టీఆర్ఎస్ ఖాతాలో 4 ఎమ్మెల్సీలు | telangana mlc elections: four trs mlas unanimously elected | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఖాతాలో 4 ఎమ్మెల్సీలు

Published Fri, Dec 11 2015 3:22 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

టీఆర్ఎస్ ఖాతాలో 4 ఎమ్మెల్సీలు - Sakshi

టీఆర్ఎస్ ఖాతాలో 4 ఎమ్మెల్సీలు

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలకు ఏకగ్రీవంగా గెల్చుకుంది. వరంగల్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

ఆదిలాబాద్ లో పురాణం సతీశ్, మెదక్ లో భూపాల్ రెడ్డి, వరంగల్ లో కొండా మురళీ, నిజామాబాద్ లో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సివుంది. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు (శనివారం) గడువు ఉంది. పోలింగ్ డిసెంబర్ 27న జరుగుతుంది. డిసెంబర్ 30న ఓట్లు లెక్కిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement