మార్కెట్ పంచాంగం
అమెరికా, చైనాలతో సహా ప్రపంచ మార్కెట్ల సూచీలు స్థిరంగా ట్రేడ్‌కావడంతో భారత్ ఈక్విటీలు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే ఆగస్టు పతన సమయంలో స్థిరంగా నిలిచిన ఐటీ, ఫార్మా షేర్లు ప్రస్తుతం క్షీణబాట పట్టగా, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు రోజు నుంచి పరిమితశ్రేణిలో కదులుతున్న బ్యాంకింగ్ షేర్లు తొలిసారిగా గత శుక్రవారం పైకి కదిలాయి. ఆగస్టులో భారీగా పతనమైన కమోడిటీ షేర్లపై ముందుగా దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు, అటు తర్వాత బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లకు ఉపక్రమించినట్లు ఈ ట్రెండ్ సూచిస్తున్నది. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
అక్టోబర్ 16తో ముగిసిన వారంలో 26,700 పాయింట్ల సమీపంలో మద్దతు పొందిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,239 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు 135 పాయింట్ల లాభంతో 27,215 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 30,025 పాయింట్ల నుంచి సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ జరిగిన 5,192 పాయింట్ల నష్టంలో 38.2 శాతం ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్‌మెంట్ ర్యాలీలో పూడ్చుకోగలిగింది.
ఈ వారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే 150 డీఎంఏ అయిన 27,360 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 27,429 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 200 డీఎంఏ అయిన 27,675 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం హఠాత్తుగా క్షీణత మొదలైతే వెనువెంటనే 26,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున తిరిగి 26,700 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ దిగువన 26,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 8,145
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాం గంలో సూచించిన రీతిలో 8,090 పాయిం ట్ల సమీపంలో మద్దతు పొంది, క్రమేపీ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 48 పాయింట్ల స్వల్పలాభంతో 8,238వద్ద ముగిసింది. ఆగస్టు 24 నాటి గ్యాప్‌డౌన్ సందర్భంగా ఏర్పడిన అప్పర్ బౌండరీ 8,230 పాయింట్లపైన ముగియడం సాంకేతికంగా సానుకూలాంశం. సమీప భవిష్యత్తులో ఈ స్థాయిపైన స్థిరపడితే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది.
ఈ స్థాయిపైన 150 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 8,290 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపైన క్రమేపీ కీలకమైన 200 డీఎంఏ స్థాయి అయిన 8,380 స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం 8,230 స్థాయిపైన నిలదొక్కుకోలేకపోతే 8,145 వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే గతవారపు కనిష్టస్థాయి అయిన 8,090 స్థాయిని చేరవచ్చు. ఈ దిగువన క్రమేపీ 8,005 స్థాయికి క్షీణించవచ్చు.
సెన్సెక్స్ తక్షణ మద్దతు 26,900
Published Mon, Oct 19 2015 1:03 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement