నిమజ్జనంలో డీజే పెట్టుకోనివ్వడంలేదని ఆగ్రహం
బీర్కూర్ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన ట్లు’ గణేష్ నిమజ్జనోత్సవంలో డీజే పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించక పోవడంతో ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ యువకులు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పలువురు టీఆర్‌ఎస్ నాయకులపై దాడికి యత్నించారు. తీవ్రంగా దుర్బాషలాడుతూ పార్టీ కార్యాలయంలోని కుర్చీలు, టేబుల్, ఫ్యాన్ ఇతర వస్తువులను ధ్వంసం చేసి భగత్‌సింగ్ కూడలిలో కాల్చివేశారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. బీర్కూరు మండలంలోని సంగె ం గ్రామంలోనూ గణేష్ నిమజ్జనోత్సవం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని అగ్రవర్ణాలు తమపై దాడిచేశారని ఆరోపిస్తూ దళితులు ఆందోళనకు దిగారు. బీర్కూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి అక్కడకుచేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు.
టీఆర్‌ఎస్ ఆఫీసుపై దాడి
Published Sun, Sep 27 2015 3:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement