ఫిబ్రవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు కూడా ముగియనున్నాయి. ఇటు షార్ట్ కవరింగ్, అటు లాంగ్, షార్ట్ రోలోవర్స్ కారణంగా మార్కెట్లో ఆయా షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు ఫిబ్రవరి 19తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్ఈ సెన్సెక్స్ 22,921 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా, ద్వితీయార్థంలో కోలుకోవడంతో అంతక్రితం వారంతో పోలిస్తే 723 పాయింట్ల లాభంతో 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మొదలైన రిలీఫ్ ర్యాలీ ఈ వారం కూడా కొనసాగితే 23,940 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 24,225 పాయింట్ల స్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 23,440 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గతవారపు కనిష్టస్థాయి అయిన 22,921 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ స్థాయి దిగువన మరోదఫా 22,600 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధం 7,275 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 230 పాయింట్ల లాభంతో 7,211 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిలీఫ్ ర్యాలీ కొనసాగితే 7,275 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఎదురుకావొచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 7,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 7,120 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే క్రమేపీ 6,960 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు. ఆ లోపున మరోమారు 6,870 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ ముగింపు సందర్భంగా 7,300, 7,400 స్ట్రయిక్స్ వద్ద అత్యధికంగా 58,44 లక్షలు, 60.51 లక్షల చొప్పున కాల్స్ బిల్డప్ జరిగింది. అలాగే 7,200, 7,000 స్ట్రయిక్స్ వద్ద భారీగా 50,56 లక్షలు, 53.63 లక్షల మేర పుట్స్ బిల్డప్ జరిగింది. 7,300 పాయింట్ల స్థాయిని దాటితే నిఫ్టీ మరింత పెరగవచ్చని, 7,400 పాయింట్ల స్థాయిని అధిగమించడం మాత్రం కష్టసాధ్యమని ఈ డేటా వెల్లడిస్తున్నది. 7,200 స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,000 పాయింట్ల స్థాయివరకూ పెద్దగా మద్దతు లేదని కూడా ఈ డేటా సూచిస్తున్నది. -
26,250 దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్
మార్కెట్ పంచాంగం ఇయర్ఎండ్ షార్ట్ కవరింగ్‌తో వరుసగా మూడోవారం భారత్ సూచీలు కూడా పెరిగాయి. దాదాపు ప్రతీ ఏడాదీ జనవరి తొలివారంలో భారత్ మార్కెట్ సానుకూలంగా వుంటుంది. కానీ పలు సందర్భాల్లో జనవరి రెండు, మూడోవారాల్లో డౌన్‌ట్రెండ్‌ను ఇన్వెస్టర్లు చవిచూస్తుండేవారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సంవత్సరాంతపు సెలవుల నుంచి తేరుకుని, కొత్త సంవత్సరం రెండోవారం నుంచి చురుగ్గా ట్రేడ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అదేట్రెండ్ పునరావృత్తమవుతుందా లేదా అనేది అంచనావేయలేముగానీ...ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వుండటం అవసరం. జనవరి తొలివారంలో వెలువడే అమెరికా జాబ్స్ డేటా తదితర కీలక గణాంకాలు రానున్న నెలల్లో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీసుబోబోయే నిర్ణయాలకు బాట వేస్తాయి. సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు జనవరి 1తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ మరో 322 పాయింట్ల లాభంతో 26.161 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే క్రితం వారం వరుసగా నాలుగు రోజులపాటు గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రీతిలో 26,100-26,250 పాయింట్ల నిరోధ శ్రేణి మధ్య అవరోధాన్ని చవిచూసింది. రానున్న రోజుల్లో ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తేనే, తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. 26,250 పాయింట్లపైన 26,567 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అక్టోబర్ 26 నాటి 27,618 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి డిసెంబర్ 14నాటి 24,867 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 26,567 పాయింట్లు. ఈ స్థాయిని దాటితే రానున్న వారాల్లో 75 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 26,930 పాయింట్ల వద్దకు పెరిగే ఛాన్స్ వుంటుంది ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 25.940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 25,400 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. 7,980పైన నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగింపు ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 7.963 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీ సైతం 7,940-7,980 పాయింట్ల శ్రేణి మధ్య గతవారం పలుదఫాలు అవరోధం ఎదుర్కొన్నది. ఈ శ్రేణిని బలంగా దాటగలిగితేనే నిఫ్టీ తదుపరి ర్యాలీ సాధ్యపడుతుంది. 7,980 పాయింట్ల పైన నిఫ్టీ వెనువెంటనే 8,036 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఇది గతంలో 8,336 పాయింట్ల నుంచి 7,551 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. అటుపైన ముగిస్తే 75 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 8,140 పాయింట్ల వరకూ నిఫ్టీ పెరగవచ్చు. ఈ వారం నిఫ్టీ 7,980 పాయింట్లపైన స్థిరపడలేకపోతే 7,890 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ లోపున క్రమేపీ 7,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 7,730 పాయింట్ల స్థాయి వద్దకు క్షీణించవచ్చు. -
25,400 దిగువన మరింత క్షీణత
మార్కెట్ పంచాంగం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి చెందడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బలపడటం వంటి అంశాలతో భారత్ సూచీలు వరుసగా మూడో వారమూ తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాల బాట పట్టడం ఈ క్షీణతకు ప్రధాన కారణం. డాలరు బలపడటం, రూపాయి బలహీనపడటం సహజంగానే విదేశీ ఇన్వెస్టర్లను విక్రయాలకు పురికొల్పుతుంది. అయితే మూడు వారాల్లో సూచీలు 7 శాతంవరకూ నష్టపోయినందున, ఈ వారం క్షీణిస్తే కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం లేకపోలేదు. కానీ విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల వేగాన్ని పెంచితే పతనం కొనసాగవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు నవంబర్ 13తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్ వారంలో మరింత క్షీణించిన బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన 25,530 పాయింట్ల మద్దతు వరకూ తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 654 పాయింట్ల నష్టంతో 25,611 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు వారాల్లో 1,700 పాయింట్లకుపైగా సెన్సెక్స్ నష్టపోయింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు క్షీణించడం, పారిస్‌లో ఉగ్రవాదుల దాడులు వంటి అంశాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 25,400 పాయింట్ల వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే తదుపరి రోజుల్లో సెప్టెంబర్ 8నాటి కనిష్టస్థాయి అయిన 24,833 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. మధ్యలో 25,100 పాయింట్ల సమీపంలో మరో తాత్కాలిక మద్దతు వున్నది. తొలి మద్దతును ముగింపులో పరిరక్షించుకోగలిగితే 25,950 పాయింట్ల స్థాయివరకూ సూచీ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 26,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. అటుపైన క్రమేపీ 26,440 స్థాయికి చేరవచ్చు. నిఫ్టీ మద్దతు 7,700 గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 7,735 సమీప మద్దతుస్థాయివరకూ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 192 పాయింట్ల నష్టంతో 7,762 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ మొదలైతే 7,700 పాయింట్ల వద్ద చిన్న మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే క్రమేపీ 7,600 స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున తిరిగి రెండునెలల కనిష్టస్థాయి అయిన 7,540 పాయింట్ల వద్దకు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే 7,850 స్థాయిని చేరవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన పటిష్టంగా ముగిస్తే 8,005 స్థాయి వరకూ పెరగవచ్చు. -
మద్దతు 26,200-అవరోధం 27,100
మార్కెట్ పంచాంగం గతవారం ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత్ మార్కెట్ బాగా డీలా పడింది. తాజా క్షీణతతో అక్టోబర్ నెలలో ఆర్జించిన లాభాల్లో ఎక్కువ శాతాన్ని భారత్ సూచీలు కోల్పోయాయి. ప్రపంచ ప్రధాన దేశాల సూచీలను ప్రతిబింబించే ఎంఎస్సీఐ ఇండెక్స్‌తో సహా అమెరికా మార్కెట్లు అక్టోబర్‌లో 7 శాతంపైగా పెరిగి నాలుగేళ్ల రికార్డును సృష్టించగా, భారత్ మార్కెట్ గత నెల పెరుగుదల 1.5 శాతానికే పరిమితయ్యింది. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు బలహీన ఆర్థిక ఫలితాలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్ల ఆందోళన ఇక్కడి మార్కెట్ క్షీణతకు కారణం కావొచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు అక్టోబర్ 23తో ముగిసినవారం ప్రధమార్థంలో 27,575 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో 26,585 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 814 పాయింట్ల భారీ నష్టంతో 26,657 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 200 డీఎంఏ రేఖ సమీపానికి చేరిన తర్వాత, ఆ స్థాయిని అధిగమించలేక, సూచీ వేగంగా క్షీణించింది. పతనవేగం కారణంగా గత అప్‌ట్రెండ్‌కు ప్రతిగా డౌన్‌స్వింగ్ మొదలయ్యిందని భావించవచ్చు. సెప్టెంబర్ 8నాటి కనిష్టస్థాయి అయిన 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి జరిగిన 2,742 పాయింట్ల ర్యాలీలో సూచీ ఇప్పటికి 38.2 శాతం కోల్పోయినందున, ఈ వారం ప్రస్తుతస్థాయి నుంచి మార్కెట్ కోలుకోలేకపోతే 50 శాతం డౌన్వర్డ్ రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 26,200 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 25,880 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం నిలబెట్టుకోలేకపోతే తిరిగి 24,800 పాయింట్ల సమీపస్థాయికి తగ్గవచ్చు. ఈ వారం రికవరీ జరిగితే 27,100 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. ఆపైన ముగిస్తే 27,200 పాయింట్ల వరకూ పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి బుల్ కక్ష్యలోకి ప్రవేశించాలంటే 27,660 పాయింట్ల స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సివుంటుంది. నిఫ్టీ నిరోధం 8,180-మద్దతు 7,940 గతవారం తొలుత 8,336 పాయింట్ల గరిష్టంవరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ, వారం చివర్లో 8,044 పాయింట్ల కనిష్టం వరకూ పతనమయ్యింది. చివరకు 229 పాయింట్ల నష్టంతో 8,066 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ కోలుకుంటే క్రమేపీ 8,180 పాయింట్ల నిరోధస్థాయికి చేరవచ్చు. అటుపైన ముగిస్తే 8,230 స్థాయికి చేరే అవకాశం వుంది. ఈ రెండు స్థాయిల్ని అధిగమించి, స్థిరపడితేనే ఇటీవలి గరిష్టస్థాయి అయిన 8,336 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ నిలదొక్కుకోలేకపోతే క్రమేపీ 7,940 పాయింట్ల మద్దతుస్థాయివరకూ తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే 7,840 పాయింట్ల వరకూ తగ్గే ప్రమాదం వుంది. ఏదైనా అనూహ్యవార్త కారణంగా ఈ రెండో మద్దతును కూడా కోల్పోతే రానున్న రోజుల్లో తిరిగి 7,540 పాయింట్ల వరకూ పతనం కావొచ్చు. 8,375 పాయింట్ల స్థాయిని దాటితేనే నిఫ్టీ తిరిగి బుల్లిష్‌గా మారే ఛాన్స్ వుంటుంది. -
సెన్సెక్స్ తక్షణ మద్దతు 26,900
మార్కెట్ పంచాంగం అమెరికా, చైనాలతో సహా ప్రపంచ మార్కెట్ల సూచీలు స్థిరంగా ట్రేడ్‌కావడంతో భారత్ ఈక్విటీలు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే ఆగస్టు పతన సమయంలో స్థిరంగా నిలిచిన ఐటీ, ఫార్మా షేర్లు ప్రస్తుతం క్షీణబాట పట్టగా, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు రోజు నుంచి పరిమితశ్రేణిలో కదులుతున్న బ్యాంకింగ్ షేర్లు తొలిసారిగా గత శుక్రవారం పైకి కదిలాయి. ఆగస్టులో భారీగా పతనమైన కమోడిటీ షేర్లపై ముందుగా దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు, అటు తర్వాత బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లకు ఉపక్రమించినట్లు ఈ ట్రెండ్ సూచిస్తున్నది. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు అక్టోబర్ 16తో ముగిసిన వారంలో 26,700 పాయింట్ల సమీపంలో మద్దతు పొందిన బీఎస్ఈ సెన్సెక్స్ 27,239 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు 135 పాయింట్ల లాభంతో 27,215 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 30,025 పాయింట్ల నుంచి సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ జరిగిన 5,192 పాయింట్ల నష్టంలో 38.2 శాతం ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్‌మెంట్ ర్యాలీలో పూడ్చుకోగలిగింది. ఈ వారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే 150 డీఎంఏ అయిన 27,360 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 27,429 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 200 డీఎంఏ అయిన 27,675 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం హఠాత్తుగా క్షీణత మొదలైతే వెనువెంటనే 26,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున తిరిగి 26,700 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ దిగువన 26,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 8,145 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాం గంలో సూచించిన రీతిలో 8,090 పాయిం ట్ల సమీపంలో మద్దతు పొంది, క్రమేపీ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 48 పాయింట్ల స్వల్పలాభంతో 8,238వద్ద ముగిసింది. ఆగస్టు 24 నాటి గ్యాప్‌డౌన్ సందర్భంగా ఏర్పడిన అప్పర్ బౌండరీ 8,230 పాయింట్లపైన ముగియడం సాంకేతికంగా సానుకూలాంశం. సమీప భవిష్యత్తులో ఈ స్థాయిపైన స్థిరపడితే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన 150 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 8,290 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపైన క్రమేపీ కీలకమైన 200 డీఎంఏ స్థాయి అయిన 8,380 స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం 8,230 స్థాయిపైన నిలదొక్కుకోలేకపోతే 8,145 వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే గతవారపు కనిష్టస్థాయి అయిన 8,090 స్థాయిని చేరవచ్చు. ఈ దిగువన క్రమేపీ 8,005 స్థాయికి క్షీణించవచ్చు. -
మద్దతు శ్రేణి 26,750-26,670
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేస్తుందన్న అంచనాలు బలంగా ఏర్పడటం, చైనా మార్కెట్ నిలదొక్కుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, లోహాల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో కమోడిటీ షేర్లు ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ సాగిస్తున్నందున, అన్ని దేశాల మార్కెట్ సూచీలు గతవారం వేగంగా కోలుకున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా భారత్ మార్కెట్లో ఆయిల్, మెటల్ షేర్ల ర్యాలీ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆరువారాల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ తరుణంలో కార్పొరేట్ ఫలితాల సీజన్ వచ్చేసింది. ఇక నుంచి ఆయా కంపెనీల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు అక్టోబర్ 9తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26,200 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు 859 పాయింట్ల భారీ లాభంతో 27,080 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 30,025 పాయింట్ల నుంచి సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ జరిగిన 5,192 పాయింట్ల నష్టంలో 38.2 శాతం ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్‌మెంట్ ర్యాలీలో పూడ్చుకోగలిగింది. అలాగే ఆగస్టు 24 నాటి గ్యాప్ డౌన్ శ్రేణిని కూడా గత శుక్రవారం పూడ్చుకున్నది. కానీ ఆ లోపున ముగిసినందున, ఈ వారం సెన్సెక్స్ 27,130 పాయింట్లపైన స్థిరపడితేనే తదుపరి ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. అలా స్థిరపడితే 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 27,429 స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 200 డీఎంఏ అయిన 27,686 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం హఠాత్తుగా క్షీణత మొదలైతే 26,750-26,670 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 26,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 26,050-25,900 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీ మద్దతు శ్రేణి 8,130-8,095 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన రీతిలో సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన తర్వాత క్రమేపీ ర్యాలీ సాగించి కీలకమైన 8,225 పాయింట్ల స్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 239 పాయింట్ల లాభంతో 8,190 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం గరిష్టస్థాయి అయిన 8,230 పాయింట్లను తాకడం ద్వారా ఆగస్టు 24నాటి భారీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్‌ను నిఫ్టీ పూడ్చగలిగింది. ఈ కారణంగా సమీప భవిష్యత్తులో ఈ స్థాయిపైన స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన క్రమేపీ 8,329 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన కీలకమైన 200 డీఎంఏ స్థాయి అయిన 8,382 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం 8,230 స్థాయిపైన నిలదొక్కుకోలేకపోతే 8,130-8,095 పాయింట్ల శ్రేణి మధ్య నిఫ్టీకి తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 8,005 స్థాయికి క్షీణించవచ్చు. ఆ లోపున అమ్మకాల ఒత్తిడికి లోనైతే 7,925-7,875 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావొచ్చు. - పి. సత్యప్రసాద్ -
నిరోధం 26,339- మద్దతు 25,386
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అసలు ఉద్దేశ్యమేమిటో గతవారం స్పష్టమైపోయింది. ఈ సంవత్సరాంతంలో వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ ఫెడ్ ఛైర్పర్సన్ యెలెన్ వెల్లడించేసేశారు. ఈ నేపథ్యంలో మన రిజర్వుబ్యాంక్ పాలసీ నిర్ణయం వెలువడనున్నది. దేశీయంగా ద్రవ్యోల్బణం కనిష్టస్థాయికి పడిపోయినందున, పావుశాతం రేట్ల కోత వుండవచ్చన్న అంచనాలు ఇప్పటికే షేర్ల ధరల్లో ఇమిడిపోయాయి. ఈ కారణంగా అరశాతం తగ్గితేనే మార్కెట్లో మరింత ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. లేదంటే ఆర్బీఐ పాలసీ మీట్ తర్వాత సూచీలు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 24తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26,339 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 900 పాయింట్లకుపైగా క్షీణించి, 25,386 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత క్రమేపీ కోలుకుని, చివరకు 1.3 శాతం స్వల్పనష్టంతో 25,863 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్‌మెంట్ ర్యాలీలో గతవారపు 26,339 పాయింట్ల గరిష్టస్థాయిని ‘లోయర్ హై’గా (సెప్టెంబర్ 18నాటి 26,472 పాయింట్ల గరిష్టంతో పోలిస్తే) పరిగణించవచ్చు. ఈ కారణంగా రిట్రేస్‌మెంట్ ర్యాలీ కొనసాగాలంటే గతవారపు గరిష్టస్థాయి అయిన 26,339 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్ ఈ వారం తప్పనిసరిగా అధిగమించాల్సివుంటుంది. ఆర్బీఐ పాలసీ ప్రకటన తర్వాత ఆ స్థాయిని దాటలేకపోయినా, గతవారపు కనిష్టస్థాయి అయిన 25,386 పాయింట్ల స్థాయిని కోల్పోయినా మళ్లీ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లీ తర్వాతి రోజుల్లో 24,833 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఆగస్టు 24న సెన్సెక్స్ భారీగా నష్టపోయినపుడు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 26,730 స్థాయి నుంచి పతనం జరిగింది. ఈ వారం 26,339 పాయింట్ల నిరోధస్థాయిని అధిగమిస్తే 26,500-26,816 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన పటిష్టంగా ముగిస్తే 27,130 పాయింట్ల స్థాయిని చేరే ఛాన్స్ వుంటుంది. ఈ వారం 25,386 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే తిరిగి 24,830 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ మద్దతు 7,723-నిరోధం 8,021 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,021 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 7,723 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 114 పాయింట్ల నష్టంతో 7,868 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీకి కూడా గతవారపు కనిష్ట, గరిష్టస్థాయిలు ఈ వారం కీలకమైనవి. ఈ వారం 8,021 పాయింట్ల గరిష్టస్థాయిని దాటితే 8,060-8,142 పాయింట్ల శ్రేణిని సూచీ అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,225 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంది. ఈ వారం 7,723 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే మరోదఫా 7,540 పాయింట్ల స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అక్టోబర్ డెరివేటివ్ సిరీస్‌లో బిల్డప్ తక్కువగా జరిగింది. ఉన్నంతలో 7,800, 7,500 స్ట్రయిక్స్ వద్ద అధిక పుట్ బిల్డప్, 8,000, 8,200 స్ట్రయిక్స్ వద్ద అధిక కాల్ బిల్డప్ వుంది. పాలసీ తర్వాత భారీ ట్రేడింగ్ పరిమాణంతో 7,800 స్థాయిని కోల్పోతే తదుపరి 7,500 మద్దతుస్థాయివరకూ నిఫ్టీ తగ్గవచ్చని, 8,000 స్థాయిని భారీ టర్నోవర్‌తో దాటితే 8,200 స్థాయివరకూ పెరగవచ్చని ప్రస్తుత ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. -
మద్దతు 26,550- నిరోధం 27,280
మార్కెట్ పంచాంగం రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లను పావుశాతం మాత్రమే తగ్గించడంతో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా బ్యాంక్ నిఫ్టీలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీల (3.8 శాతం) కన్నా, బ్యాంక్ నిఫ్టీ (5.8 శాతం) అధికంగా క్షీణించింది. 2016 మార్చికి ద్రవ్యోల్బణం అంచనాల్ని 6 శాతానికి పెంచుతూ, ఇకపై రేట్ల తగ్గింపు వుండదంటూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ చెప్పడంతో మార్కెట్లో పతనం వేగంగా జరిగింది. అయితే వారాంతంలో రాజన్ తన మాటల్ని సవరించుకుని, రేట్ల కోతకు ద్వారాలు మూసుకుపోలేదంటూ మార్కెట్‌ను శాంతపర్చే ప్రయత్నం చేశారు. అలాగే వర్షాభావ పరిస్థితుల్ని ముందస్తు అంచనాల్లో ప్రకటించిన వాతావరణ శాఖ రుతుపవనాల కదలికలు తొలి రెండురోజుల్లో ఆశావహంగా వున్నట్లు తెలిపింది. రాజన్, వాతావరణ శాఖల మలి ప్రకటనలు రెండూ ఈ వారం మార్కెట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీని తీసుకువచ్చే చాన్స్ వుంది. అయితే గత శుక్రవారం అమెరికా జాబ్స్ డేటా పటిష్టంగా వున్నందున, ఆ దేశపు కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఈ అంచనాలు మార్కెట్లో క్షీణతను కొనసాగించే ప్రమాదమూ వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 5తో ముగిసిన వారంలో 27,959 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 26,552 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,060 పాయింట్ల నష్టంతో 26,768 వద్ద ముగిసింది. గత వారపు కనిష్టస్థాయి అయిన 26,550 పాయింట్ల స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు తొలి మద్దతు అందించవచ్చు. ఈ మద్దతును కోల్పోయి, ముగిస్తే మే నెల కనిష్టస్థాయి 26,424 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 26,250 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 27,280 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. రానున్న రోజుల్లో ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే మార్కెట్లో డౌన్‌ట్రెండ్ ముగిసి, 27,470 స్థాయికి ర్యాలీ జరగవచ్చు. ఆపైన సెన్సెక్స్ సాంకేతిక లక్ష్యం 27,950 పాయింట్లు. నిఫ్టీ మద్దతు 8,050-నిరోధం 8,240 ఆర్బీఐ పాలసీ సమీక్ష తర్వాత వేగంగా క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 8,050 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు 319 పాయింట్ల నష్టంతో 8,115 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా జాబ్స్ డేటా ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైతే మరోదఫా 8,050 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,990 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున మరో ముఖ్యమైన మద్దతు 7,960 పాయింట్లు. ఈ వారం రెండో మద్దతును పరిరక్షించుకోగలిగితే 8,240 పాయింట్ల అవరోధస్థాయికి నిఫ్టీ పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,305 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. తదుపరి అవరోధ స్థాయిలు 8,380, 8,450 పాయింట్లు. -
అవరోధ శ్రేణి 27,500-600
మార్కెట్ పంచాంగం భారత్ సూచీలు మూడు వారాల నుంచి దాదాపు 4 శాతం శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం వారం ఈ శ్రేణి 2.5 శాతానికి పరిమితమయ్యింది. ఇలా ఒడిదుడుకుల శాతం క్రమేపీ తగ్గి, ఒక్కసారిగా విస్తృతంకావడం సర్వసాధారణం. ప్రస్తుతానికి భారత్ మార్కెట్ దీర్ఘకాలిక ట్రెండ్ బుల్లిష్‌గానూ, స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్‌గానూ వుంది. రాబోయే ఒకటి, రెండు వారాల్లో ఈ శ్రేణి విస్తృతమై, ఎటో ఒకవైపు మార్కెట్ వేగంగా కదలవచ్చు. అలా కదిలే దిశ తో దీర్ఘకాలిక ట్రెండ్ బేరిష్‌గా మారడం లేదా స్వల్పకాలిక ట్రెండ్ బుల్లిష్‌గా రూపాంతరం చెందడం జరగవచ్చు. ఇక ఈ వారం సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మే 15తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 27,544-26,750 పాయింట్ల శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 219 పాయింట్ల స్వల్పలాభంతో 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు వారాల నుంచి 27,500-600 శ్రేణి అవరోధం కల్పిస్తున్నందున, ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటి స్థిరపడితేనే తదుపరి పెరుగుదల సాధ్యపడుతుంది. అటుపైన స్థిరపడితే క్రమేపీ 27,830 స్థాయికి పెరగవచ్చు. అనూహ్యమైన సానుకూల వార్తలేవైనా వెలువడితే 28,090 పాయింట్ల స్థాయికి సైతం ర్యాలీ జరిపే చాన్స్ వుంది. సెన్సెక్స్ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధ శ్రేణిని దాటలేకపోతే 26,750 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. మార్కెట్‌ను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేసే వార్తలేవైనా వెలువడితే మరోదఫా 26,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 26,250 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. నిఫ్టీ నిరోధం 8,355 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 8,335 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని చవిచూసి, 8,090 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. తదుపరి స్వల్పంగా కోలుకోవడంతో చివరకు 71 పాయింట్ల లాభంతో 8,262 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల నుంచి 8,300-8,355 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి 8 దఫాలు అవరోధం కల్పించినందున, ఈ శ్రేణిని అధిగమించిన తర్వాతే ఆపైన పెరిగే అవకాశం వుంటుంది. ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఈ వారం తొలి అవరోధ శ్రేణిని అధిగమించలేకపోతే 8,090 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 7,960 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. గత డిసెంబర్లో మద్దతునిచ్చిన ఈ స్థాయిని నష్టపోతే, ప్రతికూల పరిస్థితుల్లో 7,730 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. నిఫ్టీ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 8,505 స్థాయిపైన కొద్ది ట్రేడింగ్ సెషన్లపాటు స్థిరపడాల్సి ఉంటుంది. - పి. సత్యప్రసాద్ -
సెన్సెక్స్ మద్దతు 29,160
మార్కెట్ పంచాంగం అరుణ్‌జైట్లీ బడ్జెట్ కార్పొరేట్లను, విదేశీ ఇన్వెస్టర్లను సంతృప్తిపర్చడంతో ఐటీ, ఫార్మా షేర్ల సహకారంతో నెమ్మదిగా పెరుగుతున్న మార్కెట్లో రిజర్వుబ్యాంక్ చర్య మార్పుతెచ్చింది. ఆర్బీఐ హఠాత్తుగా రేట్లు తగ్గించిన ప్రభావంతో ఒక్కసారిగా బ్యాంకింగ్ షేర్లు ఎగిసిపోయాయి. ఆ పెరుగుదల లాభాల స్వీకరణకు అవకాశం కల్పించడంతో రేట్ల తగ్గింపు రోజున సూచీలు గరిష్టస్థాయి నుంచి పడిపోయాయి. కానీ ఇదే సమయంలో కొన్ని ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు కొత్త రికార్డుల్ని సృష్టించినందున, ప్రధాన సూచీల్లో పెద్ద కరక్షన్ జరిగే అవకాశాలు తక్కువ. కొద్దిరోజులపాటు ఒక శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఫిబ్రవరి 28తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 30,000 శిఖరాన్ని తాకిన వెనువెంటనే లాభాల స్వీకరణతో వేగంగా ఆ శిఖరం నుంచి జారిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 88 పాయింట్ల లాభంతో 29,449 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 30,100 పాయింట్ల లక్ష్యాన్ని సెన్సెక్స్ దాదాపు చేరినందున, వెనువెంటనే తిరిగి 30,000 పాయింట్ల స్థాయిని అధిగమించి, స్థిరపడలేకపోతే రానున్న వారాల్లో 28,880-28,690 పాయింట్ల మద్దతు శ్రేణి వరకూ కరక్షన్ జరిగే అవకాశం వుంది. శుక్రవారం అమెరికా మార్కెట్ల పతనం కావడంతో సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 29,160 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ మద్దతు లోపున ముగిస్తే స్వల్పకాలిక దిద్దుబాటు జరగవచ్చు. ఆ లోపున 28,970 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 28,880-28,690 పాయింట్ల మద్దతు శ్రేణి కీలకం. అప్‌ట్రెండ్ కొనసాగితే ఈ వారం తొలుత 29,700 స్థాయి సూచీకి అవరోధం కల్పించవచ్చు. ఆటుపైన 29,980 స్థాయికి చేరవచ్చు. సమీప భవిష్యత్తులో 30,025 స్థాయిని దాటి, స్థిరపడితే క్రమేపీ 30,200 స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ శ్రేణి దిగువన ముగిస్తే మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 8,850 ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,119 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయికి చేరిన తర్వాత వేగంగా సర్దుబాటుకు లోనుకావడంతో 8,938 పాయింట్ల వద్ద ముగి సింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 36 పాయింట్ల స్వల్పలాభాన్ని సంపాదించింది. వచ్చేవారం నిఫ్టీ తొలి నిరోధస్థాయిని దాటలేకపోతే 8,850 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే 8,750 స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే తిరిగి 8,670 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 9,020 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం ఎదురుకావొచ్చు. అటుపైన స్థిరపడితే 9,080 స్థాయికి పెరగవచ్చు. రానున్న రోజుల్లో 9,120 పాయింట్ల రికార్డును అధిగమించగలిగితే క్రమేపీ కొద్ది వారాల్లో 9,250 స్థాయికి ర్యాలీ జరిపే చాన్స్ వుంది. రానున్న రోజుల్లో నిఫ్టీ ఈ స్థాయి దిగువన ముగిస్తే, మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తే ప్రమాదం ఉంటుంది. -
సెన్సెక్స్ నిరోధం 29,800
మార్కెట్ పంచాంగం భారత్ స్టాక్ సూచీలు దాదాపు రికార్డుస్థాయిలో ట్రేడవుతున్న సమయంలో బడ్జెట్ వారం సమీపించింది. వాస్తవానికి బడ్జెట్ అంచనాలతో పెరిగిన బ్లూచిప్ షేర్లు ఈ మధ్య పెద్దగా లేవనే చెప్పాలి. రెండు వారాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 3.5 శాతంవరకూ పెరిగాయి. వీటి పెరుగుదలకు ప్రధాన కారణమైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐటీసీ షేర్లపై బడ్జెట్ అంచనాలేవీ లేనందున, ప్రపంచ సానుకూల ట్రెండ్‌లో భాగంగానే ఇటీవల మార్కెట్ ర్యాలీ జరిగిందని భావించవచ్చు. ఇలా అంచనాలు లేని సమయంలో వచ్చే బడ్జెట్లో మార్కెట్‌ను ఆశ్చర్యపర్చే ప్రతిపాదనను ప్రకటిస్తే, సూచీలు పరుగులు తీయవచ్చు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సాదాసీదాగా వున్నా, ఇన్వెస్టర్లు పెద్దగా నిరుత్సాహపడేదేమీ వుండదు. వారు ప్రపంచ మార్కెట్ ట్రెండ్‌వైపు దృష్టి మళ్ళించవచ్చు. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు..., ఫిబ్రవరి 20తో ముగిసిన వారం ప్రధమార్థంలో 29,523-29,083 పాయింట్ల మధ్య స్వల్పశ్రేణిలో కదిలిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 136 పాయింట్ల లాభంతో 29,231 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 29,500-600 శ్రేణిని చేరవచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే 29,800 స్థాయికి చేరవచ్చు. ఈ వారం బడ్జెట్ సందర్భంగా ర్యాలీ జరిగితే ఈ స్థాయే కీలకమైన అవరోధం. ఆపైన స్థిరపడితే క్రమేపీ 30,100 స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం 29,500-600 శ్రేణిని అధిగమించలేకపోతే 29,080 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 28,830 పాయింట్ల వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. ఈ లోపున మద్దతులు 28,600, 28,400పాయింట్లు. నిఫ్టీ మద్దతు 8,790-అవరోధం 8,920 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,913-8,794 శ్రేణి మధ్య కదిలిన తర్వాత చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 29 పాయింట్ల స్వల్పలాభంతో 8,833 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం 8,790 పాయింట్ల స్థాయి మూడు ట్రేడింగ్ రోజుల్లో నిఫ్టీకి మద్దతునిచ్చినందున, ఈ వారం ప్రధమార్థంలో 8,790 మద్దతును కోల్పోతేనే మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయిని నిలుపుకుంటూ, నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 8,920 పాయింట్ల నిరోధస్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 8,966 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. అటుపైన 9,050 పాయింట్ల రికార్డుస్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి మద్దతును కోల్పోతే 8,730 స్థాయికి వేగంగా తగ్గవచ్చు. ఆ దిగువన వెనువెంటనే 8,650 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 8,595 స్థాయికి పడిపోవొచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 8,900, 9,000 స్ట్రయిక్స్ వద్ద కాల్ బిల్డప్‌తో పోలిస్తే 8,800, 8,700 స్ట్రయిక్స్ వద్ద పుట్ బిల్డప్ చాలా తక్కువ. వచ్చే వారం తొలి నాలుగురోజుల్లో చిన్న పెరుగుదలలో కూడా నిఫ్టీ నిరోధాన్ని చవిచూడవచ్చని, క్షీణత జరిగితే వేగంగా వుండవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. -
కీలక మద్దతు 28,200
మార్కెట్ పంచాంగం రిజర్వుబ్యాంకు తాజా పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించలేదన్న నిరుత్సాహంతో పాటు పలు బ్యాంకుల ఎన్పీఏలు పెరగడంతో గతవారం బ్యాంకింగ్ ఇండెక్స్ 5 శాతంపైగా క్షీణించింది. ఇప్పటికే బ్యాంకింగ్ ఇండెక్స్ ఇటీవలి రికార్డు గరిష్టస్థాయి నుంచి 10 శాతంపైగా పతనమయ్యింది. కానీ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు మాత్రం వాటి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి నుంచి 3.5 శాతమే తగ్గాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు పటిష్టంగా ట్రేడవుతున్నందున, ప్రధాన సూచీల్లో క్షీణత అల్పంగా వుంది. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే పలు వార్తలు వెలువడే సమయంలో కూడా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు బలంగా నిలిస్తే, కొద్దిరోజుల కరెక్షన్ తర్వాత ప్రధాన సూచీల్లో బడ్జెట్ ర్యాలీ మొదలయ్యే ఛాన్స్ వుంటుంది. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఫిబ్రవరి 6తో ముగిసిన వారంలో వరుసగా ఐదు రోజులూ క్షీణించిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 465 పాయింట్ల నష్టంతో 28,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 28,790 పాయింట్ల దిగువన సెన్సెక్స్ ముగిసినందున, ఈ వారం మరింత క్షీణత కొనసాగే అవకాశం వుంది. సెన్సెక్స్ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 29,270 పాయింట్ల నిరోధస్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటాల్సివుంటుంది. లేదా వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ సోమవారం ఢిల్లీ ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రతికూలంగా మార్కెట్ స్పందిస్తే 28,325 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 28,200 స్థాయికి తగ్గవచ్చు. ఈ రెండో స్థాయి వద్ద ఈ వారం మార్కెట్ మద్దతు పొందగలిగితే వచ్చే బడ్జెట్ సమయానికల్లా 30,000 శిఖరాన్ని అందుకునే వీలుంటుంది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలి అవరోధం 29,070 సమీపంలో ఎదురవుతున్నది. ఆపైన 29,270 స్థాయివరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని బలంగా బ్రేక్చేస్తే 29,800 స్థాయికి ర్యాలీ జరపవచ్చు. 28,200 దిగువన మద్దతులు 27,900, 27,650 పాయింట్లు. నిఫ్టీ ముఖ్య మద్దతు 8,530 బ్యాంక్ నిఫ్టీ భారీ పతనం కారణంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 148 పాయింట్లు నష్టంతో 8,661 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 8,575 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 8,530 పాయింట్ల మద్దతు స్థాయి నిఫ్టీకి ప్రధానమైనది. మార్కెట్‌ను ప్రభావితం చేసే పలు వార్తలు ఈ వారం వెలువడనున్నాయి. ఈ సందర్భంగా నిఫ్టీ ఈ స్థాయిని గనుక పరిరక్షించుకోగలిగితే, కొద్దివారాల్లో మళ్లీ 9,000 పాయింట్ల స్థాయికి పెరిగే చాన్స్ ఉంటుంది. ఈ వారం నిఫ్టీ పెరిగితే తొలుత 8,775 పాయింట్ల అవరోధ స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 8,840 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 8,966 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. కీలకమైన 8,530 పాయింట్ల మద్దతుస్థాయిని నిఫ్టీ కోల్పోతే.. ఆ దిగువన మద్దతు స్థాయిలు 8,420, 8,350 పాయింట్లు. -
కీలక మద్దతు 28,800
మార్కెట్ పంచాంగం కొద్ది నెలల నుంచి జరుగుతున్న మార్కెట్ ర్యాలీలతో పోలిస్తే క్రితంవారం అప్‌ట్రెండ్ బలంగా వున్నట్లు ఆయా షేర్ల కదలికలు సూచిస్తున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల్లో అంతర్భాగంగా వుండే షేర్లలో 10 శాతం మాత్రమే గత ర్యాలీల్లో కొత్త శిఖరాల్ని చేరుతూవుండేవి. కానీ ఈ దఫా మూడోవంతు షేర్లు రికార్డుల్ని సృష్టించగలిగాయి. తాజా ర్యాలీలో బ్యాంకింగ్‌తో పాటు ఫార్మా, సిమెంటు షేర్లు పాలుపంచుకున్నాయి. వచ్చే కొద్దిరోజుల్లో మరిన్ని షేర్లు సూచీలకు అనుగుణంగా నూతన గరిష్టస్థాయిల్ని చేరుతూవుంటే మార్కెట్ ర్యాలీ చెదిరిపోకుండా వుండటమేకాదు. మరింత ఉధృతమవుతుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 23తో ముగిసినవారం ఐదురోజులూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 29,000 శిఖరాన్ని అధిరోహించింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,157 పాయింట్ల భారీలాభంతో 29,279 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ ర్యాలీ కొనసాగితే 29,500-600 లక్ష్యాన్ని చేరవచ్చు. రానున్న రోజుల్లో 30,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరాలంటే 29,500-29,600 స్థాయిని దాటాల్సివుంటుంది. ఇక ఈ వారం కరెక్షన్ జరిగితే 28,800 సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఇదే స్థాయి నుంచి బుధవారం భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ పెరగడం, ఇదేస్థాయి నవంబర్ 28నాటి రికార్డుస్థాయి అయినందున, 28,800 దిగువన ముగిస్తేనే తదుపరి క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన మద్దతులు 28,325, 28,200 పాయింట్లు. వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. నిఫ్టీ మద్దతు 8,690 గత మార్కెట్ పంచాంగంలో సూచించినట్లు ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,545 స్థాయిని ఛేదించినంతనే పెద్ద ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 322 పాయింట్లు పెరుగుదలతో 8,836 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ క్షీణిస్తే 8,690 వద్ద ప్రధాన మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు కోల్పోకపోతే 9,000 పాయింట్ల శిఖరాన్ని ఈ వారం చేరవచ్చు. ఆ లోపున 8,880 స్థాయిని తొలుత దాటాల్సివుంటుంది. హెచ్చుతగ్గులు ఏర్పడితే 8,690 దిగువన మద్దతుస్థాయిలు 8,575, 8,530 పాయింట్లు. జనవరి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా పై స్థాయిలో నిఫ్టీకి ఆప్షన్ బిల్డప్ ఇప్పటివరకూ అల్పంగానే వుంది. 9,000 స్ట్రయిక్ వద్ద మాత్రమే కాస్త ఎక్కువగా 44 లక్షల కాల్ బిల్డప్ వుంది. అలాగే దిగువన 8,700, 8,600, 8,500 స్ట్రయిక్స్ వద్ద 46.5-49 లక్షల మధ్య పుట్ బిల్డప్ ఏర్పడింది. ఈ వారం నిఫ్టీకి సమీపస్థాయిలో పెద్దగా నిరోధం, మద్దతుగానీ వుండకపోవచ్చని, సూచీ స్వేచ్ఛగా కదలవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ వెల్లడిస్తున్నది. -
అవరోధ శ్రేణి 28,500 -28,600
మార్కెట్ పంచాంగం భారత్ సూచీల్లో భాగమైన రెండు ప్రధాన షేర్లు హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కొత్త రికార్డును సృష్టించడంవల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని, తద్వారా సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం తప్పుతుందని గత మార్కెట్ పంచాంగంలో సూచించాం. ఈ రెండు షేర్లూ గతవారం కూడా ర్యాలీ జరిపి మరో కొత్త రికార్డును సృష్టించడంతో పాటు ఎన్ఎస్ఈ నిఫ్టీలో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంక్ నిఫ్టీ నూతన గరిష్టస్థాయికి చేరింది. బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ కొనసాగితే ప్రధాన సూచీలు సైతం వచ్చే కొద్దిరోజుల్లో నూతన శిఖరాలను అధిరోహిస్తాయి. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ వెనుతిరిగితే సాంకేతికంగా మార్కెట్ డేంజర్‌జోన్‌లో ప్రవేశించినట్లే. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 16తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్క ఉదుటన ర్యాలీ జరిపి 28,194 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 664 పాయింట్ల భారీ లాభంతో 28,122 వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా సూచీల పెరిగిన ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలైతే 28,380 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన ముగిస్తే వేగంగా 28,570 స్థాయిని అందుకోవొచ్చు. ఇక అటుపై కీలక అవరోధం 28,822 పాయింట్ల స్థాయి (నవంబర్ 28నాటి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి ఇది). ఇదే స్థాయి నుంచి గతంలో భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ క్షీణించినందున.. ఈ నెలలో 29,000 శిఖరాన్ని అందుకోవాలంటే ఈ స్థాయిని ఛేదించి, స్థిరపడాల్సివుంటుంది. అంతకుముందు 28,500-600 అవరోధ శ్రేణిని సెన్సెక్స్ దాటాల్సివుంటుంది. ఈ శ్రేణిని అధిగమించలేకపోతే 27,940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున క్రమేపీ 27,700 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 27,500-27,600 పాయింట్ల శ్రేణి వద్ద కీలకమైన మద్దతు వుంది. ఈ మద్దతును కోల్పోతే సూచీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశించే ప్రమాదం వుంటుంది. నిఫ్టీ 8,545పైన స్థిరపడితే ర్యాలీ నవంబర్ చివరివారం-డిసెంబర్ తొలివారం మధ్య జరిగిన ర్యాలీతో పోలిస్తే ఈ దఫా అప్‌ట్రెండ్‌లో సెన్సెక్స్‌కంటే ఎన్ఎస్ఈ నిఫ్టీ వేగం ఎక్కువగా వున్నందున ఈ సూచీయే తొలుత కొత్త రికార్డు నెలకొల్పే ఛాన్స్ వుంది. జనవరి 16తో ముగిసినవారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 8,514 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్ ట్రేడింగ్ జరిగితే 8,545 పాయింట్ల సమీపంలో నిఫ్టీ ప్రారంభం కావొచ్చు. ఆపైన స్థిరపడితే 8,590 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ డిసెంబర్ 4నాటి రికార్డుస్థాయి 8,627 పాయింట్లను అందుకోవచ్చు. మరింత ర్యాలీ కొనసాగితే 8,700-8,750 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం 8,545 స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,450 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 8,380 స్థాయి వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 8,300-8,330 శ్రేణి వద్ద లభించే మద్దతు కీలకం. ఈ మద్దతు శ్రేణిని కోల్పోతే తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి నిఫ్టీ మళ్లవచ్చు. -
సెన్సెక్స్ మద్దతు 27,100 పాయింట్లు
మార్కెట్ పంచాంగం కారణం ఏదైనా, సాధారణంగా జనవరి నెలలో కన్పించే ఒడిదుడుకులు ఈ ఏడాది కూడా ప్రస్ఫుటమయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ సూచీలు గతవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే భారీ పతనం జరిగిన తర్వాత మార్కెట్లో రికవరీ సందర్భంగా రెండు ప్రధాన షేర్లు హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరడం శుభసూచకం. ఇలా సూచీల్లో భాగస్వాములైన షేర్లు కొత్త రికార్డును సృష్టించడంవల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుంది. తద్వారా సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం తప్పుతుంది. కానీ ఈ ప్రమాదంలో పడకుండా వుండాలంటే వచ్చే కొద్దివారాల్లో మరిన్ని షేర్లు కొత్త గరిష్టస్థాయిల్ని సాధించాల్సివుంటుంది. అలా కాకుండా హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఈ వారం భారీగా క్షీణిస్తే సాంకేతికంగా మార్కెట్ డేంజర్‌జోన్‌లో ప్రవేశించినట్లే. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 9తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 28,064 పాయింట్ల గరిష్టస్థాయి-26,776 పాయింట్ల కనిష్టస్థాయిల మధ్య 1,300 పాయింట్ల మేర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 430 పాయింట్ల నష్టంతో 27,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సైతం ఒడిదుడుకులు కొనసాగితే సెన్సెక్స్‌కు 27,100 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే 26,900 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని కూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే తిరిగి 26,770 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం ప్రారంభంలో 27,100 మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 27,700 పాయింట్ల అవరోధస్థాయి వరకూ ర్యాలీ జరపవచ్చు. ఆపైన ముగిస్తే 28,050 స్థాయికి పెరగవచ్చు. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే క్రమేపీ 28,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 8,170 గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 8,450 పాయింట్ల వద్ద క్రితం సోమవారం అవరోధాన్ని ఎదుర్కొన్న ఎన్ఎస్ఈ నిఫ్టీ వేగంగా 8,065 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. వారాంతానికల్లా కొంతమేర నష్టాల్ని పూడ్చుకొని, చివరకు 110 పాయింట్ల నష్టంతో 8,285 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,170 స్థాయి వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఆ లోపున ముగిస్తే నేరుగా 8,100 స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా వదులుకుంటే తిరిగి 8,060 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ ర్యాలీ సాగించాలంటే 8,330 పాయింట్ల సమీపంలో వున్న అవరోధాన్ని తొలుత దాటాల్సివుంటుంది. ఆపైన ముగిస్తే తిరిగి 8,450-8,500 అవరోధ శ్రేణివరకూ పెరగవచ్చు. సూచీ కొత్త రికార్డును నెలకొల్పాలంటే 8,545 పాయింట్ల స్థాయిని దాటాల్సివుంటుంది. -
తక్షణ మద్దతు 20,920 పాయింట్లు
మార్కెట్ పంచాంగం ఇటు రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌వేయడం, అటు ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను ప్రారంభించడం...ఈ రెండు దేశాల కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు మార్కెట్లను ఆశ్చర్యపర్చాయి. ఈ నిర్ణయాల్ని స్వాగతిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు ఒకేవారంలో రూ. 6,000 కోట్ల నిధుల్ని భారత్ మార్కెట్లోకి కుమ్మరించడంతో మళ్లీ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్టస్థాయిల్ని సవాలుచేయడానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా వచ్చిన ర్యాలీ కొత్త శిఖరాలపై స్థిరపడలేకపోయింది. ఆ ర్యాలీని ముందుండి నడిపించే రంగం లేకపోవడమే అందుకు కారణం కావొచ్చు. అయితే ఈ దఫా ప్రధాన ఐటీ షేర్లన్నీ కలిసికట్టుగా ర్యాలీ జరపడం, అవి కొత్త రికార్డులను సృష్టించడం, ఐటీ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరడం వంటి అంశాలు ఈ దఫా మార్కెట్ ర్యాలీ నిలదొక్కుకునేలా చేయవచ్చు. కొద్ది నెలల నుంచి భయపడుతున్నట్లు ఫెడ్ నిర్ణయం మార్కెట్లను అస్థిరపర్చనందున, ఇన్వెస్టర్ల విశ్వాసం పెంపొంది మార్కెట్లో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. ఇక సాంకేతికాంశాలకొస్తే..... సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు డిసెంబర్ 20తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 20,569 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత, 21,118 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 365 పాయింట్ల లాభంతో 21,080 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 21,134 సమీపంలో తక్షణ నిరోధం ఎదురుకావొచ్చు. ఆసియా మార్కెట్లు సోమవారం సానుకూలంగా వుంటే ఈ స్థాయిపైనే సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలుకావొచ్చు. అయితే ఆపైన స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. 21,134 పాయింట్లపైన క్రమేపీ 21,288 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే వేగంగా 21,500-21,600 శ్రేణిని చేరవచ్చు. నాటకీయంగా ఈ శ్రేణిని అధిగమించగలిగితే కొద్ది వారాల్లో 22,498 పాయింట్ల లక్ష్యాన్ని చేరే ఛాన్స్ వుంటుంది. ఈ వారం తొలి అవరోధంపైన స్థిరపడలేకపోతే 20,920 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే నెమ్మదిగా 20,400-20,600 మద్దతుశ్రేణి వద్దకు తగ్గవచ్చు. నిఫ్టీ తక్షణ నిరోధం 6,306 డిసెంబర్ 20తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగానే 6,130 తగ్గిన తర్వాత, చివరిరోజున వేగంగా 6,284 గరిష్టస్థాయికి ఎన్ఎస్ఈ నిఫ్టీ పెరిగింది. అంతక్రితంవారంతో పోలిస్తే 106 పారుుంట్ల లాభంతో 6,274 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 6,306 వద్ద తక్షణ అవరోధం ఎదురవుతున్నది. డిసెంబర్ 9నాటి 6,415 పాయింట్ల స్థాయి నుంచి 6,130 పాయింట్ల వరకూ జరిగిన 285 పాయింట్ల క్షీణతకు 61.8% రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 6,306 పాయింట్లు. అటుపైన 6,355 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన స్థిరపడితే తిరిగి 6,415 స్థాయికి చేరవచ్చు. డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మరో రౌండు షార్ట్ కవరింగ్ జరిగితే 6,415 పాయింట్ల స్థాయిని కూడా ఛేదించే ఛాన్స్ వుంది. ఈ స్థాయిపైన క్రమేపీ కొద్ది వారాల్లో 6,550-6,600 శ్రేణిని అందుకోవొచ్చు. తొలి రెండు అవరోధాలను అధిగమించలేకపోతే రెండు వారాలపాటు 6,100-6,355 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఈ వారం 6,235 పాయింట్ల వద్ద ఈ వారం తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే నెమ్మదిగా మళ్లీ 6,100-6,150 పాయింట్ల మద్దతుశ్రేణి వద్దకు జారుకోవచ్చు. - పి. సత్యప్రసాద్ -
నిఫ్టీ 6,357 దాటితేనే అప్‌ట్రెండ్
మార్కెట్ పంచాంగం ఇటు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం, అటు అమెరికా మార్కెట్లో శుక్రవారం పెద్ద ర్యాలీ జరగడంవల్ల ఈ వారం మన స్టాక్ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలవుతాయనడంలో సందేహం లేదు. అయితే తర్వాత నిలదొక్కుకోవడమనేది ఇన్వెస్టర్ల తక్షణ వ్యవహారశైలిపై ఆధారపడి వుంటుంది. ఈ వారం ఇన్వెస్టర్ల ధోరణి నాలుగు కోణాల్లో వుండవచ్చు. అవి.... 1. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్ని వివిధ ఛానళ్లలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నందున, ఈ వారం లాభాల స్వీకరణ జరగడం.... 2. వచ్చే లోక్‌సభ ఫలితాలపై తాజా అంచనాలతో గతవారపు అప్‌ట్రెండ్ కొనసాగడం. 3. అమెరికాలో నిరుద్యోగం రేటు 7 శాతం కనిష్టస్థాయికి తగ్గడంతో జరిగిన అక్కడి ర్యాలీ ప్రభావంతో పెట్టుబడుల జోరు పెరగడం. 4. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న పలు సంకేతాలు ఇటీవల వెలువడుతున్నందున, ఫెడరల్ రిజర్వ్ నిధుల ప్రవాహాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టవచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడం. ఇక మార్కెట్ సాంకేతిక అంశాలకొస్తే..... నిఫ్టీ కదలికలు కీలకం.... బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని నెలరోజుల క్రితమే చేరినందున, ఇప్పుడా సూచీ సాధించే రికార్డుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదు. సెన్సెక్స్‌కంటే అధికంగా ట్రేడయ్యే నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటితేనే భారత్‌లో దీర్ఘకాలిక బుల్ ట్రెండ్ బలపడే అవకాశం వుంటుంది. డెరివేటివ్ ట్రేడింగ్ పొజిషన్లు ఎక్కువగా వుండే ఈ సూచీ కొత్త రికార్డును సృష్టిస్తేనే మరిన్ని పెట్టుబడులురావడం, మరింత షార్ట్ కవరింగ్ జరగడం ద్వారా మొత్తంగా మార్కెట్ తీరే మారిపోతుంది. ఈ సూచీ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరలేకపోతున్నదని పసిగట్టిన మరుక్షణమే అటు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఇటు బేర్స్ షార్టింగ్ కార్యకలాపాలు మొదలైపోతాయి. నవంబర్ తొలివారంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ తృ టిలో ఆ ఛాన్స్ మిస్‌కావడంతో అప్పుడు జరిగిందదే. 2008 జనవరి 8నాటి రికార్డుస్థాయి 6,357 పాయింట్లుకాగా, గత నవంబర్ 3న 6,343 స్థాయి నుంచి నిఫ్టీ వెనుతిరిగింది. తాజాగా కొత్త రికార్డుకోసం నిఫ్టీ మరో ప్రయత్నం చేస్తున్నది. ఈ వారం 6,357 స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించి, స్థిరపడితేనే భారత్ మార్కెట్ మళ్లీ దీర్ఘకాలిక బుల్ కక్ష్యలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ తక్షణ నిరోధం 6,343 డిసెంబర్6తో ముగిసినవారంలో 6,300 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 84 పారుుంట్ల లాభంతో 6,260 వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే తక్షణ అవరోధం నవంబర్ 3 నాటి 6,343 స్థాయి వద్ద ఎదురవుతున్నది. ఈ స్థాయిని దాటితే 6,357 స్థాయి తదుపరి నిరోధం. ఈ రెండు అడ్డంకుల్ని గ్యాప్అప్లోనే అధిగమించగలిగితే రానున్న రోజుల్లో అతిపెద్ద ర్యాలీని అంచనా వేయొచ్చు. కేవలం నాలుగైదు వారాల్లో 7,000 పాయింట్లస్థాయిని దాటినా ఆశ్చర్యంలేదు. తొలుత 6,357పైన వేగంగా 6,410 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే కొద్దిరోజుల్లో 6,550-6,600 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు.ఈ వారం ప్రధమార్థంలో తొలి రెండు అవరోధాల్ని అధిగమించలేకపోతే వేగంగా 6,150 మద్దతుస్థాయికి తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోయి ముగిస్తే రెండు వారాలపాటు మద్దతునిచ్చిన 5,972 స్థాయే ప్రధానం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే మార్కెట్ మళ్లీ బేర్ క క్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. సెన్సెక్స్ తక్షణ నిరోధం 21,320 డిసెంబర్ 6తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 21,165 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 204 పాయింట్ల పెరుగుదలతో 20,996 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో సెన్సెక్స్ మొదలైతే తక్షణ నిరోధం 21,320 స్థాయి(దీపావళినాటి రికార్డుస్థాయి) వద్ద ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితే 21,500-21,600 శ్రేణికి చేరవచ్చు. రానున్న రోజుల్లో కొత్త గరిష్టస్థాయిని సెన్సెక్స్ పరిరక్షించుకోగలిగితే క్రమేపీ 22,498 లక్ష్యాన్ని చేరవచ్చు. తొలి అవరోధాన్ని దాటలేకపోతే 20,674 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే 20,350 స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన మరోదఫా 20,137 స్థాయిని పరీక్షించవచ్చు. - పి. సత్యప్రసాద్ -
మార్కెట్ పంచాంగం
ఐదున్నర సంవత్సరాలుగా పలుదఫాలు నిరోధించిన 21,000 స్థాయిని మరోసారి పరీక్షించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఆపైన స్థిరపడలేక వెనుతిరిగింది. సహజంగానే ఈస్థాయి వద్ద షేర్ల సరఫరా అధికంగా వుంటుంది. అందువల్ల ఈ స్థాయికి అటూఇటూగా కొన్ని రోజులు లేదా వారాలు సూచీ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలుంటారు. అయితే 2010 నవంబర్‌లో సైతం కొద్దిరోజులు ఈ స్థాయి సమీపంలోనే సెన్సెక్స్ స్వల్ప హెచ్చుతగ్గులకులోనై, అటుతర్వాత పతనమయ్యింది. అలా పతనమయ్యే ప్రమాదం ఈ దఫా తక్కువని, కనాల్సిడేషన్ తర్వాత గరిష్ట నిరోధస్థాయిని అధిగమించవచ్చని ప్రస్తుత మార్కెట్లో ట్రేడింగ్ టర్నోవర్ సంకేతాలిస్తున్నది. అప్పటిలా కాకుండా సెన్సెక్స్ బ్రేక్అవుట్ జరపాలంటే రానున్న రోజుల్లో 20,150-20,050 మద్దతుశ్రేణిని పరిరక్షించుకోవాల్సివుంటుంది. సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా 21,000 స్థాయి బీఎస్ఈ సెన్సెక్స్‌కు అవరోధం కల్పించడంతో అక్టోబర్ 25తో ముగిసిన వారంలో చివరకు 20,684 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంతక్రితంవారంతో పోలిస్తే 199 పాయింట్ల నష్టపోయింది. ఈ వారం ఆర్బీఐ పాలసీ సమీక్ష తర్వాత అప్‌ట్రెండ్ మొదలైతే వేగంగా 21,000 స్థాయిని మరోదఫా అధిగమించవచ్చు. 21,108 స్థాయి వద్ద ఎదురయ్యే అవరోధాన్ని దాటితే ఆల్‌టైమ్ గరిష్టస్థాయి అయిన 21,206 పాయింట్ల వద్దకు పరుగులు తీయువచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి సెన్సెక్స్‌ను అడ్డుకుంటున్న ఈ కీలకమైన నిరోధాల వద్ద సూచీకి వేగంలోపిస్తే, అమ్మకాలు వెల్లువెత్తి వెనుతిరిగే ప్రమాదం వుంటుంది. పై అవరోధాల్ని భారీ టర్నోవర్‌తో సెన్సెక్స్ దాటగలిగితే వచ్చే కొద్ది వారాల్లో 22,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించే ఛాన్స్ వుంటుంది. పాలసీ విధానం వెలువడిన తర్వాత డౌన్‌ట్రెండ్ మొదలైతే తక్షణ మద్దతు 20,370 స్థాయి వద్ద లభిస్తున్నది. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,150-20,050 పాయింట్ల శ్రేణి వద్దకు సెన్సెక్స్ తగ్గవచ్చు. ఈ రెండో మద్దతుశ్రేణిని పరిరక్షించుకున్నంతవరకూ సమీప భవిష్యత్తులో సెన్సెక్స్ కొత్త రికార్డు సృష్టించే అవకాశాలు వుంటాయి. ప్రధాన మద్దతు 6,030 టెక్నికల్ చార్టుల ప్రకారం 6,230-6,257 శ్రేణి ఎ నిఫ్టీకి డేంజర్‌జోన్‌గా పరిణమిస్తుందంటూ గత వా రం సూచించిన రీతిలోనే అక్టోబర్ 25తో ముగిసిన వారంలో 6,252 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత సూచీ వెనుతిరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 6,145 వద్ద ముగిసింది. ఈ వారం ఆర్బీఐ నుంచి పాజిటివ్ వార్త ఎదైనా వెలువడితే నిఫ్టీ మరోదఫా వేగంగా 6,250 స్థాయిని చేరొచ్చు. ఈ నిరోధస్థాయిని అధిగమించి, నిలదొక్కుకోగలిగితే 6,338 వద్దకు చేరొచ్చు. అటుపై 2008 జనవరి 8నాటి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి అయిన 6,357 స్థాయి నిఫ్టీకి గట్టి అవరోధం కల్పించవచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ టర్నోవర్‌తో దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికే కట్టుబడితే నిఫ్టీ తక్షణ మద్దతు 6,030 వద్దకు క్షీణించొచ్చు. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 5,980-5,950 శ్రేణి వద్ద మరో మద్దతు లభిస్తోంది. ఈ వారం అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియునున్న సందర్భంగా 6,000 స్ట్రయిక్ వద్ద మాత్రమే పుట్ బిల్డప్ (62 లక్షల షేర్ల బిల్డప్) కాస్త ఎక్కువగా వుంది. ఈ స్థాయిని దిగువవైపుగా అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 5,850 స్థాయికీ తగ్గే ప్రమాదం వుంటుంది. కానీ 6,200, 6,300 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ బలహీనంగా వున్నందున అప్‌ట్రెండ్ మొదలైతే ఈ రెండు స్థాయిల్ని వేగంగా దాటే ఛాన్స్ కూడా వుంటుంది. బ్యాంక్ నిఫ్టీ మద్దతు 10,700 ఈ మంగళవారం ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచొన్న అంచనాలు మార్కెట్లో ఉన్నా, బ్యాంకింగ్ షేర్లు 4 నెలల గరిష్టస్థాయిలోనే ట్రేడ్అవుతూ వున్నాయి. ప్రధాన సూచీ నిఫ్టీ అప్‌ట్రెండ్‌కు ప్రధానపాత్ర పోషించిన ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు ఇప్పుడు వెనకడుగువేస్తుండగా, నిఫ్టీలో 30% వరకూ వెయిటేజి వున్న బ్యాంకింగ్ షేర్లు ప్రధాన సూచీ 6,100 పాయింట్లపైన స్థిరపడేందుకు కారణవువుతున్నారు. ఈ కారణంగా రానున్న రోజుల్లో నిఫ్టీ ట్రెండ్‌ను బ్యాంక్ నిఫ్టీ నిర్దేశించవచ్చు. 10,700 పాయింట్ల సమీపంలో స్పాట్ బ్యాంక్ నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఆర్బీఐ పాలసీ సందర్భంగా ఈ మద్దతును పరిరక్షించుకుంటే 11,200-11,350 శ్రేణివరకూ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ జరపవచ్చు. ఈ కీలక నిరోధశ్రేణిని దాటితే కొద్దివారాల్లో 13,000 పాయింట్ల స్థాయివరకూ కూడా పెరిగే అవకాశాలుంటారు. 10,700 మద్దతుస్థాయిని కోల్పోతే 10,300 పాయింట్ల స్థాయికి వెనువెంటనే పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయి దిగువన స్థిరపడితే బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుత అప్‌ట్రెండ్ ముగిసినట్లేనని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నారు. - పి. సత్యప్రసాద్ -
సెన్సెక్స్ నిరోధం 20,200
మార్కెట్ పంచాంగం అమెరికా షట్‌డౌన్ వార్తతో ఆ దేశపు స్టాక్ సూచీలతో సహా ప్రపంచ మార్కెట్లేవీ చలించకపోగా, స్వల్పంగా ర్యాలీ జరిపారుు. ఈ షట్‌డౌన్ తాత్కాలికమేనన్న అంచనాలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు అవ్ముకాలకు పాల్పడలేదని, పైగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీ ఉపసంహరణ ప్రక్రియు వురింత జాప్యం కావచ్చన్న అంచనాలతో భారత్ వంటి మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అదనపు నిధులు తరలివచ్చాయున్న విశ్లేషణలు విన్పిస్తున్నారుు. కానీ ఏదైనా ఒక అనుకూల, లేదా ప్రతికూల వార్త వెలువడినపుడు, దాని ప్రభావాన్ని వెంటనే మార్కెట్ డిస్కౌంట్ చేసుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇందువల్ల వచ్చే కొద్దిరోజుల్లో స్టాక్ సూచీలు పెద్ద కుదుపునకు లోనయ్యే ప్రవూదం లేకపోలేదు. సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు గత వూర్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రీతిలోనే అక్టోబర్ 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో 19,390 పారుుంట్ల సమీపంలో వుద్దతు పొందిన బీఎస్ఈ సెన్సెక్స్ 20,052 పారుుంట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 189 పాయింట్ల లాభంతో 19,916 పాయింట్ల వద్ద ముగిసింది. 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖ వుద్దతుతో సెన్సెక్స్ పెరిగినా, కీలకమైన 20,200 నిరోధస్థారుుని అధిగమించలేకపోరుుంది. సమీప భవిష్యత్తులో అధిక ట్రేడింగ్ టర్నోవర్‌తో ఈ స్థారుుని దాటగలిగితేనే, తిరిగి అప్ట్రెండ్లోకి వూర్కెట్ ప్రవేశించే వీలుంటుంది. ఈ సోవువారం గ్యాప్‌అప్‌తో సెన్సెక్స్ మొదలైతే తొలి అవరోధం 20,080 స్థారుు వద్ద ఏర్పడవచ్చు. ఈ స్థారుుని దాటితే 20,200 నిరోధస్థారుుకి చేరవచ్చు. 20,200పైన వుుగింపు సెన్సెక్స్‌ను క్రమేపీ 20,740 పారుుంట్ల వద్దకు చేర్చవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 19,650 పారుుంట్ల సమీపంలో తక్షణ వుద్దతు లభిస్తున్నది. ఈ స్థారుుని కోల్పోతే వురోదఫా 19,400 పారుుంట్ల స్థారుుని పరీక్షించవచ్చు. ఈ స్థారుుని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత కరెక్షన్, డౌన్‌ట్రెండ్‌గా రూపాంతరం చెందే ప్రమాదం వుంటుంది. గత రెండు వారాల్లో జరిగిన హెచ్చుతగ్గుల సందర్భంగా ట్రేడింగ్ పరిమాణం తక్కువగా వున్నందున, వూర్కెట్ను భారీగా కదల్చగల ఒక వార్త వెలువడేవరకూ సెన్సెక్స్ 19,400-20,200 శ్రేణికే పరిమితవుయ్యే అవకాశాలున్నారుు. ఈ వారం నాటకీయుంగా 19,400 వుద్దతు స్థారుుని సెన్సెక్స్ కోల్పోతే 18,900 పారుుంట్ల వరకూ పతనవుయ్యే ప్రవూదం వుంటుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నారుు. నిఫ్టీ అవరోధం 5,990 అక్టోబర్ 4తో ముగిసిన వారం ప్రథవూర్థంలో 5,700 పాయింట్ల కనిష్టస్థారుుకి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ, ఆ స్థారుు వద్ద లభించిన వుద్దతుతో 5,950 పారుుంట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 74 పాయింట్లు లాభపడి 5,907 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ 200 డీఎంఏ రేఖకు (5,840) అటూఇటూగా తక్కువ ట్రేడింగ్ పరివూణంతో హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున, సమీప భవిష్యత్తులో ఈ రేఖకు ప్రాధాన్యత తగ్గిందని భావించవచ్చు. ఈ వారం గ్యాప్‌అప్‌తో నిఫ్టీ మొదలైతే 5,950 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావొచ్చు. ఆపైన వుుగిస్తే వురో కీలకమైన అవరోధస్థారుు 5,990 పారుుంట్ల వద్దకు పెరగవచ్చు. ఈ స్థారుుని అధిక ట్రేడింగ్ టర్నోవర్‌తో అధిగమిస్తే తిరిగి 6,142 పారుుంట్ల స్థారుుకి పెరిగే ఛాన్స్ వుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 5,860 పారుుంట్ల వద్ద తక్షణ వుద్దతు లభిస్తున్నది. ఈ లోపున వుుగిస్తే వుళ్లీ 5,688-5,738 వుద్దతు శ్రేణికి (ఇది సెప్టెంబర్ 10 నాటి అప్‌వర్డ్ ట్రేడింగ్ గ్యాప్) తగ్గవచ్చు. ఈ వుద్దతుశ్రేణిని భారీ ట్రేడింగ్ పరివూణంతో నష్టపోతే నిఫ్టీ వేగంగా 5,630 పారుుంట్ల వద్దకు (ఆగస్టు 28 నాటి 5,119 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి సెప్టెంబర్ 19 నాటి 6,242 పాయింట్ల గరిష్టస్థాయివరకూ జరిగిన 1.023 పాయింట్ల ర్యాలీలో ఇది 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) పతనవుయ్యే ప్రవూదం వుంటుంది. - పి. సత్యప్రసాద్