mobile service providers
-
తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్
సాక్షి, అమరావతి : గత రెండ్రోజులుగా కోవిడ్-19 నియంత్రణకు ఇంగ్లిష్ భాషలో మాత్రమే వినిపిస్తున్న కాలర్ ట్యూన్ ఇప్పుడు తెలుగులోనూ వినిపించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడారు. నమస్తే అంటూ మొదలై.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనసమర్థంలోకి వెళ్లవద్దని చెప్పడం, వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించడం వంటి పలు అంశాలతో కూడిన చక్కటి వాయిస్‌ను రూపొందించారు. సుమారు యాబై సెకన్ల పాటు ఈ కాలర్ ట్యూన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అన్ని మొబైల్ ఫోన్లలోనూ కోవిడ్ నిరోధానికి పాటించే జాగ్రత్తలు తెలుగులోనే రానున్నాయి. ఇప్పటివరకు ఇంగ్లీష్‌లో వచ్చే ఈ కాలర్ ట్యూన్ అర్థం కాక సామాన్యులు ఇబ్బంది పడుతుండేవారు. (బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా) హోమియో మందుల పంపిణీ కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఏపీ సచివాలయంలో మంగళవారం ఆర్సెనికం ఆల్బమ్–30 పేరున హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉపసంచాలకులు వెంకట్రామ నాయక్ నేతృత్వంలో 1,500 మందికి హోమియో మందులు అందించామని సెక్రటేరియట్ వైద్యులు వెంకట్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మీ, సత్యబాబు తెలిపారు. ఈ హోమియో మందు రాష్ట్రంలోని అన్ని వైద్య కేంద్రాల్లో, హోమియో షాపుల్లో లభిస్తోందన్నారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఆమోదించిందని వెల్లడించారు. -
తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్
సాక్షి, అమరావతి: గత రెండ్రోజులుగా కోవిడ్ నియంత్రణకు ఇంగ్లిష్ భాషలో మాత్రమే వినిపిస్తున్న కాలర్ ట్యూన్ ఇప్పుడు తెలుగులోనూ వినిపించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడారు. నమస్తే అంటూ మొదలై.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనసమర్థంలోకి వెళ్లవద్దని చెప్పడం, వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించడం వంటి పలు అంశాలతో కూడిన చక్కటి వాయిస్‌ను రూపొందించారు. సుమారు యాబై సెకన్ల పాటు ఈ కాలర్ ట్యూన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అన్ని మొబైల్ ఫోన్లలోనూ కోవిడ్ నిరోధానికి పాటించే జాగ్రత్తలు తెలుగులోనే రానున్నాయి. ఇప్పటివరకు ఇంగ్లిష్‌లో వచ్చే ఈ కాలర్ ట్యూన్ అర్థం కాక సామాన్యులు ఇబ్బంది పడుతుండేవారు. హోమియో మందుల పంపిణీ కోవిడ్ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఏపీ సచివాలయంలో మంగళవారం ఆర్సెనికం ఆల్బమ్–30 పేరున హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉపసంచాలకులు వెంకట్రామ నాయక్ నేతృత్వంలో 1,500 మందికి హోమియో మందులు అందించామని సెక్రటేరియట్ వైద్యులు వెంకట్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మి, సత్యబాబు తెలిపారు. ఈ హోమియో మందు రాష్ట్రంలోని అన్ని వైద్య కేంద్రాల్లో, హోమియో షాపుల్లో లభిస్తోందన్నారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఆమోదించిందని వెల్లడించారు. -
అగ్రస్థానం మా లక్ష్యం కాదు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: నంబర్ 1 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలని లక్ష్యం నిర్దేశించుకోలేదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. మార్కెట్లో చివరికి మూడు పెద్ద ప్రైవేట్ కంపెనీలే నిలుస్తాయని పేర్కొంది. టాప్ టెలికం సంస్థగా ఉన్న ఎయిర్టెల్.. వొడాఫోన్–ఐడియా విలీనం తర్వాత రెండో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. అప్పుడు వొడాఫోన్–ఐడియా విలీన కంపెనీ అగ్రస్థానంలో ఉంటుంది. దీనికంతటికీ రిలయన్స్ జియోను కారణంగా చెప్పుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెలికంలో తీవ్రమైన పోటీ వల్ల ఒక యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) తగ్గిపోయిందని తెలిపారు. అయితే పరిస్థితులు త్వరలో కొలిక్కి వస్తాయన్నారు. ‘‘ఒక చక్రాన్ని తీసుకుంటే అందులో మేం కింది భాగంలో ఉన్నాం. ఇక ఇంతకన్నా దిగువకు వెళ్లలేం. ఇక్కడి నుంచి ధరలు, ఏఆర్పీయూ పైకి కదలడం మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘అగ్రస్థానంలో ఉండటం మా లక్ష్యం కాదు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడం గురించే ఆలోచిస్తాం. చివరకు మూడు పెద్ద కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఒకరు కొద్దిగా ఎక్కువగా మార్కెట్ వాటాను కలిగి ఉండొచ్చు. మరొకరు కొంచెం తక్కువ వాటా కలిగి ఉంటారు. అలాగే మార్కెట్ వాటా ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని చెప్పలేం’’ అని వివరించారు. భారత్‌లో ఒకానొక సమయంలో 12 ప్రైవేట్ టెలికం కంపెనీలు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య మూడుకు తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సహా ప్రైవేట్ రంగానికి చెందిన ఎయిర్టెల్, వోడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో కంపెనీలు మాత్రమే ఉంటాయి. -
20 లక్షల ఉద్యోగాలకు ఈ ఏడాది రెడ్ కార్పెట్
కొత్త కొత్త సర్వీసు ప్రొవేడర్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణానికి తెరలేపుతున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి టెలికాం కంపెనీలు కొత్త ఉద్యోగవకాశాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో 2017లో టెలికాం రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త సర్వీసులు ప్రొవేడర్ల ఎంట్రీ, ప్రభుత్వ 'మేకిన్ ఇండియా' లాంటి కార్యక్రమాలు ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే నియామకాలు భారీగా పెరుగుతాయని, హ్యాండ్సెట్ తయారీదారులు 1.76 మిలియన్లు, సర్వీసు ప్రొవేడర్లు 0.37 మిలియన్ల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో కలిసి టీమ్‌లీజ్ రిపోర్టు చేసింది. 5జీ టెక్నాలజీతో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ రంగంలోనూ దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగవాకాశాలు వస్తాయని పేర్కొంది. 2020-21లో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ 0.92 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపింది. మొత్తంగా 2021 నాటికి 8.7 మిలియన్లకు పైగా ఉద్యోగవాకాశాలకు గ్యారెంటీ అని రిపోర్టు పేర్కొంటోంది. హ్యాండ్సెట్ ధరలు తగ్గడం, నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడం కోసం ఆపరేటర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ వ్యాలెట్ల వాడకం పెంపు వంటివన్నీ ఈ రంగంలో కొత్త ఉద్యోగవకాశాలకు దోహదం చేస్తాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీతి శర్మ చెప్పారు. నెట్వర్క్ ఇంజనీర్స్, ఇన్ఫ్రా, సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్, అప్లికేషన్ డెవలపర్స్, సిస్టమ్ ఇంజనీర్స్, ఐ-డీఏఎస్ ఇంజనీర్స్, ఇన్ షాప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, హ్యాండ్సెట్ మ్యానుఫాక్చరింగ్ టెక్నిషియన్స్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాక్ ఆఫీసు అండ్ అడ్మినిస్ట్రేషన్, రిపైర్ ఎగ్జిక్యూటివ్‌లకు 2017లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందని రిపోర్టు పేర్కొంది.