
దుష్ప్రచారంపై సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా దుష్ప్రచారం చేస్తుండడం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రచారం ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోథా అన్నారు.
సమాజంలో భాగమే న్యాయవ్యవస్థపై జరుగుతుస్తున్న దుష్ప్రచారం అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కొలీజయం ఎంపిక చేసిన న్యాయమూర్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఉంచాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.