ఆదాయంలో అదరగొట్టిన టీసీఎస్
ముంబైః ప్రముఖ సాప్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ టెక్నాజీస్ అంచనాలకు మించి మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించింది. తన నష్టాలను తగ్గించుకొని 3 శాతం ఆదాయవృధ్ధితో, మొదటి త్రైమాసికం (ఏప్రిల్ -జూన్)లో రూ. 6,318 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. అయితే లాభాల్లో 0.4 శాతం క్షీణతను నమోదు చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రూ. 28,448 కోట్ల నుంచి రూ. 29,304 కోట్ల వృద్ధిని సాధించింది.
డాలర్ రెవెన్యూలను పెంచుకోవడంతో, కంపెనీ ఆదాయాల్లో వృద్ధిని సాధించింది. కానీ ఆపరేటింగ్ మార్జిన్లు కంపెనీ అనుకున్న టార్గెట్ ను చేరుకోలేకపోయాయి. వేతనాలు పెరగడంతో, ఆపరేటింగ్ మార్జిన్లను 25.1శాతమే కంపెనీ నమోదుచేసింది. అయితే 26శాతం నుంచి 28శాతంలో ఆపరేటింగ్ మార్జిన్లను సాధిస్తామని టీసీఎస్ గతంలో ప్రకటించింది. మరోవైపు మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. ఒక షేరు రూ. 6.50ను టీసీఎస్ అనౌన్స్ చేసింది.