మార్కెట్ పంచాంగం
అరుణ్‌జైట్లీ బడ్జెట్ కార్పొరేట్లను, విదేశీ ఇన్వెస్టర్లను సంతృప్తిపర్చడంతో ఐటీ, ఫార్మా షేర్ల సహకారంతో నెమ్మదిగా పెరుగుతున్న మార్కెట్లో రిజర్వుబ్యాంక్ చర్య మార్పుతెచ్చింది. ఆర్‌బీఐ హఠాత్తుగా రేట్లు తగ్గించిన ప్రభావంతో ఒక్కసారిగా బ్యాంకింగ్ షేర్లు ఎగిసిపోయాయి. ఆ పెరుగుదల లాభాల స్వీకరణకు అవకాశం కల్పించడంతో రేట్ల తగ్గింపు రోజున సూచీలు గరిష్టస్థాయి నుంచి పడిపోయాయి. కానీ ఇదే సమయంలో కొన్ని ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కొత్త రికార్డుల్ని సృష్టించినందున, ప్రధాన సూచీల్లో పెద్ద కరక్షన్ జరిగే అవకాశాలు తక్కువ.
కొద్దిరోజులపాటు ఒక శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 28తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,000 శిఖరాన్ని తాకిన వెనువెంటనే లాభాల స్వీకరణతో వేగంగా ఆ శిఖరం నుంచి జారిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 88 పాయింట్ల లాభంతో 29,449 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 30,100 పాయింట్ల లక్ష్యాన్ని సెన్సెక్స్ దాదాపు చేరినందున, వెనువెంటనే తిరిగి 30,000 పాయింట్ల స్థాయిని అధిగమించి, స్థిరపడలేకపోతే రానున్న వారాల్లో 28,880-28,690 పాయింట్ల మద్దతు శ్రేణి వరకూ కరక్షన్ జరిగే అవకాశం వుంది. శుక్రవారం అమెరికా మార్కెట్ల పతనం కావడంతో సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 29,160 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు పొందవచ్చు.
ఈ మద్దతు లోపున ముగిస్తే స్వల్పకాలిక దిద్దుబాటు జరగవచ్చు. ఆ లోపున 28,970 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 28,880-28,690 పాయింట్ల మద్దతు శ్రేణి కీలకం. అప్‌ట్రెండ్ కొనసాగితే ఈ వారం తొలుత 29,700 స్థాయి సూచీకి అవరోధం కల్పించవచ్చు. ఆటుపైన 29,980 స్థాయికి చేరవచ్చు. సమీప భవిష్యత్తులో 30,025 స్థాయిని దాటి, స్థిరపడితే క్రమేపీ 30,200 స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ శ్రేణి దిగువన ముగిస్తే మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లవచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 8,850
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,119 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయికి చేరిన తర్వాత వేగంగా సర్దుబాటుకు లోనుకావడంతో 8,938 పాయింట్ల వద్ద ముగి సింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 36 పాయింట్ల స్వల్పలాభాన్ని సంపాదించింది. వచ్చేవారం నిఫ్టీ తొలి నిరోధస్థాయిని దాటలేకపోతే 8,850 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే 8,750 స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే తిరిగి 8,670 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 9,020 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం ఎదురుకావొచ్చు. అటుపైన స్థిరపడితే 9,080 స్థాయికి పెరగవచ్చు. రానున్న రోజుల్లో 9,120 పాయింట్ల రికార్డును అధిగమించగలిగితే క్రమేపీ కొద్ది వారాల్లో 9,250 స్థాయికి ర్యాలీ జరిపే చాన్స్ వుంది. రానున్న రోజుల్లో నిఫ్టీ ఈ స్థాయి దిగువన ముగిస్తే, మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తే ప్రమాదం ఉంటుంది.
సెన్సెక్స్ మద్దతు 29,160
Published Mon, Mar 9 2015 1:02 AM | Last Updated on Mon, Aug 20 2018 5:16 PM
Advertisement
Advertisement