టైగర్ ఎయిర్ టూ వే స్పెషల్ ఆఫర్
న్యూఢిల్లీ: తక్కువ ధరల విమానయాన సంస్థ టైగర్ ఎయిర్ భారత విమాన ప్రయాణికులకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఆగ్నేయ ఆసియా బడ్జెట్ క్యారియర్ రూ13.599 ప్రారంభమయ్యే రాను పోను విమాన చార్జీలను బుధవారం ప్రకటించింది. దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాలనుంచి సింగపూర్ కు రెండువైపులా (టూ-వే) అన్ని చార్జీలు కలుపుకొని ఈ తగ్గింపు ధరలని తెలిపింది.
ప్రత్యేక ఆఫర్ కింద నేటి నుంచి(నవంబర్ 2 ) నవంబర్ 13 మధ్య బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో ఫిబ్రవరి న 1, 2017 నుంచి 30 అక్టోబర్, 2017 మధ్య ప్రయాణం చేయొచ్చు. కొచీ, బెంగళూరు, లక్నో, హైదరాబాద్, తిరుచిరాపల్లి (తిరుచ్చి) నుంచి సింగపూర్ కు ఈ ధరలు వర్తిస్తాయని టైగర్ ఎయిర్ పేర్కొంది. అలాగే ఆసియా పసిఫిక్ గేట్ వే ద్వారా బాలి, బ్యాంకాక్, హ్యాంక్ కాంగ్, గోల్డ్ కోస్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ, తైపీ లాంటి ఎగ్జైటింగ్ డెస్టినేషన్ కు వెళ్లేవారు తమ ఎయిర్ లైన్స్ ను ఎంచుకోవచ్చని సూచించింది.
కాగా సింగపూర్ ఎయిర్ లైన్స్ టైగర్ ఎయిర్ దేశంలోని ఎనిమిది ప్రధాన కేంద్రాలనుంచి వారానికి 50విమానాలను నడుపుతోంది. ఎ 320 విమానాల సముదాయంతో ఆసియాలో సింగపూర్, బంగ్లాదేశ్, చైనా, హాంగ్ కాంగ్, భారతదేశం, ఇండోనేషియా, మాకా, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, ఫిలిప్పీన్స్, తైవాన్, థాయ్లాండ్, వియత్నాం లాంటి సంస్థ 40 దేశాలు విమాన సర్వీసులు అందిస్తోంది.