బీజేపీపై మరోసారి శివసేన విమర్శలు
ముంబై: మహారాష్ట్రలో తమ భాగస్వామ్య పక్షమైన బీజేపీపై శివసేన విమర్శల దాడి కొనసాగిస్తోంది. బీజేపీకి అధికారం అనే రూపంలో మోదీ ఆక్సిజన్ అందిందని, ప్రజల్లో మోదీకి ఆదరణ ఉన్నంత వరకే ప్రాణవాయువు అందుతుందని, ఆ తర్వాత అందదని పేర్కొంది. సేన మాత్రం పోరాటం, దేశభక్తి, విలువల మీదే ఆధారపడుతుందని, హిందుత్వం, దేశభక్తి, మహారాష్ట్ర, సామాన్య ప్రజలకు సంబంధించిన అంశాల్లో తమ పార్టీ ఎప్పటికీ తన పంథాను మార్చుకోబోదని స్పష్టం చేసింది.
ఈ మేరకు తన పార్టీ పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయం ప్రచురించింది. దసరా సందర్భంగా శివసేన నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడం భవిష్యత్తు తమ పార్టీదే అని చెప్పడానికి నిదర్శనమని పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరైనా తమతో కలసి వస్తే కలుపుకుని ముందుకు వెళతామని, ఎవరు రాకున్నా తాము ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ఆదరణ ఉన్నంత వరకే మోదీ ఆక్సిజన్
Published Sun, Oct 25 2015 1:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement