సాక్షి, అమరావతి: గత రెండ్రోజులుగా కోవిడ్ నియంత్రణకు ఇంగ్లిష్ భాషలో మాత్రమే వినిపిస్తున్న కాలర్ ట్యూన్ ఇప్పుడు తెలుగులోనూ వినిపించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడారు. నమస్తే అంటూ మొదలై.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనసమర్థంలోకి వెళ్లవద్దని చెప్పడం, వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించడం వంటి పలు అంశాలతో కూడిన చక్కటి వాయిస్‌ను రూపొందించారు. సుమారు యాబై సెకన్ల పాటు ఈ కాలర్ ట్యూన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అన్ని మొబైల్ ఫోన్లలోనూ కోవిడ్ నిరోధానికి పాటించే జాగ్రత్తలు తెలుగులోనే రానున్నాయి. ఇప్పటివరకు ఇంగ్లిష్‌లో వచ్చే ఈ కాలర్ ట్యూన్ అర్థం కాక సామాన్యులు ఇబ్బంది పడుతుండేవారు.
హోమియో మందుల పంపిణీ
కోవిడ్ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఏపీ సచివాలయంలో మంగళవారం ఆర్సెనికం ఆల్బమ్–30 పేరున హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉపసంచాలకులు వెంకట్రామ నాయక్ నేతృత్వంలో 1,500 మందికి హోమియో మందులు అందించామని సెక్రటేరియట్ వైద్యులు వెంకట్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మి, సత్యబాబు తెలిపారు. ఈ హోమియో మందు రాష్ట్రంలోని అన్ని వైద్య కేంద్రాల్లో, హోమియో షాపుల్లో లభిస్తోందన్నారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఆమోదించిందని వెల్లడించారు.
తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్
Published Wed, Mar 11 2020 4:14 AM | Last Updated on Wed, Mar 11 2020 7:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment