ఇప్పుడు కాకుంటే జనవరిలో: దిగ్విజయ్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభ జనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్రం శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతికి పంపించవచ్చని, ఆయన దాన్ని అసెంబ్లీకి పంపుతారని రాష్ట్ట్ర్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రపతి తగినంత గడువు ఇస్తారని తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విభజన బిల్లు వచ్చేది, లేనిది అసెంబ్లీలో అభిప్రాయాల వెల్లడికి రాష్ట్రపతి ఇచ్చే గడువుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం సాధ్యంకాని పక్షంలో జనవరిలో ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తెస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం దిగ్విజయ్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొందరు సీమాంధ్ర నేతలు, పార్టీ హైకమాండ్‌ను కూడా ధిక్కరిస్తూ మాట్లాడుతున్నారని ప్రస్తావించగా, ‘వారు అలాంటి పంచ్‌లు వేయడాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నా’ అని బదులిచ్చారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ చేతికి కట్టబెట్టడాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ‘ఆయనకు ఏం కావాలంటా!’ అని ఎదురు ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని ఎలా నియంత్రిస్తుంది అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వారు సమస్యలను ప్రస్తావించవచ్చు. వాటిని బిల్లులో చేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని అన్నా రు.
అసెంబ్లీలో బిల్లును గెలిపిం చేందుకు ఎలాంటి వ్యూహాంతో వెళతారని అడగ్గా ‘ రెండు భిన్న రాష్ట్రాలు ఉన్నాయి. మేము రెండు భిన్న వ్యూహాలను అనుసరిస్తాం’ అని నవ్వుతూ బదులిచ్చారు. తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రి సర్వే ఎంపీలు మధుయాష్కీ, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి ్డ, అంజన్‌కుమార్, పొన్నం, రాజయ్య, పాల్వాయి, గుత్తా, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు దిగ్విజయ్‌ను కలిసి బిల్లును కేబినెట్ ఆమోదించడంపై ధన్యవాదాలు తెలిపారు.