ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
అసెంబ్లీలో జరుగుతున్న చర్చ తీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యమాలను పట్టించుకోకుండానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టడానికి దేశ రాజధానిలో చకచకా పావులు కదుపుతోంది. ఫిబ్రవరి తొలివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 11 తేదిన తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు అని సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది.