coca cola plant
-
కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేత
ప్రముఖ కూల్‌డ్రింక్ కంపెనీ కోక-కోలా..తన అనుబంధ సంస్థ బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ (బిగ్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ), అంతర్జాతీయ బాట్లింగ్ కార్యకలాపాలను బిగ్ నిర్వహిస్తోంది. జూన్ 30 నుంచి బిగ్ కార్యకాలాపాలను నిలిపేస్తున్నట్లు కోక-కోలా తెలిపింది.ఇప్పటివరకు బిగ్ చేపడుతున్న వ్యవహారాలు కోక కోలా అంతర్గత బోర్డు నియంత్రణలోకి వస్తాయని సంస్థ చెప్పింది. భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలు ఈ బోర్డు నిర్వహిస్తుందని తెలిపింది. బాట్లింగ్‌లో వాటాలను తగ్గించుకుని, బ్రాండ్, ఉత్పత్తులపై కోక కోలా దృష్టిపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 1997లో ప్రారంభమైన హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్‌కు ఇండియాలో 16 ప్లాంట్లు ఉన్నాయి. 3500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 25 లక్షల మంది రిటైలర్లకు కూల్‌డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్లాంట్లలో వాటాలను స్వతంత్ర సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.2,420 కోట్లను సంస్థ సమీకరించింది. గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్లాంట్ కోసం రూ.1387 కోట్లు, గుజరాత్లో రూ.3000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది మేలో వెల్లడించింది.రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు సాఫ్ట్‌డ్రింక్స్ రంగంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీ కోక-కోలా తన వ్యాపార విస్తరణపై దృష్టిసారించడం ఇన్వెస్టర్లకు మేలు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోటీని తట్టుకుని తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్!
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశాల సైన్యం ఎదురు దాడుల కారణంగా భయానక యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఉక్రెయిన్‌కు వివిధ దేశాల నుంచి మద్దతు లభించడంతో రష్యాకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా.. నల్ల సముద్రంలో రష్యా నావికా దళానికి చెందిన కీలకమైన వాసిలీ బేఖ్ పడవపై దాడి చేశామని ఉక్రెయిన్ నేవీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్‌కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తోపాటు జవాన్లను, అధునాతన ఆయుధాలను చేరవేసేందుకు రష్యా ఉపయోగిస్తున్న ఈ పడవపై దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. రష్యా యుద్ధనౌక మోస్క్వాను ఉక్రెయిన్ దళాలు స్నేక్ ఐలాండ్‌లోనే ధ్వంసం చేసినట్టు తెలిపారు. కాగా, ఉక్రెయిన్ నేవీ ప్రకటనపై రష్యా మాత్రం స్పందించకపోవడం విశేషం. The head of the #Odesa regional military administration, Marchenko, reports that the #Russian tugboat Vasily Bekh was hit by a Harpoon missile today. The Russian side has not commented on this news so far. pic.twitter.com/oMBSuIqcM6 — NEXTA (@nexta_tv) June 17, 2022 ఇదిలా ఉండగా.. రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా నుంచి కోకాకోలా పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కోకాకోలా, ఇతర బ్రాండ్ పానీయాలను ఇకపై రష్యాలో ఉత్పత్తి చేసి విక్రయించబోమని కంపెనీ ప్రకటించింది. దీంతో ఆర్థికంగా రష్యాకు తీవ్ర నష్టం ఏర్పడింది. మరోవైపు.. రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. In the #Russian city of #Cheboksary, for the second time, local residents broke a "patriotic" installation of Putin's swastika in the form of the letter "Z". pic.twitter.com/lBJAe7HtjN — NEXTA (@nexta_tv) June 17, 2022 ఇది కూడా చదవండి: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు ప్లాన్.. -
కోకా కోలా ప్లాంట్‌లో 370 కిలోల కొకైన్!
లండన్: కోకా కోలా ప్లాంట్‌లో 370 కిలోల కొకైన్ బయటపడటం ఫ్రాన్స్‌లో కలకలం రేపింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్‌లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్‌ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' బుధవారం వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ వర్కర్ల పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్గ్రాస్ వెల్లడించారు. కొకైన్‌ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. -
కోకాకోలా ప్లాంటుకు భూకేటాయింపు రద్దు
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కోకా-కోలా ప్లాంటుకు గతంలో చేసిన 71.34 ఎకరాల భూమి కేటాయింపును ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. స్థానికులు, రైతులు, రాజకీయ పార్టీల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో ఆ భూమిని వెనక్కి తీసుకుంది. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను కంపెనీ పాటించలేదన్న కారణాన్ని ఈ రద్దు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితమే కోకా-కోలా కంపెనీకి నోటీసు ఇచ్చినట్లు సిప్కాట్ పేర్కొంది. ఇంతవరకు ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదని కంపెనీని ప్రశ్నించగా, మొదట్లో తాము ఫీజిబులిటీ పరీక్షలు చేయలేదని, కానీ ఇప్పుడు చూస్తే అది అంత లాభదాయకం కాదన్నట్లు తెలుస్తోందని కంపెనీ చెప్పిందంటున్నారు.