Justice RM Lodha
-
‘గడువు తేదీని పొడిగించండి’
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై నివేదిక సమర్పించాలనే గడువును మార్చి 27 వరకు పొడిగించాలని బీసీసీఐ నూతన పరిపాలక కమిటీ (సీఓఏ)కి రాష్ట్ర క్రికెట్ సంఘాలు అభ్యర్థించాయి. మార్చి 1 వరకు నివేదిక ఇవ్వాలని ఆయా క్రికెట్ సంఘాలకు ఫిబ్రవరి 23న సీఓఏ లేఖలు రాసింది. ఈ విషయంలో మరింత స్పష్టత అవసరమని అనర్హతకు గురైన 20 రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెందిన సభ్యులు వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏకు లేఖ రాశారు. అలాగే బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆగాలని కోరారు. రాష్ట్ర క్రికెట్, బీసీసీఐలో కలిపి పదవీ కాలం 9 ఏళ్లా లేక 18 ఏళ్లా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. -
సంస్కరణలపై ఏం చేద్దాం?
నేడు బీసీసీఐ ఎస్జీఎం ఠాకూర్ అఫిడవిట్‌పై చర్చ న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా సంస్కరణల అమలు విషయంలో బీసీసీఐ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో నేడు (శనివారం) బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) అత్యంత కీలకంగా మారింది. నిజానికి ఈనెల 7నే కోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నా 17కు వారుుదా పడడంతో బోర్డు కాస్త ఊపిరి పీల్చుకుంది. అరుుతే ఆలోపునే బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్‌ను అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఎస్‌జీఎంలో ఇదే ప్రధాన చర్చ కానుంది. లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేస్తే ప్రభుత్వ జోక్యంగా పరిగణిస్తూ, బీసీసీఐని నిషేధిస్తామంటూ లేఖ రాయాలని అనురాగ్ ఠాకూర్ ఐసీసీకి గతంలో లేఖ రాశారు. ఈ విషయంలో కోర్టు సీరియస్ అరుు వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల్లో ఒక రాష్ట్రం.. ఒక ఓటు, మూడేళ్ల కూలింగ్ పీరియడ్ వంటి అంశాలు బోర్డుకు ఏమాత్రం రుచించడం లేదు. వీటిని ఆయా రాష్ట్ర సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారుు. సోమవారం కోర్టు తీర్పు వెలువరించనున్న దృష్ట్యా ప్రతిపాదనలపై బోర్డుకు ఇవే చివరి చర్చలుగా మారారుు. ‘ఒక రాష్ట్రం.. ఒక ఓటు నిబంధనకు మేం వ్యతిరేకం కాదు. అరుుతే ఓట్ల సంఖ్యను ఎందుకు పెంచకూడదనే మేం అడగదల్చుకున్నాం. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్నారుు. ఇదే సమయంలో ముంబై, సౌరాష్ట్ర ఎందుకు తమ ఓటును కోల్పోవాలి?’ అని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అధికారి ఒకరు ప్రశ్నించారు. అలాగే మూడేళ్ల పదవీ కాలానికి మూడేళ్ల కూలింగ్ పీరియడ్ కూడా సభ్యులకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎక్కువ మంది దీన్ని ఆరేళ్ల పాటు రెండు పర్యాయాలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా ఇప్పటికే విదర్భ, త్రిపుర రాష్ట్ర సంఘాలు బేషరతుగా లోధా సంస్కరణల అమలుకు ముందుకువచ్చారుు. -
అమలు చేస్తారా? తప్పించమంటారా?
-
అమలు చేస్తారా? తప్పించమంటారా?
లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిందే లేదంటే బోర్డులో అందరినీ మార్చేస్తాం బీసీసీఐకి నేటి వరకు గడువు నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా ప్రతిపాదనల అమలులో జాప్యం చేస్తున్న బీసీసీఐపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర స్థారుులో విరుచుకుపడింది. ‘సంస్కరణలను అమలు చేస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా?’ అంటూ ప్రశ్నించింది. బేషరతుగా అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనంటూ బోర్డుకు నేటి (శుక్రవారం) వరకు గడువునిచ్చింది. ఎటూ తేల్చుకోకుంటే తామే తుది తీర్పునిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ వైఖరేమిటో కనుక్కోవాలని వారి కౌన్సిల్ కపిల్ సిబల్‌ను కోర్టు అడిగింది. అరుుతే వీటి అమలు కోసం ఆయన మరికొంత సమయం గడువు కోరినా కోర్టు తిరస్కరించింది. ‘అసలేం కావాలి మీకు? ప్రతిపాదనలు ఆమోదిస్తామని రేపటి కల్లా(శుక్రవారం) లిఖితపూర్వకంగా సమాధానమివ్వండి. లేకపోతే మేమే తుది తీర్పు ఇచ్చేస్తాం’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా హెచ్చరించారు. బీసీసీఐ నిర్లక్ష్య వైఖరిపై గత వారం లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై గురువారం కోర్టులో ఈ విచారణ జరిగింది. అందరినీ తొలగిస్తాం.. బోర్డు ప్రక్షాళన కోసం లోధా కమిటీ ప్రతిపాదనల్లో కొన్నింటిని బీసీసీఐకి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అందుకే తమ అభ్యంతరాలపై కోర్టులో మరోసారి వాదనలను వినిపించింది. అరుుతే అసలుకే మోసం వచ్చేలా పరిస్థితి మారింది. ఎట్టిపరిస్థితిల్లోనూ సంస్కరణలను నూటికి నూరు శాతం అమలు చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గాన్ని, అధికారులందరినీ మార్చి బోర్డు నిర్వహణకు కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కానీ తమిళనాడు సొసైటీల చట్టం ప్రకారం బీసీసీఐ నమోదైందని, దీని ప్రకారం వీటిని అమలు చేయాలంటే అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుందని సిబల్ వాదించారు. దీనికి జస్టిస్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ‘అసలు అన్ని సంఘాలను బీసీసీఐయే నడిపిస్తోంది. అదే ఇప్పుడు లోధా ప్రతిపాదనలకు అడ్డంకులను సృష్టిస్తోంది. వ్యతిరేకించే సంఘాలకు ఆర్థిక సహాయాన్ని నిలిపేయండి లేదా నిషేధించండి. అంతేకానీ మా సమయాన్ని వృథా చేయకండి. మెజారిటీయే అవసరమని మీరు భావిస్తే అమలు కోసం మేం ఆదేశాలు జారీ చేస్తాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనూ కెప్టెన్‌నే... బీసీసీఐ ఆఫీస్ బేరర్ల అర్హత గురించి వచ్చిన చర్చ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ క్రికెటర్ అరుుతే తాను కూడా క్రికెటర్‌నే అన్నారు. ‘బోర్డుకు ఎన్నికయ్యే ఆఫీస్ బేరర్లకు ఏమైనా ప్రత్యేక అర్హత ఉండాలా? బీసీసీఐ అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కదా?’ అని కపిల్ సిబల్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అరుుతే అనురాగ్ ఠాకూర్ సీరియస్ క్రికెటర్ అని కపిల్ రెట్టించి చెప్పడంతో తానూ సుప్రీం కోర్టు జడ్జిల జట్టుకు కెప్టెన్‌నే అని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. -
అవన్నీ తప్పుడు కేటాయింపులే!
-
కోల్గేట్ పై సుప్రీంకోర్టు
-
కేటాయింపులన్నీ రద్దు
‘కోల్గేట్’పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం 1993 నుంచి కేటాయించిన 218 బ్లాకుల్లో 214 రద్దు న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఇరవయ్యేళ్లలో కేటాయించిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 4 బ్లాకులకు మినహాయింపు ఇచ్చింది. రద్దు చేసిన బ్లాకుల్లో పనిని నిలిపేసి.. ప్రభుత్వానికి అప్పగించేందుకు మైనింగ్ సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 163 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఆయా బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్రం తిరిగి వేలం నిర్వహించేందుకు అవకాశం లభించనుంది. ‘కోల్’గేట్ దుమారం: యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విష యం తెలిసిందే. ‘కోల్గేట్’ స్కామ్‌గా పేరు పొందిన ఈ వ్యవహారంలో.. ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం గద్దెదిగాలంటూ విపక్షాలు కొద్దిరోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేశాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు విస్తృత దర్యాప్తునకు ఆదేశించి, విచారణ చేపట్టింది. రద్దు చేయవద్దన్న యూపీఏ: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయవద్దని అప్పట్లో జరిగిన విచారణ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ బ్లాకులను పొందిన సంస్థలు వాటిల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాయని.. దీంతోపాటు ఈ కేటాయింపులను రద్దు చేస్తే పెద్ద సంఖ్యలో పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందని వాదించింది. కానీ ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. అసలు ఆ బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం... బొగ్గు కేటాయింపులను రద్దు చేయడం వల్ల నెలకొంటాయని భావిస్తున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది. అన్నీ చట్ట విరుద్ధమే..: ‘కోల్’గేట్ కుంభకోణం విచారణలో భాగంగా 1993 నుంచి 2010 వరకూ కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు చేసిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఇష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినవారికి బొగ్గు కేటాయింపులు చేశారని.. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. పారదర్శకత ఏ మాత్రం లేని విధానం వల్ల జాతీయ సంపద అయిన బొగ్గు అక్రమ కేటాయింపులకు కారణమైందని ధర్మాసనం పేర్కొంది. అసలు స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడూ నిలకడగా లేదని.. సరైన విధానమేదీ లేకుండానే, నిబంధనలను పాటించకుండానే ప్రతిపాదనలు చేసిందంటూ ధర్మాసనం తప్పుబట్టింది. నాలుగింటికే మినహాయింపు..: 1993 నుంచి చేసిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపులో.. ఎన్టీపీసీ, సెయిల్లకు కేటాయించిన ఒక్కో బ్లాకు, అల్ట్రామెగా పవర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కేటాయించిన 2 బ్లాకులు మాత్రమే సుప్రీంకోర్టు మినహాయింపును ఇచ్చింది. మిగతా 214 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. ఈ బ్లాకులు పొందిన సంస్థలన్నీ కూడా.. ఆయా చోట్ల తమ వ్యాపారాన్ని ముగించి, బ్లాకులను ప్రభుత్వానికి అప్పగించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వానికి పరిహారం చెల్లించండి: కొన్ని సంస్థలు బొగ్గు కేటాయింపులు పొంది ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ధర్మాసనం పేర్కొంది. దీని పై కాగ్ సూచించిన మేరకు ఆయా సంస్థలు బొగ్గు వెలికితీత అంచనాపై ఒక్కో టన్నుకు రూ. 295 చొప్పు న ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం! న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... భవిష్యత్తులో బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన అంశంపై సంబంధిత భాగస్వాములు (బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన సంస్థల) అందరి ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఆరునెలల పాటు గడువు ఇచ్చిందని.. ఈ లోగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హర్షణీయమని.. ఇది సరికొత్త విధానానికి తోడ్పడుతుందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ బీజేపీ చేసిన ఆరోపణల్లోని డొల్లతనం సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ‘కోల్’ వివాదమిదీ..! ► 1992 జూలై: ప్రైవేటు సంస్థలకు తొలుత వచ్చి న వారికి తొలుత ప్రాతిపదికన బొగ్గు గనుల కేటాయింపు ప్రతిపాదనల కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుకు బొగ్గు శాఖ ఆదేశాలు. ► 1992 జూలై 14: కోల్ ఇండియా, సింగరేణి సంస్థల ప్రణాళికల్లో లేని 143 కొత్త బొగ్గు బ్లాకుల గుర్తింపు, జాబితా తయారీ. ► 1993 -2010: దాదాపు 1993 నుంచి 2005 మధ్య 70 బొగ్గు బ్లాకులు, 2006లో 53, 2007లో 52, 2008లో 24, 2009లో 16, 2010లో 1.. మొత్తంగా 216 బొగ్గు బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించారు. వీటిలో 24 బ్లాకుల కేటాయింపును మధ్యలో రద్దు చేశారు. ► 2012 మార్చి: బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్ వెల్లడించింది. 2004-09 మధ్య దాదాపు రూ.10.7 లక్షల కోట్ల లబ్ధి ఆయా సంస్థలకు చేకూరిందని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. ► 2012 మే 31: ఇద్దరు బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఆధారంగా ఈ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఆదేశించింది. ► 2012 జూన్: ఈ అంశంపై సమీక్షకు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు 80 బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని, 42 సంస్థలకు చెందిన బ్యాంకు గ్యారెంటీలను స్వాధీనం చేసుకుంది. ► 2012 సెప్టెంబర్ 6: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిల్ . సీబీఐ దర్యాప్తును పర్యవేక్షణలోకి తీసుకున్న కోర్టు. ► 2013 మార్చి: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి అందజేయొద్దని సీబీఐకి ఆదేశం. ► 2013 ఏప్రిల్ 23: ఈ అంశంపై ఏర్పాటు చేసిన స్థాయీ సంఘం నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం. 1993-2008 మధ్య కేటాయింపులన్నీ అసంబద్ధమేనని అందులో వెల్లడి. ► 2013 ఏప్రిల్ 26: దర్యాప్తు అంశాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌కు అందజేసినట్లు కోర్టుకు సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా వెల్లడి ► 2013 మే 10: అశ్వనీకుమార్ రాజీనామా ► 2013 జూన్ 11: ‘బొగ్గు’ కేసులో పారిశ్రామిక వేత్తలు నవీన్ జిందాల్, దాసరి నారాయణరావు పేర్లను పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్. ► 2014 జూలై: ‘బొగ్గు’ కేసులన్నింటి విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు. ► 2014 ఆగస్ట్: బిర్లా, పరేఖ్‌లపై కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయం ► 2014 ఆగస్ట్ 25: 1993 నుంచి 2010 మధ్య కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని తేల్చిన సుప్రీంకోర్టు. ► 2014 సెప్టెంబర్ 24: 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు. -
దుష్ప్రచారంపై సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా దుష్ప్రచారం చేస్తుండడం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రచారం ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోథా అన్నారు. సమాజంలో భాగమే న్యాయవ్యవస్థపై జరుగుతుస్తున్న దుష్ప్రచారం అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కొలీజయం ఎంపిక చేసిన న్యాయమూర్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఉంచాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. -
స్వయంకృత వివాదం!
సున్నితమైన అంశాలతో వ్యవహరించేటపుడు తొట్రుపాటు ప్రదర్శిస్తే అది వికటించకమానదు. నెలరోజులక్రితం అధికారంలోకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నిటా ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టే కనిపించింది. అందుకు ప్రశంసలూ అందుకుంది. కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో తోవ తప్పి తల బొప్పికట్టించుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోధా... ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని బహిరంగంగా ఆరోపించే స్థితి ఏర్పడింది. మన దేశంలో న్యాయమూర్తుల నియామకాలను న్యాయమూర్తులే సభ్యులుగా ఉండే కొలీజియం వ్యవస్థ చూస్తుంది. ఇందులో పారదర్శకత కాస్తయినా లేదన్న విమర్శలున్నాయి. ఎవరిని ఎందుకు న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తున్నారో లేదా నిరాకరిస్తున్నారో తెలియడంలేదన్నది ప్రధానమైన ఫిర్యాదు. ఈ కొలీజియం వ్యవస్థను ఒక తీర్పు ద్వారా అమల్లోకి తెచ్చిన జస్టిస్ జేఎస్ వర్మ సైతం తాను అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటని ఒక దశలో వ్యాఖ్యానించారు. సరే...యూపీఏ సర్కారు రెండో విడత అధికారంలోకొచ్చాక న్యాయ వ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లును రూపొందించింది. అందులో న్యాయమూర్తుల నియామకం, తొలగింపు వగైరా అంశాలు కూడా ఉన్నాయి. ఆ బిల్లుకు ఎన్డీఏ సర్కారు ఏయే మార్పులు తలపెట్టిందో, దాన్ని పార్లమెంటు ముందుకు ఎప్పుడు తీసుకురాదల్చుకున్నదో ఇంకా తెలియాల్సి ఉంది. ఈలోగానే కొలీజియం సిఫార్సు చేసిన మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం విషయంలో సంప్రదాయానికి భిన్నంగా పోయి వివాదాన్ని కొనితెచ్చుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవులకు నలుగురిని ఎంపిక చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. వీరిలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులుకాగా మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు రోహింటన్ నారిమన్, గోపాల్ సుబ్రహ్మణ్యం. న్యాయకోవిదులుగా సుప్రసిద్ధులైనవారిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నేరుగా నియమించే సంప్రదాయం గతంలో ఉన్నా దాదాపు మూడు దశాబ్దాలుగా దాన్ని పాటించడంలేదు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు న్యాయమూర్తులకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులిస్తున్నారు. కొలీజియం పరిశీలించిన నారిమన్, సుబ్రహ్మణ్యంలిద్దరూ సొలిసిటర్ జనరల్స్‌గా పనిచేయడమే కాక సంచలనం కలిగించిన 2జీ స్పెక్ట్రమ్ కేసు మొదలుకొని ఎన్నో కేసుల్లో వాదించినవారు. వ్యక్తిగత ప్రవర్తన విషయంలోనైనా, వృత్తిపరమైన అంశాల్లోనైనా వారి విశ్వసనీయత తిరుగులేనిది. అయితే, చిత్రంగా ఎన్డీయే ప్రభుత్వం గోపాల్ సుబ్రహ్మణ్యాన్ని మినహాయించి మిగిలినవారి నియామకాలకు సంబంధించిన కొలీజియం సిఫార్సుకు ఆమోద ముద్ర వేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తన అభిప్రాయాలను లేదా అభ్యంతరాలనూ తెలియజెబుతూ సంబంధిత ఫైళ్లను కొలీజియంకు కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపుతుంది. అటుతర్వాత దానిపై కొలీజియం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అనుసరిస్తున్న నిబంధనల ప్రకారమైతే ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరుచేసి తమ ఎంపికలను ఖరారుచేసుకునే వెసులుబాటు కొలీజియంకు ఉంది. కానీ, గోపాల్ సుబ్రహ్మణ్యం విషయంలో జరిగింది వేరు. ఆయన నియామకంపై మోడీ ప్రభుత్వానికి అభ్యంతరం ఉన్నదని తొలుత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినందువల్ల... సీబీఐ, ఐబీ నివేదికలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సుబ్రహ్మణ్యం తగరని ప్రభుత్వం భావిస్తున్నదని ఆ కథనాలు వివరించాయి. దీనికితోడు ఇందులో మరో అసాధారణ అంశం చోటుచేసుకుంది. నలుగురికి సంబంధించిన జాబితాను పంపినప్పుడు నలుగురిపైనా కేంద్రం తన అభిప్రాయాలను రాసిపంపాలి. గతంలో ఒకరిద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో ఇలాగే జరిగింది. కానీ, ఎన్డీయే సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిం చింది. జాబితానుంచి గోపాల్ సుబ్రహ్మణ్యాన్ని మినహాయించింది. ఆ రకంగా కొలీజియంకున్న అధికారాలకు పరిమితులు విధించింది. ప్రభుత్వ అభ్యంతరాలను అవసరమైతే తోసిరాజని తుది నిర్ణయం తీసుకోవడానికి దానికున్న హక్కును బేఖాతరుచేసింది. కొలీజియం వ్యవస్థ సరిగా లేదని కేంద్రం భావిస్తే దానికి తగిన ప్రత్యామ్నాయాన్ని వెదకడం తప్పేమీ కాదు. అందుకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉన్నది కూడా. కానీ, ఈలోగా తీసుకునే నిర్ణయాలన్నీ అమల్లో ఉన్న విధానానికి అనుగుణంగానే ఉండాలి. నిర్ణయ ప్రక్రియ చుట్టూ ఊహాగానాలు అల్లుకొనడానికి అవకాశమివ్వడం, వ్యక్తుల ప్రతిష్ట మసకబారే స్థితి కల్పించడం మంచిదికాదు. ఇప్పుడు జరిగింది అదే. గోపాల్ సుబ్రహ్మణ్యం మనస్తాపం చెంది, న్యాయమూర్తిగా ఎంపికయ్యేందుకు వెలిబుచ్చిన సంసిద్ధతను రద్దుచేసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఊరుకోక న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటున్నా మౌనంగా మిగిలిపోయినందుకు సుప్రీంకోర్టును సైతం తూర్పారబట్టారు. జస్టిస్ లోధా రిటైరయ్యేవరకూ ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు. బహుశా అందువల్లే కావొచ్చు...జస్టిస్ లోధా ఈ విషయంలో ఏం జరిగిందో, తన వైఖరేమిటో బహిరంగపరచవలసి వచ్చింది. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయని, న్యాయవ్యవస్థపై తమకు అత్యంత గౌరవభావం ఉన్నదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇస్తున్న ముక్తసరి సంజాయిషీకి విలువ లేదు. అలాంటి గౌరవం ఉన్నదని మాటల్లో చెప్పడమే కాదు...చేతలు కూడా అందుకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత. -
లోక్‌పాల్‌పై నిర్ణయం తీసుకోవట్లేదు
సుప్రీం కోర్టుకు కేంద్ర సర్కారు హామీ న్యూఢిల్లీ: లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యుల నియామకంపై తక్షణ నిర్ణయం తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై నిర్ణయం ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయనున్నట్లు చూచాయగా చెప్పింది. దీంతో లోక్‌పాల్ నియామకంపై స్టే కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతనగల ధర్మాసనం మే 5కు వాయిదా వేస్తూ ఆదేశాలు వెలువరించింది. ఈ అంశంలో కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన తాజా వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం విచారించింది. లోక్‌పాల్ చట్టం కింద రూపొందించిన నిబంధనల చెల్లుబాటును కోర్టు ప్రశ్నించినప్పటికీ... ప్రభుత్వం ముందుకే వెళుతోందని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత నిబంధనల కింద చేపడుతున్న పూర్తి నియామక ప్రక్రియను చట్టవిరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ తరపున న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశన్ ధర్మాసనం ముందు హాజరై... లోక్‌పాల్ నియామకంపై సర్కారు నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. దీంతో మే5 వరకు లోక్‌పాల్ నియామకంపై నిర్ణయం తీసుకోబోమంటూ సర్కారు హామీ ఇచ్చినందున మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. లోగడ ఏప్రిల్ 1న విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు... లోక్‌పాల్, లోకాయక్త-2014 చట్టం కింద రూపొందించిన సెర్చ్ కమిటీ నిబంధనలను నాలుగు వారాల్లోగా సరిదిద్దాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.