శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఒకే తీవ్రవాదుల బృందం సాంబ సెక్టార్‌లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల దాడులు చేసింది.. ఆర్మీ యూనిఫాంలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్ సరిహద్దుకు కిలో మీటర్ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ను హతమార్చి ట్రక్‌లో అక్కడి నుంచి పారిపోయారు.
ఆ తర్వాత అదే తీవ్రవాదుల బృందం ఆర్మీ క్యాంప్‌పై కాల్పులు జరిపింది. ఇటీవలే భారత్‌లోకి చొరబడ్డ తీవ్రవాదులే ఈ ఘాతుకాని ఒడిగట్టారని నిఘా వర్గాలంటున్నాయి. భారత్ పాక్ దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికాలో భేటీ అవుతున్న నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొల్పే ఉద్దేశ్యంతోనే తీవ్రవాదులు తెగబడినట్లు తెలుస్తోంది.