Tipu sultan
-
కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్‌బై!
బనశంకరి: కర్ణాటకలో పాఠశాల పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తుల పాఠ్యాంశాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. టిప్పు సుల్తాన్ పాఠాలను గతంలోనే తొలగించారు. మొఘలుల చరిత్రను తొలగించి, ఆ స్థానంలో దేశం కోసం పోరాడిన హిందూ రాజుల చరిత్రకు పెద్దపీట వేయాలని తీర్మానించినట్లు కర్ణాటక పాఠ్య పుస్తక పునః రచనా సమితి అధ్యక్షుడు రోహిత్ చక్ర తీర్థ బుధవారం తెలిపారు. ‘ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యపాలన చేసిన మేటి హిందూ రాణి చెన్న బైరాదేవికి సంబంధించిన పాఠ్యాంశాలకు పుస్తకాల్లో చోటు దక్కలేదు. ఈ అసమానతలను సరిదిద్దే కార్యక్రమాన్ని తమ కమిటీ చేపడుతోంది’ అని చక్ర తీర్థ తెలిపారు. (చదవండి: విషాదం.. పరీక్ష హాల్లో కుప్పకూలిన అనుశ్రీ) -
టిప్పు సింహాసనం.. మేడిన్ వైజాగ్
సాక్షి, విశాఖపట్నం: టిప్పుసుల్తాన్ ఠీవిని పెంచిన సింహాసనం.. రాణుల మనసు దోచుకున్న కళాత్మక అద్దం..వజ్రాలు, మాణిక్యాలు పొదిగిన బాకు..ఒకటా రెండా.. ఎన్నో అద్భుత కళాఖండాలకు రూపమిచ్చింది విశాఖ నగరం. ఈ అందాల నగరం.. ఒకప్పుడు అద్భుతమైన హస్తకళలకు కేరాఫ్ అడ్రస్‌గా భాసిల్లింది. రెండు శతాబ్దాల క్రితం ఇక్కడ అపురూప వస్తువులు ఆవిష్కృతమయ్యాయి. ఎన్నో గొప్ప కళాఖండాలు విశాఖ చరిత్రను ఇప్పుడు గుర్తుచేస్తున్నాయి. ఆ వైభవాన్ని చాటిచెప్పే పలు కళాఖండాలు బ్రిటన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బెర్ట్ మ్యూజియంలో ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి. విశాఖపట్నం ఒకప్పుడు వైజాగ్‌పటంగా సుప్రసిద్ధం. 200 ఏళ్ల క్రితం ఇక్కడ కళాకారులు రూపొందించిన వస్తువుల కోసం రాజులు సైతం పోటీపడేవారు. ముఖ్యంగా.. ఏనుగు దంతం, గంధపు చెక్కలు, బంగారం, వెండితో చేసిన ఫర్నిచర్ అంటే ఎక్కువ మక్కువ చూపేవారు. మూడేళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజియంలో నిర్వహించిన కళాఖండాల ప్రదర్శనలో విశాఖలోని డాల్ఫిన్ నోస్ పర్వతం ఆకృతి ఉన్న దంతపు బొమ్మ కనిపించడంతో.. దానిని అనుసరించి చరిత్రకారులు చేసిన పరిశోధనల్లో ఎన్నో అద్భుత కళాఖండాలు విశాఖకు చెందినవేనన్న విషయాలు వెల్లడైంది. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే... అందానికే అందం.. ఈ అద్దం.. విశాఖ హస్తకళాకారులు రూపొందించిన డ్రెస్సింగ్ టేబుల్.. రాణుల మనసు దోచుకుంది. గంధపు చెక్కలు, దంతాలు, వెండితో తయారైన ఈ మౌంట్ స్వింగింగ్ అద్దం 1790లో తయారైంది. ముగ్గురు మహరాణులు దీన్ని వాడిన తర్వాత దీనిని ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. వజ్రాల బాకు.. వాహ్వా.. బ్రిటిష్ మ్యూజియం రికార్డుల ప్రకారం ఈ అద్భుతమైన బాకుని 18వ శతాబ్దంలో విశాఖ కళాకారులు తయారు చేశారు. డబుల్ ఎడ్జ్ బ్లేడ్‌తో పిడికిలి గార్డుతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ బాకు హ్యాండిల్లో చిన్న చిన్న వజ్రాలతో పాటు మాణిక్యాలు పొదిగారు. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో తళుక్కుమంటోంది. టిప్పుసుల్తాన్ సింహాసనం... దేశంలోని రాజులందరికంటే తన వద్ద మంచి సింహాసనం ఉండాలని టిప్పుసుల్తాన్ ఆకాంక్షించాడు. వెంటనే.. వైజాగ్పటంలోని కళాకారులకు ఆర్డర్ ఇచ్చాడు. ఆ సింహాసనం 1770 సంవత్సరంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ సింహాసనం వైభవం చూసి బ్రిటిష్ రాణి షార్లెట్ మంత్రముగ్దురాలైంది. దీంతో.. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని రాణికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతి ఇస్తున్నట్లు వెండి ఫలకంపై రాసి ఉంచారు. అప్పట్లోనే దాన్ని లండన్ తరలించారు. ప్రత్యేక పూలబుట్టలు.. ఇది ప్రత్యేకమైన పూలబుట్ట. 1855లో వాల్తేరులోని సెడాచలం (ఇప్పటి సింహాచలం) ప్రాంతంలోని చేతివృత్తుల వారు ఎద్దుకొమ్ముతో దీనిని తయారు చేశారు. పైన మూత, హ్యాండిల్‌ను ముళ్లపంది వెంట్రుకలతో రూపొందించారు. ప్రస్తుతం ఈ విభిన్న కళాకృతి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. అద్భుతమైన కళాకారులుండేవారు.. చరిత్రను పరిశీలిస్తే.. వైజాగ్‌పటం హస్త కళాకారులకు నిలయంగా ఉండేదని తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇక్కడి శిల్పులు, స్వర్ణకారులు తీర్చిదిద్దిన అనేక వస్తు సంపద వివిధ దేశాల్లోని ప్రముఖ మ్యూజియంలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జయశ్రీ హతంగాడి అనే వంశం వైజాగ్‌పటం హస్తకళలకు ప్రసిద్ధిగా ఉండేది. ఆకుటుంబం తయారు చేసిన వస్తువులకు ఎక్కువ డిమాండ్ ఉండేది. క్రమంగా ఇక్కడ హస్తకళల వైభవం మరుగున పడిపోయింది. – ఎడ్వర్డ్ పాల్, చరిత్రకారుడు -
సిలబస్ కుదింపుపై రాజకీయ రగడ
బెంగళూర్ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ సిలబస్‌ను సీబీఎస్ఈ తగ్గించిన అనంతరం కర్ణాటక సైతం ఈ దిశగా అడుగులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో సిలబస్‌ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చాప్టర్లను తొలగించింది. విద్యార్ధుల సౌలభ్యం కోసం కర్ణాటక టెక్స్ట్‌బుక్స్ సొసైటీ పలు పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగించింది. మొఘల్, రాజ్‌పుత్‌ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దుల పద్దులో చేరాయి. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యాసంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది 120-140 పనిదినాలే లక్ష్యంగా సిలబస్‌ను కుదించారు. కాగా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్‌ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాలను సిలబస్ క్రమబద్ధీకరణతో లేదా ఎన్సీఈఆర్టీ ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ ద్వారా కవర్ అవుతాయని సీబీఎస్ఈ ఆ తర్వాత వివరణ ఇచ్చింది. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చాప్టర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చదవండి : ‘లాక్డౌన్ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గలేదు’ -
పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్ పేరు తొలగింపు..
బెంగళూర్ : పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్ పేరును తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. టిప్పు సుల్తాన్ జయంతి జరపబోమని, ఆయన పేరిట ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తామని తేల్చిచెప్పారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడన్న కొందరి వాదనతో తాను విభేదిస్తానని స్పష్టం చేశారు. నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరపరాదని తాము ఇప్పటికే నిర్ణయించామని తెలిపారు. టిప్పు సుల్తాన్ బలవంతపు మతమార్పిళ్లు, దేవాలయాల కూల్చివేత, హిందువులను వేధించడం వంటి చర్యలకు పాల్పడి వివాదాస్పద పాలకుడైనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
ధైర్యం చేసి రాశా
‘‘టిపు చనిపోయి 220 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వార్తల్లో ఉంటున్నాడు. బ్రిటిషర్స్ మనల్ని వదిలి 72 ఏళ్లు అవుతున్నా.. క్రూర నియంతగా, ఇస్లాం మతోన్మాదిగా సుల్తాన్ మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు. ఈ వలస సామ్రాజ్యపు విధి విధానాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతుందో.. వాళ్ల కోణంలోని మన చరిత్రను తిరగ రాసుకోవాల్సిన అవసరమూ అంతే ఉంది! అలాంటి ప్రయత్నమే ఈ ‘టిపు సుల్తాన్’ పుస్తకం’’ అని అంటున్నారు పుస్తక రచయిత్రి యార్లగడ్డ నిర్మల. ఆమె హైదరాబాద్ వాసి. హిస్టరీ డిపార్ట్మెంట్లో రీడర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ‘టిపు సుల్తాన్’ రచన సందర్భంగా ఆమె గురించి ఆమె మాటల్లోనే.. ‘‘పుస్తకాలు చదవడం నా దిన చర్యలో భాగం.. చిన్నప్పటి నుంచి. మా నాన్న (జయ రావు) నేర్పిన అలవాటు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మ (మేరీ) టీచర్. వాళ్లిద్దరూ ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగస్తులవడం వల్ల మా ఇద్దరినీ (అక్క, నేను) బాగా చదివించారు. ఆడపిల్లలకు అంత చదువెందుకని ఏ రోజూ అనుకోలేదు. తెలుగు మీడియంలో చదివించి విడిగా ఇంగ్లిష్ నేర్పించారు.. సాహిత్యం ద్వారా. ఇంగ్లిష్ లిటరేచర్‌లోని పెద్ద పెద్ద రైటర్స్ అంతా మా చిన్నప్పుడే మాకు పరిచయం అయ్యారు. అంతేకాదు హాలీవుడ్ క్లాసిక్స్ అన్నీ చూపించారు మాకు. ఇంగ్లిష్ భాష ఇంప్రూవ్‌మెంట్‌కు అదెంతో హెల్ప్ అయింది. ఇంకో రకంగా కూడా మేం అదృష్టవంతులమని చెప్పాలి. మా ఇష్టాయిష్టాల మీద మా అమ్మానాన్న ఏనాడూ పెత్తనం చెలాయించలేదు. ఇంటర్లో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. అప్పట్లో మెడిసిన్, ఇంజనీరింగ్‌లకు ఇప్పట్లా ఎంట్రన్స్ లేదు. మంచి పర్సెంటేజ్ ఉంటే చాలు సీట్ వచ్చేది. అట్లా నాకు ఇంటర్లో వచ్చిన మార్క్స్‌తో ఈజీగా మెడిసిన్‌లో సీట్ వచ్చేది. మా బంధువులంతా కూడా మా పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టారు నన్ను మెడిసిన్ చదివించమని. కాని నాన్న నన్ను ఫోర్స్ చేయలేదు. డిగ్రీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ తీసుకున్నా. ఎమ్మేలో హిస్టరీ తీసుకున్నా. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అప్పుడే గ్రూప్ వన్ కూడా రాశా. 23 ఏళ్లకే గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యా. కాని ఆ ఉద్యోగం అంత గొప్పగా అనిపించలేదు.అప్పటికే ఎంఫిల్ కూడా రాసి ఉన్నా. దాంతో గ్రూప్ వన్‌కి గుడ్‌బై చెప్పా. అప్పుడు మాత్రం పేరెంట్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎంఫిల్ కూడా ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్డీ చేశా.. విజయనగర సామ్రాజ్యంలోని గుడుల మీద. ఆ థీసిస్‌ని పబ్లిష్ కూడా చేశా యూజీసీ గ్రాంట్స్‌తో. అమెరికా, యూరప్ కంట్రీస్లోని స్కాలర్స్ అందరూ నా థీసిస్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటూంటారు. యూజీసీ ఫెలో, ఏపీపీఎస్సీ క్యాండిడేట్ని. నన్ను గైడ్ చేసి, ఈ స్థాయిలో నిలబెట్టిన గైడ్.. ప్రొఫెసర్ పీసపాటి శ్రీరామ్ శర్మగారు. టిపు సుల్తాన్.. నిజాలు..! తెలుగు, ఇంగ్లిష్ సాహిత్యంతోపాటు చరిత్ర అన్నా చాలా ఇష్టం నాకు. చదువు థియరీ అయితే.. దానికి ప్రాక్టికల్స్ పర్యటన అని బలంగా నమ్మడమే కాదు ఆచరిస్తాను కూడా. అందుకే నా సేవింగ్స్ అన్నిటినీ పర్యటనకు వెచ్చించాను. సోలో ట్రావెలింగ్‌నే ఇష్టపడ్తా. పందొమ్మిదో శతాబ్దపు ఇంగ్లిష్ సాహిత్యాన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్పీరియన్స్ చేసేందుకు యూరప్ వెళ్లాను. చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆఫ్రికా దేశాలు తిరిగాను. చిత్రంగా అక్కడి ప్రతి మూల.. ప్రతి ప్రదేశంతో నాకు ఇదివరకే పరిచయం ఉన్నట్టనిపించింది. అదే సాహిత్యానికున్న గొప్పదనం. ప్రాంతాలనే కాదు మనం లేని కాలమాన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్లి వాటితో మనల్ని మమేకం చేస్తుంది. అట్లాగే నేను చూసిన హాలీవుడ్ క్లాసిక్స్‌లోని ప్లేసెస్‌నీ చుట్టొచ్చాను. ‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్’ అని బెర్నాడ్ షా సెలవిచ్చాడు కాని నేనైతే ‘నాలెడ్జ్ ఈజ్ హ్యాపీనెస్’ అనుకుంటాను. ఇదే సూత్రాన్ని నేను పనిచేసిన నాంపల్లి (హైదరాబాద్)లోని ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ మహిళా కాలేజ్ స్టూడెంట్స్ విషయంలోనూ అప్లయ్ చేశాను. నా పర్సనల్ ఇంటరెస్ట్‌తో యేడాదికి ఒకసారి ఆ పిల్లల్నీ స్టడీ టూర్‌కి తీసుకెళ్లేదాన్ని. అలా చరిత్ర చదివితే, ప్రపంచం చుడితే వచ్చిన జ్ఞానమే ఈరోజు టిపు సుల్తాన్ గురించి రాయడానికి తోడ్పడింది.టిపు సుల్తాన్ గురించి చాలా చదివాను. మరింతగా అర్థం చేసుకోవడానికి అనేకసార్లు మైసూర్ కూడా వెళ్లొచ్చాను. ఆ అనుభవం.. టిపు మీద వచ్చిన ఇంకా అనేక పుస్తకాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్రకారులు ఆయన గురించి పలు సందర్భాల్లో ఇచ్చిన రిఫరెన్స్‌లు.. థీసిస్ మొదలైనవాటినన్నీ అధ్యయనం చేసి... విశ్లేషించి.. రెండేళ్లు శ్రమించి రాశాను. నాకు తెలుసు ఇప్పటి పరిస్థితుల్లో అది కాంట్రవర్షియల్ అని. కాని నిజం తెలియాలి కదా. అందుకే ధైర్యం చేశా. దానిమీద వచ్చే ఏ చర్చకైనా ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. నిజానికి మన చరిత్రను కూలంకుషంగా చదివి.. నిశితంగా పరిశీలిస్తే.. ఈ నేలను ఏలిన ముస్లిం రాజులు తమ రాజ్య విస్తరణ కాంక్షనే బయటపెట్టుకున్నారు తప్ప సామాన్య ప్రజల విశ్వాసాలు, జీవన విధానాల జోలికి పోలేదు. పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు. కాని టిపునే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు? ఆ వివాదాల చారిత్రక నేపథ్యం ఏమిటి? మొదలైన అంశాల విశ్లేషణే నేను రాసిన ‘టిపు సుల్తాన్’. చిన్న మాట కాలం తెచ్చిన మార్పులను ఆహ్వానించాల్సిందే. అయితే విపరీతాలను నిలువరించాలంటే పాత టెక్నిక్స్‌ను ఉపయోగించాలి. ఆ పాత పద్ధతే పుస్తక పఠనం. ఇప్పుడు అవసరం. రీడింగ్ హాబీ సామాజిక స్పృహను కలిగిస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తుంది. ఇప్పుడు మన చదువులో సోషల్ సైన్సెస్ చోటు లేకుండా పోయింది కాబట్టి పుస్తక పఠనం కంపల్సరీ. అలాగే ఆడపిల్లలకు ఒక మాట. ధైర్యంగా ఉండాలి. సమస్యలుంటాయి. ఎదుర్కొనే స్థయిర్యాన్ని అలవర్చుకోవాలి. దీనికి చదువును మించిన ఆయుధం లేదు’’ అని చెప్తారు రైటర్, హిస్టారియన్ యార్లగడ్డ నిర్మల. – సరస్వతి రమ ఫొటో: మోహనాచారి ►నిర్మల అనేక కథలు, అనువాద కథలు రాశారు. ఇవన్నీ ప్రముఖ దినపత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రముఖ రచయిత డాక్టర్ విజయభారతితో కలిసి అంబేడ్కర్ పుస్తకానికీ పనిచేశారు నిర్మల. ఆమె రాసిన తాజా పుస్తకం ‘టిపు సుల్తాన్’ను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ. -
బ్రిటీష్‌ను బెంబేలెత్తించిన... మైసూరు రాకెట్లు...!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ దగ్గరలోనే ఓ గ్రామంలోని పాడుపడిన బావి నుంచి ఇటీవల వెయ్యి రాకెట్లు (తారాజువ్వల వంటివి) బయటపడ్డాయి. లండన్ మ్యూజియంలో భద్రపరిచిన రాకెట్లతో ఇవి పోలి ఉండడంతో పాటు టిప్పు సుల్తాన్ కాలం నాటివిగా భావిస్తున్న ఇలాంటి రాకెట్లనే మరి కొన్నింటిని కొంత కాలం క్రితమే వెలికి తీశారు. దీంతో దాదాపు 250 ఏళ్ల క్రితమే టిప్పు సుల్తాన్ శత్రువుపై ముఖ్యంగా ఇంగ్లీష్ బలగాలు మైసూరు రాజ్యంలోకి అడుగుపెట్టకుండా ఎలాంటి యుద్ధనీతులు, సైనికవ్యూహాలతో పాటు ఎలాంటి వినూత్న ఆయుధాలు ఉపయోగించి ఉంటాడనేది చర్చనీయాంశమైంది. ఆంగ్లేయులతో మైసూరు రాజ్యానికి జరిగిన యుద్ధాల్లో ‘రాకెట్వ్యూహం’ విస్తృతంగా ఉపయోగించినట్టు వెల్లడైంది. ‘శత్రువు ఉపయోగించిన మందుగుండు, ఇతర ఆయుధాల కంటే కూడా రాకెట్ల వల్లనే బ్రిటీష్ సైన్యానికి ఎక్కువ నష్టం వాటిల్లింది’ అని చరిత్రకారులు ఎల్.డే, ఐ.మెక్నీల్ తమ గ్రంథం ‘బయోగ్రఫికల్ డిక్షనరీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ టెక్నాలజీ’లో పేర్కొన్నారు. టిప్పు బలగాలు మెరుగైన సైనిక నైపుణ్యాలు కలిగి ఉన్న కారణంగా నాలుగో యుద్ధంలో దౌత్యపరమైన నైపుణ్యాలతోనే మైసూరు సైన్యంపై బ్రిటీష్‌సైన్యం చివరగా గెలుపొందగలిగిందనే అభిప్రాయంతో చరిత్రకారులున్నారు. అసలేమిటీ రాకెట్ల చరిత్ర ? 19వ శతాబ్దం మొదట్లో నెపోలియన్ యుద్ధాల్లో భాగంగా ఫ్రాన్స్‌తో బ్రిటన్ తలపడినపుడు అప్పటి వరకు ఐరోపా ఖండంలోనే ఎవరు ఉపయోగించని ‘కాంగ్రీవ్ ర్యాకెట్’లు ప్రయోగించింది. ఇంగ్లిష్ సైన్యానికి చెందిన సర్ విలియమ్ కాంగ్రీవ్ దీనిని కనిపెట్టినట్టు భావిస్తున్నారు.18వ శతాబ్దం ప్రారంభంలో పలు ప్రయోగాలు నిర్వహించాక ‘మండే తారాజువ్వలు’ కాంగ్రీవ్ తయారుచేశారు. యుద్ధంలో వినియోగించినపుడు బాగా ప్రభావం చూపడంతో ఈ ర్యాకెట్లపై డెన్మార్క్, ఈజిప్ట్, ప్రాన్స్, రష్యా, ఇతర దేశాల మిలటరీ ఇంజనీర్ల దృష్టిని ఆకర్షించింది. అయితే 19వ శతాబ్దం మధ్యలో చరిత్రకారులు బ్రిటీష్ మిలటరీ చరిత్ర, నేపథ్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసినపుడు కాంగ్రీవ్ రాకెట్ మూలాలు భారత్‌లో మరీ ముఖ్యంగా టిప్పు సుల్తాన్ రాజ్యంలో ఉన్నట్టు గుర్తించారు. కొన్ని శతాబ్దాల క్రితమే మండే బాణాల రూపంలో ఐరోపా దేశాల్లో వీటిని ఉపయోగించినా, టిప్పుకాలంలోనే వీటిని ఆధునీకరించడంతో ‘మైసూరు రాకెట్లు’గా ఇవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ‘ప్రధానంగా ఇంథనం పట్టి ఉంచేందుకు వీలుగా ఇనుపగొట్టాలు వినియోగించిన కారణంగా బ్రిటీషర్లకు తెలిసిన, చూసిన వాటి కంటే కూడా టిప్పు కాలం నాటి రాకెట్లు ఎంతో అధునాతనమైనవి’ అని శాస్త్రవేత్త రొద్దం నరసింహ పేర్కొన్నారు. ఏమిటీ ప్రత్యేకత ? ఇనుప గొట్టంతో తయారుచేసిన ఈ రాకెట్లు (ఇవి వివిధ సైజుల్లో ఉంటాయి) ఓ చివర మూసివేస్తారు. వెదురుబద్ధకు ఓ ట్యూబ్‌ను జతచేశాక అది మండే వాహకంగా (కంబాషన్ ఛాంబర్)గా పనిచేస్తుంది. వాటిలో గన్ఫౌడర్ను ఇంథనంగా ఉపయోగిస్తారు. ఈ రాకెట్లు 500 గ్రాముల గన్ఫౌడర్తో 900 మీటర్ల వరకు లక్ష్యాలు చేధించేలా రూపొందించారు. గతంలో ఐరోపా, చైనాతో సహా ఇండియాలోనూ కనుక్కున్న రాకెట్లలో (ఇనుప కేసింగ్ లేనివి కూడా) ఇంత ఎక్కువ దూరం వెళ్లలేకపోయినట్లు గుర్తించారు. ఈ రాకెట్ల ఉన్నతస్థాయి యాంత్రిక నిర్మాణంలో ఇనుము, స్టీలు, గన్‌పౌడర్‌ను మంచి మిశ్రమంగా ఉపయోగించిన తీరు అద్భుతమని చరిత్రకారులు హెచ్ఎం ఇఫ్తకార్ జామ్, జాస్మిన జైమ్ తమ పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ పర్యవేక్షణలో ర చించిన ‘ద ఫతూల్ ముజాహిదీన్’ మిలటరీ మ్యానువల్‌లో సైనికదాడుల్లో రాకెట్ల వినియోగం గురించి వివరంగా రాశారు. ప్రతీ సైనికదళంతోనూ ‘జౌక్’గా పిలిచే రాకెట్‌సైన్యం ఉండేది. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్అలీ కాలంలో 1200 మంది ఉన్న రాకెట్‌సైన్యం, టిప్పు కాలం నాటికి 5 వేల మందికి చేరుకుందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. - సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
నోట్‌బుక్‌పై టిప్పు సుల్తాన్
ఇది స్కూళ్లు రీ ఓపెన్ అయిన సమయం. పిల్లలందరూ కొత్త నోటు పుస్తకాలపై నేమ్ స్లిప్స్ అంటించుకుంటారు. కామిక్ బొమ్మలు, పూలు, జంతువులు... ఇలాంటి నేమ్‌స్లిప్స్ ఉంటాయి సాధారణంగా. కాని ఉండవల్లికి చెందిన నశీర్ అహ్మద్‌కు వినూత్నమైన ఆలోచన వచ్చింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల నేమ్ స్లిప్స్‌ను తయారు చేస్తే అవి పిల్లలకు స్ఫూర్తినిస్తాయి కదా అనుకున్నారు. లక్షలాదిగా తయారు చేసి ఆయన ఉచితంగా పంచుతున్న నేమ్‌స్లిప్స్ పిల్లలకు తెలియని చరిత్ర తెలియచేస్తున్నాయి. కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. నశీర్ అహ్మద్ (మొబైల్: 82476 77127 ) ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన కృషిని పంచుకున్నారు. ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ఎంతోమంది ముస్లిం సమరయోధులు పాటుబడ్డారు... ‘జైహింద్’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు సృష్టించారు. చరిత్రలో వీరికి స్థానం కల్పించకపోవడంతో వారి త్యాగాలకు గుర్తింపులేకుండా పోయింది. సుభాష్ చంద్రబోస్‌కి ‘నేతాజీ’ అన్న బిరుదు ఇచ్చింది, అల్లూరి సీతారామరాజుకి తుపాకి పట్టడం నేర్చింది ముస్లింలే. ఇటువంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఈ తరం బాలలు తెలుసుకోవాలనే స్కూల్ బుక్స్ మీద అంటించుకునే నేమ్స్లిప్స్కు రూపకల్పన చేశాను. ఇరవై ఏళ్లుగా కృషి ‘మాది గుంటూరు జిల్లా. గతంలో జర్నలిస్టుగా పనిచేశాను. స్వాతంత్య్రం కోసం పాటుబడిన ముస్లిం సమరయోధుల మీద గత 20 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నాను. తెలుగులో వీరి మీద రాసిన పుస్తకాలు నాతోనే ప్రారంభం అని నేను అనుకుంటాను. ముస్లింల త్యాగాల గురించి చాలామంది ముస్లింలకే తెలియదు. ఇక ముస్లిమేతర సోదరులకు తెలియడం అసంభవం. ఆ క్రమంలోనే వారి గురించిన సమాచారం ప్రజల్లోకి తీసుకురావాలనే సంకల్పం కలిగింది. పుస్తక రూపంలోను, ఆల్బమ్స్గాను రూపొందిస్తే అందరికీ త్వరగా చేరువవుతుందనే ఉద్దేశంతో పుస్తకాలుగా ప్రచురిస్తున్నాను. ముస్లిం యోధుల పేరు మీద పిల్లలకు పుస్తకాల మీద వేసుకునే లేబుల్స్ తయారుచేస్తున్నాను. వాటి మీద సమరయోధుల పేరు, ఆ కింద వారికి సంబంధించిన ఒక లైను రాసి ఉంటుంది. ఆ లేబుల్ వారి పుస్తకం మీద కనీసం మూడునాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ వారు ఆ బొమ్మ చూస్తూ ఉంటారు. పిల్లల మనసుల్లో ఈ బొమ్మలు ముద్రితమవుతాయి. పూర్వీకుల వివరాలు తెలుస్తాయి. అందువల్ల ఈ విధంగా రూపొందించాను. మొత్తం పది లక్షల స్టిక్కర్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నాను. ఇందుకు ఎంతోమంది మిత్రులు సహకరిస్తు న్నారు’. 13 పుస్తకాలు ‘1998 లో మొదటి పుస్తకం ‘భారత స్వాతంత్య్రోద్యమ ముస్లిం మహిళలు’ అనే పుస్తకం రచించి ప్రచురించాను. ఆ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. చాలామందికి ముస్లిం మహిళల గురించి ఒక అపోహ ఉంటుంది– వారు బురఖాల నుంచి బయటకు రాలేరని. ఆ అపోహను తునుమాడుతూ ఎంతోమంది మహిళలు భారతదేశం కోసం పాటుబడ్డారని ఆ పుస్తకంలో చెప్పాను. ఇప్పటివరకు మొత్తం 13 పుస్తకాలు రచించాను’. ఫొటో ఎగ్జిబిషన్ ‘పది సంవత్సరాల పాటు కష్టపడి మొత్తం 152 మంది ముస్లిం సమరయోధులకు సంబంధించిన ఫోటోలు సేకరించి వాటిని ఆల్బమ్‌గా తయారుచేశాను. నెల్లూరు జిల్లా గూడూరులో మొట్టమొదటి ప్రదర్శన పెట్టాను. ఆ తరవాత హైదరాబాద్, విజయవాడ, గుంటూరు... ప్రాంతాలలో ప్రదర్శించాక ఆర్థికంగా కష్టం కావడంతో, కొంతకాలం పాటు ఎగ్జిబిషన్ పెట్టడం మానేశాను. ఈలోగా పుణె నుంచి కె.జి పఠాన్ అనే వ్యక్తి పుణేలో ఎగ్జిబిషన్ పెడతామంటూ నన్ను సంప్రదించారు. నేను అంగీకరించాను. ఫొటోలను తెల్ల షీట్ మీద ప్రింటవుట్ తీసి, గోడ మీద నల్ల కర్టెన్ పెట్టి, దాని మీద ఈ షీట్‌ను అతికించారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆ ప్రదర్శన ఎంతో మంది వీక్షించారు. అలా నాకు వారు మార్గం చూపడంతో, చాలా తక్కువ ఖర్చుతో తిరిగి ప్రదర్శనలు ప్రారంభించాను. గుజరాత్, బిహార్, యు.పి, పంజాబ్, తమిళనాడులలో ఈ ఎగ్జిబిషన్లు నిర్వహించబోతున్నాను. విస్తృతంగా స్నేహాలు ఏర్పడటంతో అంతర్జాలం నాకు ఒక మంత్రంగా ఉపయోగపడింది’. అతడు కూడా భగత్‌సింగే ‘మహారాష్ట్రకు చెందిన అష్ఫఖుల్లా ఖాన్ 20 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారి చేత ఉరి తీయబడ్డాడు. అతను జర్నలిస్టు. 14 సంవత్సరాల వయసులో పత్రిక నడిపాడు. ఆయన ‘మేరా వతన్ రహే సదా /మై రహూ యా నా రహూ’ అన్నాడు. ఇవాల్టి తరాలకు భగత్‌సింగ్ తెలుసు. అష్ఫఖుల్లా ఖాన్ గురించి ఎంతమందికి తెలుసు? సహాయ నిరాకరణోద్యమ సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేయమని పిలుపు ఇవ్వగానే మొట్టమొదటగా రాజీనామా చేసిన వ్యక్తి విజయవాడకు చెందిన గులాం మొయిద్దీన్ అని చాలామంది తెలుగువారికి తెలియదు. అల్లూరి సీతారామరాజుకి తుపాకీ పట్టడం నేర్పింది షేక్ సదరుల్లాఖాన్, అంతేకాదు ఆయనకు అండదండలుగా నిలిచింది సదరుల్లా ఖాన్. యూసఫ్ మెహర్ ఆలీ అనే ముస్లిం క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించాడు. ఈ సమాచారం చాలామందికి తెలియదు’. ఆజాద్ హింద్ ఫౌజ్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పేరిట ముస్లిం పోరాట యోధులకు సంబంధించిన పుస్తకాన్ని 425 పేజీలతో తీసుకురాబోతున్నాను. నేతాజీ ఆధ్వర్యంలో 1941 నుంచి 1945 వరకు జరిగిన పోరాటంలో పాల్గొన్న ముస్లిం పోరాట యోధుల గురించి ఈ పుస్తకంలో చెప్పబోతున్నాను. అలాగే చరిత్ర సృష్టించిన రజియా సుల్తానా నుంచి సానియా మీర్జా వరకు గల ముస్లిం మహిళల సమాచారంతో మరో పుస్తకం తీసుకురాబోతున్నాను’. మంచిని పెంచాలి ‘విస్మరించబడ్డ వీరులను తెలియచేయడం కాదు, ఈ దేశంలో ఉన్న విభజన సముదాయాల మధ్యసౌభ్రాతృత్వం, సామరస్యం, సహిష్ణుత, స్నేహభావం, సోదరభావం ‘మరింత పటిష్టం’ కావాలని నా లక్ష్యం. సదవగాహన, సద్భావన ఏర్పడాలి. బహుళ సంస్కృతి పరిఢవిల్లాలి. అన్ని మతాలలోను మంచిచెడులుంటాయి. ప్రేమను భ్రాతృత్వాన్ని పెంచుకోవడం మంచిది. అవి మంచిని చెబుతున్నాయి. నేను చేస్తున్నది ఒక వ్యవస్థతో కూడిన పని’. అల్లూరి సీతారామరాజుకి తుపాకీ పట్టడం నేర్పింది షేక్ సదరుల్లాఖాన్, అంతేకాదు ఆయనకు అండదండలుగా నిలిచింది సదరుల్లా ఖాన్. యూసఫ్ మెహర్ ఆలీ అనే ముస్లిం క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించాడు. ఈ సమాచారం చాలామందికి తెలియదు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
టిప్పుపై పాక్ ప్రశంసలు.. కర్ణాటకలో ఆజ్యం!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు మరింత ఉధృతం కానుంది. ఇటీవల టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వివాదం రేపగా, తాజాగా పాక్ ట్వీట్‌తో కన్నడ రాజకీయం మరింత వేడెక్కింది. టిప్పు సుల్తాన్‌ను ‘టైగర్ ఆఫ్ మైసూర్’గా అభివర్ణిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ట్వీట్ చేసింది. టిప్పు సుల్తాన్ 218 వర్థంతి సందర్భంగా ‘టిప్పు సుల్తాన్ టైగర్ ఆఫ్ మైసూర్... ముస్లిం మైసూర్ పాలకుడు ప్రతిభావంతమైన చారిత్రాత్మక వ్యక్తి టిప్పు సుల్తాన్ (బాద్షా నసీబుద్దౌలా సుల్తాన్ ఫతే అలీ బహాదూర్ సాహెబ్)’ గా పాకిస్తాన్ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధిచేకూర్చడం కోసమే పాకిస్తాన్ ఈ విధంగా ట్వీట్ చేసిందని ఆరోపించింది. బ్రిటిష్ సామ్రాజాన్ని టిప్పు సుల్తాన్ దైర్యంగా ఎదుర్కొని, వీరోచితమైన పోరాటం చేశాడని చరిత్రాకారుల అభిప్రాయం. స్వాతంత్య్ర పోరాటంలో టిప్పు సుల్తాన్ కృషి ఎంతో ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. కాగా టిప్పు సుల్తాన్ పోరాటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చరిత్రకారుల సమాచారం ప్రకారం టిప్పు సుల్తాన్ 1750, నవంబర్ 20న మైసూర్లో జన్మించి, 1799 మే 4న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారని చెప్తున్నారు. పాకిస్తాన్‌కి టిప్పు సుల్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదని, ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికే పాకిస్తాన్ ఈ చర్యకు తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2015లో ప్రకటించిన తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. సిద్దరామయ్య నిర్ణయం పట్ల బీజేపీతో సహా పలుసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. టిప్పు జయంతోత్సవాల్లో ఎవ్వరూ పాల్గొనవద్దని, మంగుళూరులో కాథలిక్కులను దారుణంగా చంపిన ఉగ్రవాదిగా బీజేపీ టిప్పును వర్ణించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించి ముస్లింలను ఆకర్షించాలని భావిస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే. -
టిప్పు చుట్టూ కన్నడ రాజకీయాలు
చాలా కాలం తరువాత కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాది కర్నాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తమ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఇరు పార్టీలు ఉపయోగించుకునే పనిలో పడ్డాయి. బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 10 మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దశలో మరోమారు టిప్పు జయంతి వేడుకలపై వివాదాలు రాజుకున్నాయి. టిప్పు జయంతి వేడుకల్లో పాల్గొనాలంటూ.. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపుతున్న ఈ ఆహ్వానాన్ని ఇప్పటికే పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా.. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే ఒక అడుగు ముందుకేసి.. ఈ అవమానకర కార్యక్రమానికి నన్ను అహ్వానించకండి అంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దీంతో వివాదం మరో మలుపు తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ.. టిప్పు సుల్తాన్ తన పాలనలో వేలమంది హిందువులను ఊచ కోతకోశారని పేర్కొన్నారు. అంతేకాక బలవంతంగా వేల మందిని మతమార్పిడి చేయించారని అన్నారు. కర్నాటక ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టిప్పు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. 2015 నుంచి వివాదమే! టిప్పు సుల్తాన్ జయంతి వివాదం 2015 నుంచి కొనసాగుతూనే ఉంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టిప్పు జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ మొదట నుంచి వ్యతిరేకిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇరు పార్టీలు టిప్పు జయంతి ఉత్సవాలను రాజకీయం చేసే పనిలో పడ్డాయి. ఎందుకోసం? కర్ణాటకలో ముస్లింలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో ముస్లిం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ 266వ జయంతి వేడుకలను 2015లో తొలిసారి నిర్వహణకు సిద్ద రామయ్య ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీనిని బీజేపీ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో హిందువులు, క్రైస్తవును టిప్పు సుల్తాన్ ఊచ కోత కోశాడని బీజేపీ వాదిస్తోంది. టిప్పు సుల్తాన్.. హిందూ, కన్నడ వ్యతిరేకిగా బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ వాదన టిప్పు సుల్తాన్ విషయంలో బీజేపీ వాదనను కాంగ్రెస్ పార్టీ అదే విధంగా తిప్పికొడుతోంది. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్.. స్వతంత్ర పోరాట యోధుడని కీర్తిస్తోంది. బ్రిటీష్ పాలనను అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి రెండు జాతీయ పార్టీల మధ్య ఓటు బ్యాంక్ రాజకీయాలకు వేదికగా టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవం మారిపోయింది. -
టిప్పు తుపాకీ మాయం?
15 ఏళ్లకు పైగా కనిపించని ‘మైసూర్ పులి’ ఆయుధం ఈస్టిండియా కంపెనీ కూటమిలో భాగంగా టిప్పును ఓడించాక నిజాంకు దక్కిన తుపాకీ మ్యూజియానికి బహుమతిగా అందజేత స్టోర్‌లో ఉందంటున్నా బయటపెట్టని పురావస్తు శాఖ ఇప్పటి వరకు దృష్టి సారించని తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తాను వేటాడదలచుకున్న జంతువుపై పంజా విసిరేందుకు పులి కాచుక్కూర్చుంటుంది.. శత్రువును మట్టుబెట్టడంలో తన పంథా అదేనని చాటేందుకు ‘మైసూర్ పులి’ టిప్పు సుల్తాన్ తన తుపాకీపై పులి బొమ్మను చెక్కించాడు. 1799తో టిప్పు సుల్తాన్ జీవితం ముగిసిపోయింది. మరి ఆయన ముచ్చటపడి తయారు చేయించుకున్న ఆ తుపాకీ ఎక్కడుంది? టిప్పు సామ్రాజ్యం ‘మైసూరు’లోనో.. ఆ ప్రాంతమున్న కర్ణాటక రాజధాని బెంగళూరులోనో కాదు.. మన భాగ్యనగరం హైదరాబాద్‌లో ఆ తుపాకీ ఉంది. కాదు ఉండేది.. ఇప్పుడు ‘అదృశ్యమైంది’. అదృశ్యమవడం ఏమిటనేదానికి పురావస్తు శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది. ఎటు పోయింది?: టిప్పు సుల్తాన్ చేతిలో ఎంతో ఠీవిగా గర్జించిన ఆ తుపాకీ.. దాదాపు 15 ఏళ్ల కిందటి వరకు నాంపల్లిలోని ైవె ఎస్సార్ స్టేట్ మ్యూజియం సెంట్రల్ హాల్లో గంభీరంగా దర్శనమిచ్చింది. కానీ తర్వాత మాయమైపోయింది. అసలు సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించే పురాతన వస్తువుల జాబితాలో ఆ చారిత్రక తుపాకీ టాప్‌లో నిలిచింది. అయితే టిప్పు తుపాకీ స్టోర్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. మరి అంత ప్రాధాన్యమున్న పురాతన సంపదను ఎందుకు దాచి పెట్టారనే దానికి మాత్రం సమాధానం లేదు. నిజంగా స్టోర్‌లో ఉందా, లేదా అన్నదానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కూడా ఇక్కడి చారిత్రక ప్రాధాన్యమున్న సంపద లెక్కలను ప్రభుత్వం తేల్చలేకపోయింది. ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమీక్ష కూడా జరగలేదు. ఉన్నట్టుండి గల్లంతు... టిప్పు సుల్తాన్ దాదాపు 1790 ప్రాంతంలో ప్రత్యేక నిపుణులతో ఈ తుపాకీని రూపొందించుకున్నారని చరిత్ర చెబుతోంది. కర్ర, బంగారం, వెండి, ఉక్కుతో దానిని రూపొందించారు. ఆ తుపాకీ బట్ (కలపతో చేసిన వెనుకభాగం)పై వేటలో నిమగ్నమైన పులి బొమ్మ ఉంటుంది. దాని కళ్లు మెరిసేలా బంగారంతో రూపొందించారు. టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ఆ తుపాకీని ధరించేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈస్టిండియా కంపెనీ, మరాఠాలు, నిజాం సైన్యం కూటమితో జరిగిన యుద్ధంలో టిప్పు ఓటమిపాలైనప్పుడు.. ఆ తుపాకీతోపాటు కొంత యుద్ధ సామగ్రిని నిజాం సైన్యం స్వాధీనం చేసుకుందని, వాటిని హైదరాబాద్‌కు తరలించి మ్యూజియంలో భద్రపరిచారని అంటారు. అనంతర కాలంలో స్టేట్ మ్యూజియం ఏర్పాటు చేసినప్పుడు నిజాం ఆ తుపాకీని ప్రత్యేకంగా బహూకరించాడని చెబుతారు. అప్పటి నుంచి మ్యూజియం దిగువ భాగంలోని సెంట్రల్ హాల్లో టిప్పు తుపాకీని ప్రదర్శనకు ఉంచారు. సందర్శకులు ప్రత్యేకంగా దాన్ని చూసేందుకు బారులు తీరేవారు. ఇప్పటికీ కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే సందర్శకులు టిప్పు తుపాకీ గురించి మ్యూజియం సిబ్బందిని ఆరా తీస్తుండటం గమనార్హం. కానీ చాలా కాలంగా అది కనిపించడం లేదు. దాన్ని త్వరలోనే సందర్శనకు ఏర్పాటు చేస్తామంటూనే దాదాపు పదిహేనేళ్లుగా వాయిదా వేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే బుద్ధుడికి సంబంధించిన మ్యూజియం రూపొందించే క్రమంలో టిప్పు తుపాకీతోపాటు కొంత యుద్ధ సామగ్రిని కూడా తరలించారని... తర్వాత వాటి కోసం ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయలేక స్టోర్‌లో పడేశారని కొందరు సిబ్బంది అంటున్నారు. అధికారులు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పటం లేదు. -
ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు.. ఓ వ్యక్తి అరెస్టు!
బెంగళూరు: మైసూర్ రాజు టిప్పూ సుల్తాన్ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని కర్ణాటక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మధ్య కర్ణాటకలోని కొప్పల పట్టణానికి చెందిన మంజునాథ్ ముద్గల్ ఐటీఐ విద్యార్థి. అతను తన ఫేస్బుక్ ఖాతాలో టిప్పూ సుల్తాన్ ఫొటోలు పెట్టి.. ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు చేశాడు. గతంలోనూ అతను ముస్లిం రాజైన టిప్పూ సుల్తాన్ ఫొటోలు అభ్యంతరకరంగా పోస్టు చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇది స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని భావించిన పోలీసులు మంజునాథ్‌ను అరెస్టు చేశారు. ఫేస్బుక్ అకౌంట్లోని ఫొటోలన్నింటినీ తొలగించాలని అతన్ని ఆదేశించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘టిప్పు’ అంత గొప్పవాడేం కాదు
కర్ణాటకలో జయంతి వేడుకలపై సుబ్రమణ్య స్వామి బెంగళూరు: టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ పాలకులకు సర్వేంట్‌గా పనిచేశారని, జయంతి వేడుకలు జరుపుకోవాల్సినంత గొప్పవాడేం కాదని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. నేతాజీపై ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి హాజరయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18వ శతాబ్దంలో టిప్పు మైసూర్ పాలించడం తప్ప, ప్రజారంజక పాలన అందించినట్లు ఎక్కడా లేదని అన్నారు. టిప్పు.. తనకు తానుగా బ్రిటీష్ పాలకులపై పోరాడలేదని, ఫ్రెంచ్ వారి ప్రోద్బలంతోనే అది జరిగిందని స్వామి చెప్పారు. ఇదిలా ఉండగా.. మహాత్మా గాంధీ, సుభాష్‌చంద్రబోస్‌తో పాటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాద్యాయల మరణం కేసులపై పునర్విచారణ జరిపించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. -
టిప్పు సుల్తాన్ ఖడ్గం రూ. 20 కోట్లు
న్యూఢిల్లీ: మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఓ ఖడ్గం వేలంలో భారీ ధర పలికింది. పులి తల పిడితో కూడిన, రత్న ఖచితమైన ఈ ఖడ్గం ఏకంగా రూ. 20.49 కోట్లకు అమ్ముడుపోయింది. టిప్పు సుల్తాన్ ఖడ్గం, కవచాలతో సహా 30 ఆయుధాలను లండన్‌కు చెందిన బోన్హ్యామ్స్ సంస్థ ‘ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్’ పేరుతో ఏప్రిల్ 21న నిర్వహించిన వేలంలో విక్రయించింది. ఈ వేలంలో టిప్పు వస్తువులన్నీ రూ. 57 కోట్ల ధర పలికాయి. -
కమల్ హాసన్ ‘టిప్పు సుల్తాన్' ఫస్ట్ లుక్
హైదరాబాద్: వినూత్న సినిమాలకు, వైవిద్యమైన పాత్రలకు పెట్టింది పేరైన ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో ‘టిప్పు సుల్తాన్' సినిమా చేయబోతున్నాడు. మైసూర్ కింగ్ టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు. కమల్ హాసన్ ‘టిప్పు సుల్తాన్’(ఫస్ట్ లుక్) ప్రస్తుతం కమల్ హాసన్ ‘విశ్వరూపం-2' చిత్రానికి తుది మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సూపర్ హిట్ మూవీ ‘విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘టిప్పు సుల్తాన్' చిత్రం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టిప్పు సుల్తాన్ ఉంగరమిది
-
టిప్పు సుల్తాన్ ఉంగరమిది
మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ ధరించిన ఉంగరమిది. 1799లో శ్రీరంగపట్టణం వద్ద బ్రిటిష్ సైన్యంతో జరిగిన యు ద్ధంలో ఆయన మరణించినపుడు సుల్తాన్ వేలికి ఈ ఉంగరముందని ఓ కథనం. 41.2 గ్రాముల బరువైన ఈ ఉంగరాన్ని శుక్రవారం లండన్‌లో క్రిస్టీస్ సంస్థ వేలం వేయగా రూ.1.42 కోట్ల ధర పలికింది.