Plunge
-
పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!
పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్‌లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్‌లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది. -
విలీనాలు, కొనుగోళ్ల నేలచూపు
ముంబై: గడిచిన క్యాలండర్ ఏడాది(2023)లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు 51 శాతం క్షీణించాయి. 83.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల గణాంకాల సంస్థ ఎల్ఎస్ఈజీ డీల్స్ ఇంటెలిజెన్స్(గతంలో రెఫినిటివ్) వివరాల ప్రకారం గతేడాది డీల్స్ భారీగా నీరసించాయి. ప్రయివేట్ రంగ ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య నమోదైన భారీ డీల్ గణాంకాలకు కొంతమేర మద్దతిచ్చినట్లు ఎల్ఎస్ఈజీ నివేదిక తెలియజేసింది. నిజానికి 60.4 బిలియన్ డాలర్ల ఈ డీల్‌ను మినహాయిస్తే వార్షికంగా మరో 23 శాతం అదనపు క్షీణత నమోదయ్యేదని పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా లావాదేవీల వాతావరణం మందగించడంతో భారీ డీల్స్ నీరసించినట్లు తెలియజేసింది. ఒకే ఒక్క డీల్ అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే 3 బిలియన్ డాలర్లకు ఎగువన హెచ్డీఎఫ్సీ ద్వయం లావాదేవీ మాత్రమే నమోదైంది. 2022లో 5 భారీ డీల్స్‌కు తెరలేవగా.. పరిమాణంరీత్యా గతేడాది 1.7 శాతం క్షీణతే నమోదైనట్లు ఎల్ఎస్ఈజీ డీల్స్ సీనియర్ మేనేజర్ ఇలేన్ టాన్ పేర్కొన్నారు. వెరసి మధ్యస్థాయి మార్కెట్ లావాదేవీల హవా కొనసాగినట్లు తెలియజేశారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భారీగా నీరసించడంతో వడ్డీ రేట్లు దిగివచ్చే వీలుంది. ఫలితంగా 2024లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు దారి ఏర్పడనుంది. తద్వారా చౌకగా పెట్టుబడులు సమకూర్చుకునేందుకు వీలు చిక్కనున్నట్లు టాన్ వివరించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సార్వత్రిక ఎన్నికల తదుపరి ఎంఅండ్ఏ డీల్స్ ఊపందుకునే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా సైతం ఈ ట్రెండ్‌కు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో 2022 మార్చిలో ఫండింగ్ వింటర్(పెట్టుబడులు తగ్గిపోవడం) ప్రారంభమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణమైనట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ 17 శాతం క్షీణించి దశాబ్ద కనిష్టం 2.9 ట్రిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీలు జూమ్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ 60 శాతం ఎగసి 31.2 బిలియన్ డాలర్లమేర బలపడింది. 2021 తదుపరి వార్షికంగా గరిష్టస్థాయిలో నమోదైంది. ఫాలోఆన్ ఆఫర్లు రెట్టింపై 24.4 బిలియన్ డాలర్లను తాకాయి. మరోవైపు 1996 తదుపరి కొత్త ఈక్విటీ జారీ ఐపీవోలు 56 శాతం జంప్‌చేశాయి. కనీసం 236 ఎస్ఎంఈలు లిస్టింగ్ ద్వారా 6.8 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. అయితే 2022తో పోలిస్తే ఇవి 11 శాతం తక్కువే! -
ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడుల నేలచూపు
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ కేలండర్ ఏడాది(2023) మూడో త్రైమాసికంలో 65 శాతం క్షీణించాయి. 1.81 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2022) జులై–సెప్టెంబర్(క్యూ3)లో ఏకంగా 5.23 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజీ గ్రూప్ బిజినెస్ సంస్థ రెఫినిటివ్ వివరాల ప్రకారం లావాదేవీలు సైతం భారీగా 50 శాతం నీరసించాయి. 465 నుంచి భారీగా తగ్గి 232కు పరిమితమయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ2)లో నమోదైన 353తో పోలిస్తే డీల్స్ 34 శాతం వెనకడుగు వేయగా.. విలువ(2.79 బిలియన్ డాలర్లు) 35 శాతం క్షీణించింది. కాగా.. 2023 జనవరి–సెప్టెంబర్‌లో డీల్స్ 414 నుంచి 283కు తగ్గాయి. ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలలో 2.8 బిలియన్ డాలర్లు, ఐటీ సంస్థలలో 1.48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. -
మరోసారి బలహీనపడిన రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్ళీ బలపడటంతో 4 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.71 వద్ద ప్రారంభమైంది. తద్వారా 4 రోజులుగా లాభాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం 72 పైసలు బలహీనపడి 75.80 వద్ద రూపాయి ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్లో (గురువారం) రూపాయి 75.09 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.31శాతం పెరిగి 99.38 కు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు 0.95 శాతం క్షీణించి 26.19 డాలర్లకు చేరుకుంది. (జియో మరో భారీ డీల్ ) దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలకు తోడు, దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు రూపాయి అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు 1700 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేశాయి. దీంతో సెన్సెక్స్ 32 వేలకు దిగువకు చేరింది. నిఫ్టీ 479 పాయింట్లు కుప్పకూలింది. ప్రధానంగా ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు మళ్లీ 20 వేల స్థాయి దిగువన ట్రేడ్ అవుతోంది. ఫార్మ రంగం ఒక్కటే స్వల్పంగా లాభపడుతోంది. మరోవైపు బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1300 కు పెరిగింది. సోమవారం నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 42,500 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 35 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 2.47 లక్షలకు చేరుకుంది. మరోవైపు మరో రెండు వారాలపాటు దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగనుంది. (మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు) చదవండి : రూపాయి రయ్..రయ్... -
దిగ్గజ బ్యాంకులో 35 వేల ఉద్యోగాల కోత
హాంకాంగ్: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ భారీ నష్టాల కారణంగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. గత ఏడాది లాభాలు మూడో వంతు పడిపోవడంతో ఖర్చులకు తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 35 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. కోతలు చాలావరకు యూరోపియన్ , అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాలలో ఉండనున్నాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ కారణంగా అనేక అనిశ్చితులను ఎదుర్కొన్న బ్యాంకు తాజాగా ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకుంది. అలాగే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించడం (బ్రెగ్జిట్), కొత్తగా చైనాలో విస్తరించిన కరోనా వైరస్ కోవిడ్-19 కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో జాన్ ఫ్లింట్కు అనూహ్యంగా ఉద్వాసన పలికిన తర్వాత యాక్టింగ్ సీఈవోగా నోయెల్ క్విన్ బాధ్యతలు స్వీకరించారు. 50కి పైగా దేశాలకు విస్తరించి ఉన్న హెచ్ఎస్బీసీని ఆసియాలో లాభాల బాట పట్టించి, విశాలమైన అంతర్జాతీయ బ్యాంకును మార్చే వ్యూహంలో ఉన్నారు. అయితే తమ వ్యాపారం ఆశించిన రాబడిని ఇవ్వడంలేదనీ, ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులకు రాబడిని పెంచేలా కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నామని క్విన్ చెప్పారు. ఖర్చులు తగ్గించడంతోపాటు, తమ సంక్షిష్ట సంస్థాగత నిర్మాణాన్ని సరళీకృతం చేయనున్నామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో గ్లోబల్ హెడ్‌కౌంట్‌ను 235,000 నుండి 200,000 కు తగ్గించనున్నట్లు వెల్లడించారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. అమెరికాలో బ్యాంక్ తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను సుమారు 30 శాతం తగ్గించాలని, బ్యాక్ ,మిడిల్ ఆఫీస్ కార్యకలాపాలను ఏకీకృతం చేయాలని, నిర్వహణ ఖర్చులను 10-15 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. మెక్సికన్ మనీలాండరింగ్ కుంభకోణంలో చిక్కుకున్న హెచ్ఎస్బిసి 2012నుండి కీలక పునర్నిర్మాణ ప్రణాళికలను చేపట్టింది. 2022 నాటికి 4.5 బిలియన్ డాలర్ల వ్యయ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నామని, పునర్నిర్మాణ వ్యయాలు 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని బ్యాంక్ ఒక తెలిపింది. చైనాలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి 2020 లో ఆసియాలో వృద్ధి అంచనాలను తగ్గించిందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. దీంతో హాంకాంగ్‌లో హెచ్ఎస్బీసీ షేర్లు 2.2 శాతం పడిపోయాయి. -
అంబానీకి భారీ రుణభారం, జియో షాక్
ముంబై: బడా పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్ కాం) సోమవారం నాటిమార్కెట్ లో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. టెలికాం సేవల్లోకి జియో ఎంట్రీ, భారీ రుణ భారం కారణంగా బిలియనీర్ అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 10కి పైగా దేశీయ బ్యాంకులకు భారీగా బకాయిపడిందన్న వార్తలతో భారీ నష్టాలు నమోదు చేసింది. యాక్సిస్ , ఎస్, ఎస్బీఐ బ్యాంకు తదితర బ్యాంకులకు అప్పులను చెల్లించడంలో వెనకబడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. భారీ అప్పల్లో కూరుకుపోయిందన్న ఆందోళనల నేపథ్యంలో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా ఆర్‌కామ్ 23శాతం కుప్పకూలింది. అంబానీకి చెందిన మరో ప్రధాన కంపెనీ రిలయన్స్ కేపిటల్ 8 శాతం, రిలయన్స్ డిఫెన్స్ 6 శాతం రిలయన్స్ ఇన్ఫ్రా 8 శాతం, రిలయన్స్ పవర్ 7 శాతం పతనం కావడం గమనార్హం. ముఖ్యంగా సోదరుడు ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో 4 జి సేవల్లో గత ఏడాది వాయిస్ అండ్ డేటా సేవలతో సునామీలా దూసుకు రావడంతో ఆర్‌కాం భారీ నష్టాలతో రికార్డ్ కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే జియోకి పోటీగా ఇతర టెలికాం కంపెనీలు భారతి, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లు డేటా సేవలను సమీక్షించుకుంటూ వస్తుండగా, ఈ విషయంలో ఆర్‌కాం వెనుకబడింది. వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా మార్చి 31 నాటికి దాదాపు రూ.42 వేలకోట్ల అప్పులను ఆర్‌కాం మూటగట్టుకుంది. మరోవైపు రేటింగ్ సంస్థ ఇక్రా కూడా ఆర్ కాం రేటింగును బీబీబీ నుంచి బీబీ డౌన్ గ్రేడ్ చేసింది. 10 బ్యాంకులకు పైగా రుణాల చెల్లింపు ఆలస్యమైందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉపశమనాన్ని కల్పించే బాటలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపుల ద్వారా కొత్త చట్టాన్ని తీసుకు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లు భారీ అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిరాకరించింది. కాగా వైర్ లెస్ వ్యాపారాన్ని ప్రత్యర్థి ఎయిర్ సెల్లో విలీనం చేస్తున్నట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ గతంలో ప్రకటించింది. అలాగే టవర్ బిజినెస్‌లో రూ. 10,000 కోట్లవిలువైన 51 శాతం వాటాలను కెనడా బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ గ్రూపునకు విక్రయించింది. ఈ అమ్మకంద్వారా రూ .25,000 కోట్లు (3.9 బిలియన్ డాలర్లు) విలువైన రుణాలను తిరిగి చెల్లించాలని కంపెనీ భావిస్తోంది. దీంతో గతవారం ఆర్ కాం భారీగా నష్టపోయింది. గత ఏడాది మార్చి నాల్గవ త్రైమాసికంలో రూ. 966 కోట్ల నష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
టాటా మోటార్స్ కు ఫలితాల దెబ్బ
ముంబై: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఫలితాల దెబ్బతో కుదేలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఈ కౌంటర్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. సోమవారం విడుదలైన టాటా మోటార్స్ రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలు తప్పడంతో నేటి మార్కెట్ లో మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్ బలహీన ప్రదర్శన కారణంగా టాటా మోటార్స్ షేరు 10.11 శాతం పతనమైంది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 848 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం 7 శాతం పెరిగి రూ. 67,000 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 10.4 శాతం నుంచి 9.4 శాతానికి తగ్గాయి. కాగా, స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ2లో రూ. 631 కోట్ల నష్టం ప్రకటించింది. గత క్వార్టర్ నష్టం రూ. 289 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 11,406 కోట్లను తాకింది. నిర్వహణ లాభం'(ఇబిటా) 61 శాతం క్షీణించి రూ. 306 కోట్లకు పరిమితంకాగా, ఇబిటా మార్జిన్లు 6.6 శాతం నుంచి 2.7 శాతానికి బలహీనపడ్డాయి. కాగా టాటా -మిస్త్రీ బోర్డ్ రూం వార్ లో సైరస్ మిస్త్రీ టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించబడ్డారు. అయితే టాటా మోటార్స్ ఛైర్మన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఐటీ రంగాన్ని ముంచేసిన బ్రెగ్జిట్
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఐటి షేర్లను తీవ్ర నష్టాల్టోకి నెట్టేసింది. డాలర్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ పౌండ్ విలువ భారీగా పతనంకావడంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటి ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఈ ప్రభావం స్వల్ప కాలం మాత్రమేని ఐటి నిపుణులు వ్యాఖ్యానించారు. టెక్ మహీంద్రా దాదాపు 7 శాతం, హెచ్ సీఎల్ టెక్ ఎక్కువ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 3 నుంచి 6 శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 శాతం, హెచ్ సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్ , విప్రో లు కూడా దాదాపు 7 నుంచి11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. బ్రెగ్జిట్ నిర్ణయం మూలంగా పౌండ్ విలువ 31 సంవత్సరాల కనిష్ఠానికి కూలిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) వైదొలగుతున్న ప్రభావం ఐటి పరిశ్రమ పై స్వల్పకాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయ పడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. కాగా బ్రిటన్ గురువారం జరిగిన ఒక చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణలో 43 సంవత్సరాల తర్వాత ఈయూని వీడింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.