హైదరాబాద్‌లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ మూడో స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ హైదరాబాద్‌లో మూడవ స్టోర్‌ను శంషాబాద్ వద్ద ఏర్పాటు చేసింది. జూన్ చివరివారం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.100 కోట్ల వ్యయంతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. శంషాబాద్‌తో కలిపి దేశవ్యాప్తంగా సంస్థ స్టోర్ల సంఖ ్య 17కు చేరుకుంది. 8,500 రకాలకుపైగా ఉత్పత్తులు స్టోర్‌లో కొలువుదీరాయని కంపెనీ కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ విశాల్ సెహగల్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.
వైజాగ్‌లో కొత్త స్టోర్ ఏర్పాటు ప్రణాళిక ఉందన్నారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ 2020 నాటికి దేశంలో స్టోర్ల సంఖ్యను 50కి చేర్చాలని నిర్ణయించింది. 10 లక్షలు ఆపై జనాభా గల నగరాలు తమకు లక్ష్యమని సెహగల్ తెలిపారు. ట్రేడర్ల నుంచి డిమాండ్ పెరిగితే ఆన్‌లైన్‌లో సరుకులను ఆర్డరు ఇచ్చే విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.