కోకాకోలా ప్లాంటుకు భూకేటాయింపు రద్దు
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కోకా-కోలా ప్లాంటుకు గతంలో చేసిన 71.34 ఎకరాల భూమి కేటాయింపును ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. స్థానికులు, రైతులు, రాజకీయ పార్టీల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో ఆ భూమిని వెనక్కి తీసుకుంది. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను కంపెనీ పాటించలేదన్న కారణాన్ని ఈ రద్దు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
కొన్ని రోజుల క్రితమే కోకా-కోలా కంపెనీకి నోటీసు ఇచ్చినట్లు సిప్కాట్ పేర్కొంది. ఇంతవరకు ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదని కంపెనీని ప్రశ్నించగా, మొదట్లో తాము ఫీజిబులిటీ పరీక్షలు చేయలేదని, కానీ ఇప్పుడు చూస్తే అది అంత లాభదాయకం కాదన్నట్లు తెలుస్తోందని కంపెనీ చెప్పిందంటున్నారు.