సూచీ కే గెలుపు అవకాశాలు
మయన్మార్ ఎన్నికల ర్యాలీకి తరలివస్తున్న జనం
యాంగాన్: దశాబ్దాల తరబడి సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 8న జరిగే ఈ ఎన్నికల్లో విపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విజయపథంలో దూసుకుపోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆదివారం యాంగాన్‌లో సూకీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి వేలాది ప్రజలు తరలి వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవటానికి కొందరు దొంగదారులు వెతుకుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో సంయమనంతో పాల్గొనాలని ఓటర్లను కోరారు.
అయితే సైనిక మద్దతు ఉన్న యునెటైడ్ సాలిడారిటీ-డెవలప్‌మెంట్ పార్టీ(యూఎన్‌డీపీ)కూడా సూచీ పార్టీతో హోరాహోరీగా తలపడుతోంది. యూఎన్‌డీపీ గెలిస్తే దేశంలోని తమకు మళ్లీ కష్టాలు తప్పవని మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎన్నికలు వీరిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సైనిక పాలన నుంచి విముక్తి లభిస్తుందని వారు ఆశతో ఉన్నారు.