ముంబై: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఫలితాల దెబ్బతో కుదేలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఈ కౌంటర్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. సోమవారం విడుదలైన టాటా మోటార్స్ రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలు తప్పడంతో నేటి మార్కెట్ లో మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్ బలహీన ప్రదర్శన కారణంగా టాటా మోటార్స్ షేరు 10.11 శాతం పతనమైంది.
క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 848 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం 7 శాతం పెరిగి రూ. 67,000 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 10.4 శాతం నుంచి 9.4 శాతానికి తగ్గాయి. కాగా, స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ2లో రూ. 631 కోట్ల నష్టం ప్రకటించింది. గత క్వార్టర్ నష్టం రూ. 289 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 11,406 కోట్లను తాకింది. నిర్వహణ లాభం'(ఇబిటా) 61 శాతం క్షీణించి రూ. 306 కోట్లకు పరిమితంకాగా, ఇబిటా మార్జిన్లు 6.6 శాతం నుంచి 2.7 శాతానికి బలహీనపడ్డాయి.
కాగా టాటా -మిస్త్రీ బోర్డ్ రూం వార్ లో సైరస్ మిస్త్రీ టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించబడ్డారు. అయితే టాటా మోటార్స్ ఛైర్మన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
టాటా మోటార్స్ కు ఫలితాల దెబ్బ
Published Tue, Nov 15 2016 3:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
Advertisement
Advertisement