20 లక్షల ఉద్యోగాలకు ఈ ఏడాది రెడ్ కార్పెట్
20 లక్షల ఉద్యోగాలకు ఈ ఏడాది రెడ్ కార్పెట్
Published Wed, Jan 18 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
కొత్త కొత్త సర్వీసు ప్రొవేడర్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణానికి తెరలేపుతున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి టెలికాం కంపెనీలు కొత్త ఉద్యోగవకాశాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో 2017లో టెలికాం రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త సర్వీసులు ప్రొవేడర్ల ఎంట్రీ, ప్రభుత్వ 'మేకిన్ ఇండియా' లాంటి కార్యక్రమాలు ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే నియామకాలు భారీగా పెరుగుతాయని, హ్యాండ్సెట్ తయారీదారులు 1.76 మిలియన్లు, సర్వీసు ప్రొవేడర్లు 0.37 మిలియన్ల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్తో కలిసి టీమ్లీజ్ రిపోర్టు చేసింది. 5జీ టెక్నాలజీతో ఇన్ఫ్రాక్ట్ర్చర్ రంగంలోనూ దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగవాకాశాలు వస్తాయని పేర్కొంది.
2020-21లో ఇన్ఫ్రాక్ట్ర్చర్ 0.92 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపింది. మొత్తంగా 2021 నాటికి 8.7 మిలియన్లకు పైగా ఉద్యోగవాకాశాలకు గ్యారెంటీ అని రిపోర్టు పేర్కొంటోంది. హ్యాండ్సెట్ ధరలు తగ్గడం, నెట్వర్క్లను మెరుగుపరుచుకోవడం కోసం ఆపరేటర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ వ్యాలెట్ల వాడకం పెంపు వంటివన్నీ ఈ రంగంలో కొత్త ఉద్యోగవకాశాలకు దోహదం చేస్తాయని టీమ్లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీతి శర్మ చెప్పారు. నెట్వర్క్ ఇంజనీర్స్, ఇన్ఫ్రా, సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్, అప్లికేషన్ డెవలపర్స్, సిస్టమ్ ఇంజనీర్స్, ఐ-డీఏఎస్ ఇంజనీర్స్, ఇన్ షాప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, హ్యాండ్సెట్ మ్యానుఫాక్చరింగ్ టెక్నిషియన్స్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాక్ ఆఫీసు అండ్ అడ్మినిస్ట్రేషన్, రిపైర్ ఎగ్జిక్యూటివ్లకు 2017లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందని రిపోర్టు పేర్కొంది.
Advertisement
Advertisement