ధాన్యం నాణ్యత నిర్ధారణకు ‘టెస్ట్ మిల్లింగ్’ | test milling to Grain Quality Verification | Sakshi
Sakshi News home page

ధాన్యం నాణ్యత నిర్ధారణకు ‘టెస్ట్ మిల్లింగ్’

Published Thu, Sep 24 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

test milling to Grain Quality Verification

మిల్లర్ల అసోసియేషన్ వినతితో ప్రభుత్వం పునరాలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాలశాఖ సేకరిస్తున్న ధాన్యాన్ని.. బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు ఇచ్చేముందు టెస్ట్ మిల్లింగ్ జరిపే అంశమై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. మార్కెట్‌లోకి వస్తున్న ధాన్యానికి ఎలాంటి టెస్ట్ మిల్లింగ్ చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించిన మేరకు నిర్ణీత బియ్యాన్ని ఇవ్వమంటే తమకు లాభసాటి కాదని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 1 నుంచి లెవీ విధానాన్ని ఎత్తివేస్తుండటం, పూర్తి ధాన్యాన్ని సేకరించేం దుకు ప్రభుత్వమే సమాయత్తమవుతున్న తరుణంలో..మిల్లర్లు చేస్తున్న డిమాండ్ చర్చనీయా ంశమైంది. ప్రతి సీజన్‌లో పౌర సరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద మిల్లర్లకు ధాన్యాన్ని అందజేస్తుంది. ఆ శాఖ అందించిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మలిచి తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.

100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చి బియ్యమైతే 67, ఉప్పుడు బియ్యమైతే 68 క్వింటాళ్లు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చినందుకుగాను  మిల్ల ర్లు చెబుతున్న మేరకు, వంద క్వింటాళ్ల ధాన్యా న్ని మిల్లింగ్ చేస్తే 61 లేక 62 క్వింటాళ్ల బియ్యం మాత్రమే వస్తోంది. అతి ఉష్ణోగ్రతల  కారణం గా ధాన్యంలో నూక, పరం ఎక్కువగా ఉంటుం దని, ప్రభుత్వం నిర్ధారించిన మేర బియ్యం ఇవ్వాలంటే వేరుగా మరో ఐదారు క్వింటాళ్ల బియ్యాన్ని తామే సేకరించి ఇవ్వాల్సి వస్తోం దని మిల్లర్లు అంటున్నారు.

దీంతో ఆర్థికభారం ఎక్కువ అవుతోందన్నారు. అందుకే  ఖరీఫ్ ధా న్యం సేకరణకు ముందే క్వింటాల్ ధాన్యంలో బియ్యం, నూక, పరం, తౌడు ఎంతెంత వస్తా యో టెస్ట్ మిల్లింగ్ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement