
టిప్పు సుల్తాన్ ఖడ్గం రూ. 20 కోట్లు
న్యూఢిల్లీ: మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఓ ఖడ్గం వేలంలో భారీ ధర పలికింది. పులి తల పిడితో కూడిన, రత్న ఖచితమైన ఈ ఖడ్గం ఏకంగా రూ. 20.49 కోట్లకు అమ్ముడుపోయింది. టిప్పు సుల్తాన్ ఖడ్గం, కవచాలతో సహా 30 ఆయుధాలను లండన్‌కు చెందిన బోన్‌హ్యామ్స్ సంస్థ ‘ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్’ పేరుతో ఏప్రిల్ 21న నిర్వహించిన వేలంలో విక్రయించింది. ఈ వేలంలో టిప్పు వస్తువులన్నీ రూ. 57 కోట్ల ధర పలికాయి.