కాబూల్: ఆఫ్గనిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. గురువారం కాబూల్లో పోలీసుల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నట్లు ఆప్గన్ మీడియా వెల్లడించింది. పోలీసులు తమ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడినట్లు భద్రతా అధికారులు
తెలిపారు. మొదటి పేలుడు ఖలా-ఈ-హైదర్ ఖాన్ గ్రామ సమీపంలో జరిగిందని, అనంతరం మరో పేలుడు సంబంధించినట్లు పేర్కొన్నారు. పది రోజుల క్రితం ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఉగ్రవాదులు పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 14 మంది మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. కాగా గత ఏప్రిల్ నెలలోనే కాబూల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 64 మంది మృతి చెందారు.
కాబూల్లో తాలిబన్ల దాడి, 40మంది మృతి
Published Thu, Jun 30 2016 3:58 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement